"వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు" కూర్పుల మధ్య తేడాలు

వెర్టికల్ క్రాస్ ట్యూబు బాయిలరు చిన్నదిగా వుండి తక్కువ ట్యూబులు కల్గి ఉన్నందున నిర్మాణం సులభంగా ఉండి, దృడంగా తయారుచెయ్యు వెసులుబాటు వున్నది. కాని పరిమాణంలో చిన్నదిగా ఉన్నందున తక్కువ పరిమాణంలో మాత్రమే స్టీము ఉత్పత్తి అగును. అందువలన తక్కువ పరిమాణంలో స్టీము అవసరాలకు మాత్రమే ఈ బాయిలరు ఉపయుక్తం. బాయిలరు లో ట్యూబులు పరిమిత సంఖ్యలో ఉండటం వలన బాయిలరు హిటింగు సర్ఫేస్ ఏరియా అనగా వేడిఅగు ఉపరితల వైశాల్యం తక్కువ. అందువల్ల స్టీము ఉత్పత్తి సామర్ద్యం తక్కువ, కాని బాయిలరు లోపల ఎక్కువ ఘనపరిమాణంలో ఖాలీ ఉన్నందున ఎక్కువ ఘన పరిమాణంలో స్టీము నిలువ ఉండు సదుపాయం ఉన్నది క్రేన్ వంటి వాటికి స్టీము కంటిన్యూయసుగా అవసరం లేనందున,ఈ బాయిలరు వాటిని ఆపరేట్ చెయ్యుటకు ఉపయోగకరం.
==బాయిలరు నిర్మాణం==
ఈ బాయిలరు నిలువుగా స్తుపాకారంగా వుండును.లోపల వున్న నిలువు గుల్ల(shell) స్తుపాకార నిర్మాణం వెలుపల మరో నిలువు స్తుపాకార నిర్మాణం వుండును.లోపలి స్తూపాకర ంపైభాగం చాపం వలె వంపుగా వుండి దానుండి ఒక గొట్తం వెలుపలి స్తూపాకర నిర్మాణం చాపకారపు కప్పుకు అతుకబడి వుండును.లోపలి పొడవైన స్తుపాకార నిర్మాణాని ఫైరు బాక్సు అందురు.లోపలి ఫైరు బాక్సు నిర్మాణం పైబాగం ఉబ్బుగా వుండి దాని మీద ఒక ఫ్లూ గ్యాస్ గొట్టం బయటి షెల్ వరకు వుండును.దానిని బయట వున్న పొగ గొట్టానికి కలుపబడి వుండును.కొన్ని బాయిలరులో లోపలి ఫైరు బాక్సు పైబాగం మరియు బయటి షెల్ పై లోపలి భాగాన్ని కలుపు తూ స్టే రాడులు ఉండును.ఈ ఉక్కు కడ్డీల వలన బాయిలరు స్తూపాకార నిర్మానికి రూపద్రుడత్వం ఏర్పడును.లోపలి ఫైరు బాక్సు ఎత్తు బయటి స్తుపాకార నిర్మాణం ఎత్తులో సగం వరకు వుండును. ఫైరు బాక్సు లో ఏర్పడిన ఫ్లూ [[వాయువు]] లు ఫైరు బాక్సు పై బాగంనున్నఒక గొట్టం ద్వారా బయటి షెల్ పై భాగం చేరి అక్కడి నుండి చిమ్నీకి వెళ్ళును. బయటి,మరియు లోపలి ఫైరు బాక్సు మధ్య ఖాళీలో నీరు నింపబడి వుండును.ఫైరు బాక్సులో క్రాసుగారెండు పైపులు /గొట్టాలు వుండును. క్రాసు పైపు వున్న భాగాన్ని క్రాసు బాక్సు అందురు. అలాగే వాటి దిగువున మరో గొట్టం వుండును.ఈ గొట్టాల ద్వారా నీరు ఒకపక్క నుండి మరో పక్కకు వ్యాపిస్తుంది.ఫైరు బాక్సు స్తుపాకార నిలువు గోడలు, మరియు ఈ స్టీలు క్రాసు గొట్టాల ద్వారా ఫ్లూ గ్యాస్ వేడి/ఉష్ణం నీటికి ఉష్ణ సంవహనము వలన వ్యాప్యి చెంది నీరు వేడెక్కి స్టీము ఏర్పడును. ఫైరు బాక్సు లోపలి పైపులు ఎక్కువ వ్యాసం కల్గి నీటిని కల్గి వున్నను,ఈ బాయిలరును వాటరు ట్యూబుబాయిలరుగా భావించరు.ఫైరు బాక్సులోని ఈ క్రాసు గొట్టాలు భూ సమాంతరంగా లేదా కొద్దిగా ఏటవాలుగా వుండును.<ref name=vertical>{{citeweb|url=https://web.archive.org/web/20170609030555/http://mechanical-engineering-info.blogspot.in/2012/01/simple-vertical-boiler.html|title=Simple vertical boiler|publisher=mechanical-engineering-info.blogspot.in|accessdate=11-01-2018}}</ref>
 
బయటి స్తూపాకర షెల్ పైభాగాన ఒక పెద్ద మాన్ హోల్ వుండును.మాన్ హోల్ ద్వారా లోపలికి వెళ్లి బాయిలరును తనిఖీ చేసుకోవచ్చు.అలాగే బాయి లరు అదనంగా రెండు చిన్న హ్యాండ్ హోల్సు ఫర్నేసు/ఫైరు బాక్సు లో వున్న క్రాసుపైపులకు ఎదురుగా వుండును. బాయిలరు నిర్వహణ లేదా మరమత్తుల సమయంలో వీటిని తెరచి పైపుల్లో జమయ్యిన బురద వంటి దానిని హ్యాండ్ హోల్సుతెరచి లోపలి భాగాలు క్లీన్ చెయ్య వచ్చును. బాయిలరు ఫైరు హోల్ ద్వారా బయటి లోపలి షెల్ బాగాలులోపలి ఫైరు బాక్సు అతుకకబడి వుండును.ఫైరు హోల్ కు రంధ్రాలున్నతలుపు వుండును.ఫైరు బాక్సులో గ్రేట్ అను నిర్మాణం వుండును. గ్రేట్ లోకాస్ట్ ఐరన్ పలకలను ఒకదానిపక్క మరొకటి చొప్పున పేర్చి వుండును.పలకల మధ్య ఖాళి వుండి ,ఈ ఖాలిల గుండా ఘన ఇంధనాన్ని మండించగా ఏర్పడిన బూడిద కింద వున్న బూడిద గుంత లో పడును<ref name=vertical/>.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2286972" నుండి వెలికితీశారు