కొండపల్లి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 118:
కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, [[నర్తనశాల]], నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం -ఇవన్నీ ఒక కొండపైనే ఉన్నాయి. కొండపల్లి కోటను ప్రస్తుతము పునర్నిర్మిస్తున్నారు.
 
క్రీశ1687 మధ్య కాలంలో [[మొఘల్ సామ్రాజ్యం|మొగల్]] చక్రవర్తి [[ఔరంగజేబు]], తరువాత [[గోల్కొండ|గోల్కొండ నవాబు]]<nowiki/>లు అనంతరం నాజర్ జంగ్ పరిపాలించారు.
=== చరిత్ర ===
క్రీశ1360వ సంవత్సరంలో రెడ్డి రాజైన అనవేమారెడ్డి ఈ కోట నిర్మాణం చేపట్టాడు. రెడ్డి రాజుల అనంతరం గజపతి రాజులు ఇక్కడినుంచి పరిపాలన సాగించారు.తరువాత మహ్మదీయ రాజైన నిజాం ఉల్ ముల్మ్ పాలనలో మంత్రి గవాన్ ఆధ్వర్యంలో ఈ కోటకు క్రీశ 1471లో మరమ్మతులు జరి గాయి. ఆ తరువాత మహ్మద్ షా కాలంలో పురుషోత్తమ గజపతిని ఈ కోటకు అధిపతిని చేశాడు. క్రీశ 1516 సంలో [[విజయనగర]] రాజైన [[శ్రీ కృష్ణదే వరాయులు]] ఈ కోటను ముట్టడించి తిరిగి గజపతి రాజులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
అనంతరం [[గోల్కొండ]] ప్రభువైన [[ముహమ్మద్ కులీ కుతుబ్ షా|కులీ కుతుబ్ షా]] ఈ కోటను ఆక్రమించినట్లు తదుపరి [[ఇబ్రాహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కులీ కుతుబ్ షా]] కాలంలో ఈ కోటకు మెరుగులు దిద్ది, ఇతర సౌధాలు నిర్మించాడని చెబుతారు. అందుకే కొండ కింద భాగంలో అతని పేరుపై [[ఇబ్రహీంపట్నం]] గ్రామం నిర్మించినట్లు ఆధారాలున్నాయంటారు. ఆ తరువాత [[మహ్మద్ కులీ కుతుబ్ షా]] కాలంలో ఈ కోటకు కట్టుదిట్టమైన భద్రత చేపట్టి చెరువులు, బావులు మొదలైనవి తవ్వించి నీటి సదుపాయాలు కల్పించారు. క్రీశ1687 మధ్య కాలంలో [[మొఘల్ సామ్రాజ్యం|మొగల్]] చక్రవర్తి [[ఔరంగజేబు]], తరువాత [[గోల్కొండ|గోల్కొండ నవాబు]]<nowiki/>లు అనంతరం నాజర్ జంగ్ పరిపాలించారు.
 
క్రీ.శ. 1766లో జనరల్ కాలియేడ్ కోటను ఆక్రమించి, కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. చివరగా కీశ 1767లో [[బ్రిటీష్]] వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలోకి తీసుకుని తమ సిపాయీలకు శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక సమస్యలతో క్రీశ1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. ఆ తరువాత దీనిని పట్టించుకున్నవారు లేరు. 1962 నుంచి [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి వచ్చాక రక్షిత కట్టడంగా ప్రకటించారు.[[File:Fourcourt.JPG|thumb|ప్రోలయ వేమారెడ్డి నిర్మించిన కొండపల్లి కోట శిథిలాలు]]
"https://te.wikipedia.org/wiki/కొండపల్లి" నుండి వెలికితీశారు