నల్ల రామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
'''కోటపల్లి (నల్ల) రామమూర్తి''' ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్ర మరియు రంగస్థల నటుడు.
హాస్యనటుడిగా ఇతడు సుప్రసిద్ధుడు. [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పాలకొల్లు]] మండలంలోని [[చింతపర్రు]] ఈయన స్వస్థలం. ఈయన 1913లో జన్మించాడు. ఇతడు సుమారు రెండు వేల నాటకాలలో, 112 సినిమాలలో నటించాడు.
 
==జీవిత విశేషాలు==
సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఇతనికి చదువు అంతగా అబ్బలేదు. చక్కని గాత్రం ఉండడంతో నాటకరంగాన్ని తేలికగా ఆకర్షించగలిగాడు. తన 15వ యేటనే శ్రీకృష్ణతులాభారం నాటకంలో వసంతకుని వేషం వేసి అందర్నీ మెప్పించాడు. ఇంగ్లీషు చదువు అబ్బకపోయినా తెలుగులో అనేక వచన గ్రంథాలను చదవడం వల్ల, నాటకాలలోని పద్యాలు కంఠస్తం చేయడం వల్ల అచిర కాలంలోనే రచయితగా మారాడు. "తూర్పు సావిత్రి", "సీతమ్మోరి వనవాసం", "పండగ అల్లుళ్లు" మొదలైన హాస్యనాటికలను స్వయంగా రచించి తన బృందంతో ఆంధ్రదేశం అంతటా ప్రదర్శనలు ఇచ్చాడు. గాత్రం కూడా ఉండడంతో [[అద్దంకి శ్రీరామమూర్తి]], [[ఈలపాట రఘురామయ్య]], [[పువ్వుల సూరిబాబు]], [[కొచ్చెర్లకోట సత్యనారాయణ]], [[జొన్నవిత్తుల శేషగిరిరావు]], [[స్థానం నరసింహారావు]], [[సి.ఎస్.ఆర్.ఆంజనేయులు]] మొదలైన రంగస్థల నటులతో కలిసి అనేక పౌరాణిక నాటకాలలో హాస్యభూమికలు ధరించాడు.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/నల్ల_రామమూర్తి" నుండి వెలికితీశారు