స్కాచ్ మెరీన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
===మ్యాన్ హోల్===
ఇది బాయిలరు షెల్ పైభాగాన అమర్చబడి వుండును.ఇది సులభంగా మనిషి షెల్ లోపలి వెళ్ళు సైజులో వుండును.సంవత్సరాంత మరమత్తుసమయంలోఆపరేటరు లోపలికివెళ్ళి ట్యూ బులు ఎలా ఉన్నది, స్కేల్ ఏమేరకు ఉన్నది వంటి వి తనిఖి చెయ్యుటకు ఈ మ్యాన్ ఉపయోగ పడును.అలాగే బాయిలరు దిగువ భాగాన మడ్ హోల్ వుండును.దీని ద్వారా బాయిలరు అడుగున సెటిల్ అయ్యే బురద వంటి దాన్నిని తొలగించెదరు.
==బాయిలరుకు అదనంగా అమర్చబడి వుండు ఉపకరణాలు==
 
===ఫీడ్ వాటరు పంపు===
[[File:Lantern Slide - Tangyes Ltd, Belt Driven Three-Cylinder Horizontal Ram Pump, circa 1910.jpg|thumb|right|150px|Ram Pump]]
[[File:SR horizontal multistage pumps.jpg|thumb|right|150px|హరిజోటల్ మల్టి స్టెజి వాటరు పంపు]]
ఇది బాయిలరుకు కావాల్సిన వాటరును బాయిలరుకు పంపింగు చెయ్యును. బాయిలరు వాతావరణ వత్తిడికి కన్న ఎక్కువ వత్తిడిలో ( 9-10Kg/cm2) స్టీము ఉత్పత్తి చేయ్యును.కావున ఫీడ్ పంపు బాయిలరు వర్కింగు ప్రెసరు కన్న ఒకటిన్నర రెట్లు ఎక్కువ వత్తిడిలో వాటరును తోడు పంపును బాయిలరుకు అమర్చెదరు. అంతేకాదు బాయిలరు గంటకు స్టీముగా మార్చు నీటి పరిమాణం కన్నరెండితలు ఎక్కువ నీటినితోడు కెపాసిటి కల్గి వుండును.ఫీడ్ పంపుగా గతంలో రెసిప్రోకెటింగ్/రామ్ పంపు వాడెవారు.తరువాత హరిజంటల్ మల్టి స్టెజి సెంట్రిఫ్యుగల్ పంపులను వాడుచున్నారు.కొత్తగా వెట్రికల్ మల్టి స్టేజి పంపులు వాడుకలోకి వచ్చాయి.
 
===[[ బాయిలరు గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు| గ్లాసు ట్యూబువాటరు లెవల్ ఇండికేటరు గేజ్/వాటరు గేజ్]]===
బాయిలరులో ఎప్పుడు ఫైరుట్యూబుల మట్టం దాటి నీరు వుండాలి. అప్పుడే ఎటు వంటి ప్రమాదం లేకుండా నీరు స్టీముగా ఏర్పడును. బాయిలరులో ఇంధనం వలన ఏర్పడు వేడి వాయువుల ఉష్ణోగ్రత 1000°C డిగ్రీలు దాటి వుండును.ట్యూబుల మట్టానికి దిగువన వాటరు ఉన్న చో, ఇంతటి ఉష్ణోగ్రత ఉన్న ఫ్లూగ్యాసెస్ ఫైరుట్యూబుల ద్వారా వెళ్ళునపుడు ఉష్ణ వినిమయం జరుగనందున ట్యూబుల ఉష్ణోగ్రత పెరిగి బాయిలరు ట్యూబులు పేలి పోవును.అందువలన బాయిలరు షెల్ లో నీటి మట్టం ట్యూబు బండిల్ కన్నఎక్కువ మట్టం వరకు ఉండటం అత్యంత ఆవశ్యకం.బాయిలరు షెల్ లో వాటరు ఎంత ఎత్తులో నీరు వున్నది ఈ వాటరు గేజ్ వలన తెలుస్తుంది.
 
===ప్రెసరు గేజ్===
ఈ పరికరం బాయిలరులో ఉత్పత్తి అయ్యే స్టీము ప్రెసరును చూపిస్తుంది.
=== సెప్టి వాల్వు===
[[File:Safety valve-01.jpg|thumb|right|150px|స్ప్రింగు లోడేడ్ సెప్టి వాల్వు]]
బాయిలరు షెల్ లో వర్కింగు ప్రెసరు కన్న ఎక్కువ స్టీము తయారై, ఏర్పడిన స్టీమును అదే ప్రమాణంలో వాడనప్పుడు, బాయిలరులో స్టీము పరిమాణంపెరిగి, అధిక వత్తిడి ఏర్పడి బాయిలరు షెల్ ప్రేలి పోయే ప్రమాదం ఉంది.ఈ సేఫ్టివాల్వు, బాయిలరులో పరిమితి మించి ఎక్కువ ప్రెసరులో ఏర్పడిన స్టీమును బాయిలరు బయటకు విడుదల చెయ్యును.
===స్టీము స్టాప్ వాల్వు===
ఇది బాయిలరులో ఉత్త్పతి అయ్యిన స్టీమును అవసరమున్న మేరకు మెయిన్ స్టీము పైపుకు వదులుటకు ఉపయోగపడును.దీనిద్వారా బాయిలరు స్టీమును వినియోగ స్థావరానికి అవసర మైనపుడు పంపుట, అక్కరలేనప్పుడుఆపుట చెయ్యుదురు.
===బ్లోడౌన్ లేదా బ్లో ఆఫ్ కాక్===
బాయిలరులోని TDS ప్రమాణాన్ని తగ్గించుటకు అధిక TDS వున్న నీటిని బయటకు వదులుటకు ఈ వాల్వువును ఉపయోగిస్తారు.ఇది రాక్ అండ్ పినియన్ రకానికిచెందిన కంట్రోల్ వాల్వు.దీనిని ఇత్తడి లేదా కాస్ట్ స్టీలుతో చెయ్యుదురు.
===ఫుజిబుల్ ప్లగ్===
ఈ ప్లగ్‌ను ట్యూబు ప్లేట్ పైన ట్యూబుల కన్న కొద్దిగా ఎత్తులో బిగించబడివుండును.ఇది అతితక్కువ [[ఉష్ణోగ్రత]]కు కరిగే [[సీసము]] లోహంతో చెయ్యబడివుండి ఏదైనా కారణం చే ఫీడ్ పంపు పని చెయ్యక పోవడం వలన షెల్ లోనినీటి మట్టం ఫుజిబుల్ ప్లగ్ మట్టం కుకన్నతగ్గిన, ఇది కరిగిపోయి, దాని ద్వారా స్టీము, వాటరు కంబుసన్ చాంబరు, ఫైరు బాక్సు లోకి వచ్చి, ఇంధనాన్నిఆర్పి వేయును.
 
==ఇంధన పంరంగా స్కాచ్ మెరీన్ బాయిలరువిభజన==