స్కాచ్ మెరీన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
బాయిలరు యొక్క స్టీము ఉత్పత్తి సామర్థ్యాన్ని,అవసరాన్ని బట్టి ఫైరుట్యూబుల్లొ ఫ్లూగ్యాసులు ఒకసారిలేదా అంతకు మించి రెండు లేదా మూడుసార్లు పయనించేలా బాయిలరు సిలిండరులో ఫైరు ట్యూబులవరుసలు సమూహంగా అమరిక వుండును. అనగా ఒకవరుసలో కొన్ని ట్యూబులు పక్కగా వుండీ ఆ వరుసపై మరో వరుసలో ట్యూబులు పక్కపక్కగా కొద్ది ఖాలి వదిలి వుండును.ఇలా ట్యూబుల వరుసలు ఒకదాని మీదమరోవరుసచొప్పున దొంతరలా వుండును. ఫ్లూ గ్యాసులు బాయిలరు సిలిండరు/షెల్ లో వున్న అన్ని ఫైరు ట్యూబులలో ఒకచివర నుండి మరో చివరకు పయనించి పొగ గదిని చేరిన దానిని సింగల్ పాసు అనియు,, ఫ్లూ గ్యాసులు దొంతరగా వరుసగా వున్న ఫైరుట్యూబులలో రెండవ చివరకు చేరి అక్కడి నుండి వాటి పక్కన లేదా పైన వున్న మరో దొంతరవరుస ట్యూబులద్వారా పయనించి స్మోకు బాక్సు చేరిన ఆబాయిలరును టూ పాస్(two pass)బాయిలరు అందురు.అలాగే మూడు సార్లు పయనించిస్మోకు బాక్సు చేరిన త్రిపాస్ బాయిలరు అందురు.సింగిల్ పాస్ మరియు త్రి పాస్ బాయిలరులో స్మోక్ బాక్సు బాయిలరు ముందు బాగంలో వుండగా, టూపాస్ బాయిలరులో స్మోక్ బాక్సు సిలిండరు వెనుక భాగంలో వుండును.
==డబుల్ ఎండ్ ఫర్నేసు వున్న బాయిలరు==
సామాన్యంగా బాయిలరు కు ఒకవైపుననే ఫైరు బాక్సు/పర్నేషు ఉండును.కొన్ని బాయిలరులు డబుల్ ఎండ్ ఫర్నేష్ కల్గి వుండును.అనగా ఈ బాయిలరులో రెండు వైపులా ఫర్నేషు వుండి సిలిండరు/షెల్ మధ్య భాగంలో కంబుషన్ గది వుండును.అనగా రెండు ఫర్నేష్ ట్యూబులు.సిలిండరు మధ్యలో ఒకే కంబుసన్/దహన గదిని కల్గి వుండును.ఇటువంటి డబుల్ ఎండ్ ఫర్నేష్ బాయిలరు కంబుసన్ గదిలో నిలువు ట్యూబులు ఉండును.ఇందువలన సిలిండరు లోని నీటి సర్కులేసన్ జరుగును.అందువలన నీరు త్వరగా వేడెక్కును<ref name=scotch/>.
 
==టైటానికు షిప్పులో స్కాచ్ మెరీన్ బాయిలరులు==
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టైటానిక్(R.M.S. Titanic) షిప్పులో మూడు ఫర్నేసులు కల్గిన 24 డబుల్ ఎండేడ్ ఫర్నేసు బాయిలరులు,మూడు పర్నేసులున్న 5 సింగల్ ఎండ్ పర్నేసు బాయిలరులను అమర్చారు.వీటికి బొగ్గును అందించుటకు విద్యుత్తు నియంత్రణ కల్గిన స్టాకరులను అమర్చారు.