వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు చిన్నదిగా వుండి తక్కువ ట్యూబులు కల్గి ఉన్నందున నిర్మాణం సులభంగా ఉండి దృడముగా తయారుచెయ్యు వెసులుబాటు వున్నది. కాని పరిమాణంలో చిన్నదిగా ఉన్నందున తక్కువ పరిమాణంలో మాత్రమే స్టీము ఉత్పత్తి అగును.అందు వలన తక్కువ పరిమాణంలో స్టీము అవసరాలకు మాత్రమే ఈ బాయిలరు ఉపయుక్తం.బాయిలరులో ట్యూబులు పరిమిత సంఖ్యలో ఉండ టం వలన బాయిలరు హిటింగు సర్ఫేస్ ఏరియా అనగా వేడి అగు ఉపరితల వైశాల్యం తక్కువ.అందువలన స్టీము ఉత్పత్తి సామర్ద్యం తక్కువ, కాని బాయిలరు లోపల ఎక్కువ ఘనపరిమాణం లో ఖాలీ ఉన్నందున ఎక్కువ ఘన పరిమాణంలో స్టీము నిలువ ఉండు సదుపాయం ఉన్నది.క్రేన్ వంటి వాటికి స్టీము కంటిన్యూయసుగా అవసరం లేనందున,ఈ బాయిలరు వాటిని ఆపరేట్ చెయ్యుటకు ఉపయోగకరం.
==బాయిలరు నిర్మాణం==
ఈ బాయిలరు నిలువుగా స్తుపాకారంగా వుండును.లోపల వున్న నిలువు గుల్ల(shell) స్తుపాకార నిర్మాణం వెలుపల మరో నిలువు స్తుపాకార నిర్మాణం వుండును.లోపలి స్తూపాకర ంపైభాగం చాపం వలె వంపుగా వుండి దానుండి ఒక గొట్తం వెలుపలి స్తూపాకర నిర్మాణం చాపకారపు కప్పుకు అతుకబడి వుండును.లోపలి పొడవైన స్తుపాకార నిర్మాణాని ఫైరు బాక్సు అందురు.లోపలి ఫైరు బాక్సు నిర్మాణం పైబాగం ఉబ్బుగా వుండి దాని మీద ఒక ఫ్లూ గ్యాస్ గొట్టం బయటి షెల్ వరకు వుండును.దానిని బయట వున్న పొగ గొట్టానికి కలుపబడి వుండును.కొన్ని బాయిలరులో లోపలి ఫైరు బాక్సు పైబాగం మరియు బయటి షెల్ పై లోపలి భాగాన్ని కలుపు తూ స్టే రాడులు ఉండును.ఈ ఉక్కు కడ్డీల వలన బాయిలరు స్తూపాకార నిర్మానికి రూపద్రుడత్వం ఏర్పడును.లోపలి ఫైరు బాక్సు ఎత్తు బయటి స్తుపాకార నిర్మాణం ఎత్తులో సగం వరకు వుండును.ఫైరు బాక్సులో ఏర్పడిన ఫ్లూ [[వాయువు]] లు ఫైరు బాక్సు పై బాగంనున్నఒక గొట్టం ద్వారా బయటి షెల్ పై భాగం చేరి అక్కడి నుండి చిమ్నీకి వెళ్ళును. బయటి,మరియు లోపలి ఫైరు బాక్సు మధ్య ఖాళీలో నీరు నింపబడి వుండును.
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:యంత్రాలు]]