మకర సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
* ఈ వ్యాసం [[సంక్రాంతి పండుగ]] గురించి. ఇతర వాడుకల కొరకు, [[క్రాంతి (అయోమయ నివృత్తి)]] చూడండి.
----
{{Use British English|date=March 2017}}
పంక్తి 25:
[[దస్త్రం:SANKRANTI.jpg|right|thumb|350px|సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు]]
 
[[సంక్రాంతి]] లేదా '''సంక్రమణము''' అంటే మారడం అని అర్థం. [[సూర్యుడు]] మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం [[సంక్రాంతి]]. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో[[పుష్యమాసము|పుష్యమాసం]]<nowiki/>లో, [[హేమంత ఋతువులోఋతువు]]<nowiki/>లో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే '''మకర సంక్రాంతి'''కి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది [[జనవరి]] మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే [[జనవరి 15]] తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.
 
ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( [[భోగి]], [[మకర సంక్రమణం]], [[కనుమ]]) ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు [[ముక్కనుమ]] ) జరుపతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో [[రైతులు]] ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి [[రైతులు|రైతుల]] పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో [[ఉత్తరాయణం]] మొదలవుతుంది.
 
నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా [[తెలుగు]]నాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. [బుడబుక్కలవాళ్లు], [[పగటివేషధారులు]], రకరకాల జానపద వినోద [[కళాకారులు]] తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను [[రంగవల్లులు]], [[గొబ్బెమ్మ]] లతో అలంకరిస్తారు. [[ముగ్గులు]] వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద [[ధాన్యము|ధాన్యం]] బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు [[భోగిమంట]] విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు [[కొత్త అల్లుడు]] తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. [[కుక్కుట శాస్త్రం|కోడి పందాలు]], ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.
 
== ఉత్తరాయణ పుణ్యకాలం ==
"https://te.wikipedia.org/wiki/మకర_సంక్రాంతి" నుండి వెలికితీశారు