వేమూరి శారదాంబ: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''వేమూరి శారదాంబ''' సంస్కృతాంద్రములనభ్యసించి సంగీత సాహిత్యమ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వేమూరి శారదాంబ'''
సంస్కృతాంద్రములనభ్యసించి సంగీత సాహిత్యములనేర్చి సాటి మహిళల దుర్భరస్తితిగతులను మెరుగుపరచు అభ్యుదయ ధృక్పదముతో కృషిసల్పి చరిత్ర సృష్టించిన 19 వ శతాభ్దపు మహిళలు వెలుగులోకివచ్చినవారు బహుకొద్దిమంది మాత్రమే. అట్టి మహిళారత్నములలో నొకరు వేమూరి శారదాంబ(1880-1899). సాంప్రదాయనెపముతో నిబంధనలు, నియమములు విధించి స్త్రీలను గృహబంధితులగ యుంచుట 19వశతాబ్దమునాటి సర్వసాధారణమైన విషయం. అప్పటిసాంఘిక పరిస్తితులలో బాలికలు విద్యనభ్యసించనవసరములేదనీ, సంగీతసాహిత్యములు మొదలగు లలితకళలు స్త్రీలకు తగనివన్న భావనయుండెను. 19 వ శతాబ్దమధ్య కాలములో ప్రవేసించిన సంఘసంస్కరణోద్యమములు తెలుగునాట క్రమేపి ఆదరణపోందెను. సామాజిక నియమ ఉల్లంఘనలకు సంఘబహిష్కరణ, వెలి ప్రాయశ్చిత్తము మొదలగు ఆంక్షలు ఆశతాబ్దపు చివరినాటికింకనూ సాగుచునేయుండెను. స్త్రీలకు విద్యాభ్యాసము, సంగీత సాహిత్యములలో ప్రవేశము అప్పటికింకనూ అరుదుగనేయుండెనని చరిత్రలో కనబడుచున్నది. ఆమె జీవితకాలము కేవలము 19 సంవత్సరములు మాత్రమే. బహు ప్రజ్ఞాశాలి, గొప్పపలుకుబడిగల్గి పురప్రముఖుడైన తన తండ్రి, దాసు శ్రీరాములు గారి ప్రోత్సాహముతో ఆమె సంస్కృతాంధ్ర విద్యనభ్యసించెను. అంతేగాక సంగీత సాహిత్యములలో బాల్యములోనే అతీతమైన ప్రవీణ్యత సాధించెను. చిననాట పిత్రుపరిరక్షణలోనే సంగీత కచేరీలు చేసి గాయకురాలుగా గుర్తింపుపొందినది. ఆనాటి పరిస్తితులకెదురీది మెట్టింటివారి నిరుత్సాహక వాతావారణములో సహితము ప్రబంధకావ్యరచనలు చేసి కవయిత్రిగా పేరుపొందినది. స్త్రీలపట్లగల వివక్షతకు వాపోయి వారి దుర్భర స్తితిగతులుమెరుగు పరచుటకు విద్యాభ్యాసము అనివార్యమని ఘోషించి భగవత్ప్రార్దనా రూపములో కావ్యరచనలు చేసి సాహసించి ప్రచురించిన శారదాంబగారు చిరస్మరణీయులు.
-జీవిత విశేషములు-
--బాల్యమందే అబ్బిన అపార విద్య--
1881 మే నెల 3 తారీకున ఇప్పటి కృష్ణాజిల్లాలోని ముదునేపల్లి మండలములోని అల్లూరు గ్రామంలో జానకమ్మ- దాసు శ్రీరాములు దంపతులకు ఆరుగురు కుమారులతరువాత కలిగిన ఏకైక కుమార్తె సార్ధక నామధేయ దాసు శారదాంబ. విజయవాడలో 19 వ శతాబ్దాంతరములో వాణీప్రస్స్ అను ప్రముఖ ప్రచురణాలయమును స్థాపించిన దాసు కేశవరావు, ప్రముఖ న్యాయవాదులైన దాసు విష్ణురావు, మధుసూధనరావుల సోదరీమణి. వివాహానంతరము సాహిత్యకృషివల్ల వేమూరి శారదాంబగా ప్రసిధ్ధి చెందెను. తండ్రి దాసు శ్రీరాములు(1846-1908) వృత్తిరీత్యా ఏలూరులో న్యాయవాదేగాక అప్పటి ఏలూరు పురపాలకసంఘ అధ్యక్షుడు. జ్యోతిశాస్త్రపారంగతుడు, సంగీత సాహిత్యములలో అపారమైన పాండిత్యము కలిగియుండి దేవీభాగవతమురచించి మహాకవిగా ప్రసింధ్దిచెందెను. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘసంస్కరణాభిలాషి. ఆధునికదృష్టితో స్త్రీలకు విద్యాభ్యాసమనివార్యమని ప్రచారముచేయుటయెగాక ఆనాటి సమాజమందు అటువంటి ఉల్లంఘన వల్ల కలుగు లోకనిందలకు లెక్కచేయక తన కుమార్తెకు స్వయముగా విద్యాభ్యాసముచేసి చూపి సంఘసంస్కరణకు మార్గదర్శకుడైయ్యెను. ఏలూరులో సంగీత పాఠశాలకూడా నెలకొల్పెను. రాజమహేంద్రవరములోని సుప్రసిధ్ద సంఘసంస్కరణకర్త, కందుకూరి వీరేశలింగం పంతులుకు సమకాలీకుడు. ఏక సంతాగ్రాహి అయిన శారదాంబ అతి చిన్నవయస్సులోనే పుట్టింట సంగీత విద్వాంసులైన కోమండూరి నరసింహాచారి, ఈమని వెంకటరత్నం వద్ద సంగీతము నేర్చుకుని వీణావాయిద్యములో అశేష ప్రవీణ్యత సంపాదించెను. తండ్రిగారి పర్యవేక్షణలో విద్యాభ్యాసముచేసి సంస్కృతాంధ్రములో పాండిత్యము గడించెను. మైసూరు, బెంగళూరు పట్టణమందు జరిగే సంగీత సమ్మేరములో వీణా వాయిద్య కచేరీ చేశెను. ఆనాటి సాంప్రదాయప్రకారము 7వ ఏటనే శారదాంబ వివాహం 1888 మే నెల లో బందరువాస్తవ్యులు వేమూరి రామచంద్రరావుతో జరిగెను. సంగీత సాహిత్య విద్య అభ్యసించుటవల్ల ఆమె వివాహము బహుప్రయత్నానంతరము జరిగినటుల తెలియుచున్నది.
 
మూలాలు
"https://te.wikipedia.org/wiki/వేమూరి_శారదాంబ" నుండి వెలికితీశారు