"వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు" కూర్పుల మధ్య తేడాలు

==బాయిలరు పని చెయ్యు విధానం==
మొదట బాయిలరులో కావాల్సిన వరకు నీటిని నింపి,ఫైరు బాక్సు గ్రేట్ మీద బొగ్గును పేర్చి మండించెదరు.గ్రేట్ మీద బొగ్గు మండటం వలన వేడి వాయువులు ఏర్పడును.వేడి వాయువులు ఫైరు బాక్సు గుండా క్రాస్ బా క్సును దాటుకుని పైకి వెళ్ళునపుడు ఉష్ణతా సంవహనము చర్య వలన లోపలి షెల్/డ్రమ్ములోని నీరు వేడెక్కును.నీరు మరింతవేడెక్కి స్టీముగా మారి బయటి షెల్ పైభాగాన జమ అవడం మొదలగును. తగినంత పీడ నం తో స్టీము జమ అయిన తరువాత బాయిలరు పైభాగాన వున్న స్టీము వాల్వును తెరచి స్టీమును అవసరమున్న చోట ఉపయోగిస్తారు. ఇంధనం/బొగ్గు కాల్చగా ఏర్పడిన బూడిద గ్రేట్ పలకలకున్న రంధ్రాల ద్వారా కింద నున్న బూడిద గుంత/యాష్ పిట్ లో జమగును.ఏర్పడిన బూడిదను బాయిలరు సహాయకుడు ,షవల్ పారలతోతీసి ట్రాలీ లో వేసి బూడిద ప్రాంగాణానికి తరలిస్తాడు.
==బాయిలరులో వుండు భాగాలు==
*బయటి నిలువు స్తూపాకరం
*లోపలి నిలువు స్తూపాకరం
*క్రాస్ పైపులు
*ఫైరు బాక్సు
*గ్రేట్
*బూడిద గుంట
*తనిఖీ చెయ్యు మ్యాన్ హోల్స్ మరియు హండ్ హోల్స్
*పొగ గొట్టం
=బాయిలరు అనుబంధ ఉపకరణాలు==
*వాటరు ఫీడ్ పంపు
*ప్రెసరు గేజి
*వాటరు గేజి
*సేఫ్టీ వాల్వు
*స్టీము మరియు చెక్ వాల్వులు
*బ్లో డౌన్ వాల్వు
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:యంత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2286949" నుండి వెలికితీశారు