"వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు" కూర్పుల మధ్య తేడాలు

బయటి స్తూపాకర షెల్ పైభాగాన ఒక పెద్ద మాన్ హోల్ వుండును.మాన్ హోల్ ద్వారా లోపలికి వెళ్లి బాయిలరును తనిఖీ చేసుకోవచ్చు.అలాగే బాయి లరు అదనంగా రెండు చిన్న హ్యాండ్ హోల్సు ఫర్నేసు/ఫైరు బాక్సు లో వున్న క్రాసుపైపులకు ఎదురుగా వుండును. బాయిలరు నిర్వహణ లేదా మరమత్తుల సమయంలో వీటిని తెరచి పైపుల్లో జమయ్యిన బురద వంటి దానిని హ్యాండ్ హోల్సుతెరచి లోపలి భాగాలు క్లీన్ చెయ్య వచ్చును. బాయిలరు ఫైరు హోల్ ద్వారా బయటి లోపలి షెల్ బాగాలులోపలి ఫైరు బాక్సు అతుకకబడి వుండును.ఫైరు హోల్ కు రంధ్రాలున్నతలుపు వుండును.ఫైరు బాక్సులో గ్రేట్ అను నిర్మాణం వుండును. గ్రేట్ లోకాస్ట్ ఐరన్ పలకలను ఒకదానిపక్క మరొకటి చొప్పున పేర్చి వుండును.పలకల మధ్య ఖాళి వుండి ,ఈ ఖాలిల గుండా ఘన ఇంధనాన్ని మండించగా ఏర్పడిన బూడిద కింద వున్న బూడిద గుంత లో పడును.
==బాయిలరు పని చెయ్యు విధానం==
మొదట బాయిలరులో కావాల్సిన వరకు నీటిని నింపి,ఫైరు బాక్సు గ్రేట్ మీద బొగ్గును పేర్చి మండించెదరు.గ్రేట్ మీద బొగ్గు మండటం వలన వేడి వాయువులు ఏర్పడును.వేడి వాయువులు ఫైరు బాక్సు గుండా క్రాస్ బా క్సును దాటుకుని పైకి వెళ్ళునపుడు ఉష్ణతా సంవహనము చర్య వలన లోపలి షెల్/డ్రమ్ములోని నీరు వేడెక్కును.నీరు మరింతవేడెక్కి స్టీముగా మారి బయటి షెల్ పైభాగాన జమ అవడం మొదలగును. తగినంత పీడ నం తో స్టీము జమ అయిన తరువాత బాయిలరు పైభాగాన వున్న స్టీము వాల్వును తెరచి స్టీమును అవసరమున్న చోట ఉపయోగిస్తారు . ఇంధనం/బొగ్గు కాల్చగా ఏర్పడిన బూడిద గ్రేట్ పలకలకున్న రంధ్రాల ద్వారా కింద నున్న బూడిద గుంత/యాష్ పిట్ లో జమగును.
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:యంత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2286947" నుండి వెలికితీశారు