చర్చ:ముసునూరి నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

చి Pavan santhosh.s, పేజీ చర్చ:ముసునూరి కమ్మ రాజులు ను చర్చ:ముసునూరి నాయకులు కు దారిమార్పు ద్వారా తరలించ...
పంక్తి 29:
ముసునూరి నాయకులు కమ్మవారనడం ఉన్నదే, కానీ వారిని ముసునూరి నాయకులు అనే వారి చరిత్ర వెలికి తెచ్చిన చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యవహరించారు. తెలుగు వికీపీడియా అన్నది మౌలిక పరిశోధనకు స్థలం కాదు కాబట్టి, ఇప్పటికే పరిశోధకులు ఏ పేరుతో వ్యవహరించారో అదే పేరు కొనసాగించడం సరైన పని. కనుక మునుసూరి కమ్మ రాజులు అన్న పేరును మునుసూరి నాయకులు అని మార్చాల్సిందిగా ప్రతిపాదిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:28, 5 జనవరి 2018 (UTC)
: నేను సమర్ధిస్తున్నాను. --[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 12:59, 5 జనవరి 2018 (UTC)
:: ఈ వ్యాసంలో ఉన్న రిఫరెన్సు - బౌద్ధం ఆంధ్రం 88వ పేజీలో మునుసూరి నాయకుల గురించి ఉన్న ప్రస్తావన కూడా ఇక్కడ సందర్భోచితం కనుక ఇస్తున్నాను - ''జాయపసేనాని తర్వాత చెప్పుకోదగిన కమ్మ నాయకులు మునుసూరి నాయకులు. నూజీవీడు ప్రాంతానికి చెందిన వీరు, కాకతీయుల పతనానంతరం ఢిల్లీ నవాబును పారద్రోలి కొంతకాలం వరంగలులో పాలించారు. పోలయ, కాపయ నాయకుల వీరోచిత గాథలు స్వర్ణాక్షరాలతో లిఖించదగినవి. కానీ వీరి ప్రతిఘటన ఎక్కువ కాలం కొనసాగలేదు.'' ఇక్కడ మునుసూరి నాయకులు కమ్మవారేనన్న స్పష్టత ఉంది, అయితే వారిని మునుసూరి నాయకులు అనే రచయిత ప్రస్తావించాడు తప్ప మునుసూరి కమ్మ రాజులు అనో మరోటో ప్రస్తావించలేదన్నది గమనించాలి. సుస్పష్టమైన ఆధారాలు ఉండడం, రవిచంద్ర వంటివారూ పరిశీలించి సమర్థించడం ఆధారంగా వ్యాసం పేరు మునుసూరి నాయకులుగానే మార్చాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 08:54, 6 జనవరి 2018 (UTC)
Return to "ముసునూరి నాయకులు" page.