వేమూరి శారదాంబ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
=జీవిత విశేషములు=
==బాల్యమందే అబ్బిన అపార విద్య==
1881 మే నెల 3 తారీకున ఇప్పటి [[కృష్ణా జిల్లా|కృష్ణాజిల్లా]]<nowiki/>లోని [[ముదినేపల్లి]] మండలములోని [[అల్లూరు]] గ్రామంలో జానకమ్మ-దాసు శ్రీరాములు దంపతులకు ఆరుగురు కుమారులతరువాత కలిగిన ఏకైక కుమార్తె సార్ధక నామధేయ దాసు శారదాంబ. విజయవాడలో 19 వ శతాబ్దాంతరములో వాణీప్రస్స్ అను ప్రముఖ ప్రచురణాలయమును స్థాపించిన దాసు కేశవరావు, ప్రముఖ న్యాయవాదులైన [[దాసు విష్ణు రావు]], మధుసూధనరావుల సోదరీమణి. వివాహానంతరము సాహిత్యకృషివల్ల వేమూరి శారదాంబగా ప్రసిధ్ధి చెందెను. [[తండ్రి]] దాసు శ్రీరాములు(1846-1908) వృత్తిరీత్యా [[ఏలూరు]]<nowiki/>లో న్యాయవాదేగాక అప్పటి ఏలూరు పురపాలకసంఘ అధ్యక్షుడు. జ్యోతిశాస్త్రపారంగతుడు, సంగీత సాహిత్యములలో అపారమైన పాండిత్యము కలిగియుండి దేవీభాగవతమురచించి మహాకవిగా ప్రసింధ్దిచెందెను. బహుముఖ ప్రజ్ఞాశాలి, సంఘసంస్కరణాభిలాషి. ఆధునికదృష్టితో స్త్రీలకు విద్యాభ్యాసమనివార్యమని ప్రచారముచేయుటయెగాక ఆనాటి సమాజమందు అటువంటి ఉల్లంఘన వల్ల కలుగు లోకనిందలకు లెక్కచేయక తన కుమార్తెకు స్వయముగా విద్యాభ్యాసముచేసి చూపి సంఘసంస్కరణకు మార్గదర్శకుడైయ్యెను. ఏలూరులో సంగీత పాఠశాలకూడా నెలకొల్పెను. [[రాజమండ్రి|రాజమహేంద్రవరము]]<nowiki/>లోని సుప్రసిధ్ద సంఘసంస్కరణకర్త, [[కందుకూరి వీరేశలింగం పంతులు]] సమకాలీకుడు. ఏక సంతాగ్రాహి అయిన శారదాంబ అతి చిన్నవయస్సులోనే పుట్టింట సంగీత విద్వాంసులైన [[కోమండూరి నరసింహాచారి]], [[ఈమని వెంకటరత్నం]] వద్ద [[సంగీతము]] నేర్చుకుని వీణావాయిద్యములో అశేష ప్రవీణ్యత సంపాదించెను. తండ్రిగారి పర్యవేక్షణలో విద్యాభ్యాసముచేసిసంగీతముతోపాటు విద్యాభ్యాసముచేసి సంస్కృతాంధ్రములో పాండిత్యము గడించెను. [[మైసూరు]], [[బెంగళూరు]] పట్టణములందు జరిగిన సంగీత సమ్మేరములో వీణా వాయిద్య కచేరీ చేశెను. ఆనాటి సాంప్రదాయప్రకారము 7వ ఏటనే శారదాంబ [[పెళ్ళి|వివాహం]] 1888 మే నెల లో బందరువాస్తవ్యులు వేమూరి రామచంద్రరావుతో జరిగెను. సంగీత సాహిత్య విద్య అభ్యసించుటవల్ల ఆమె వివాహము బహుప్రయత్నానంతరము జరిగినటుల తెలియుచున్నది. సశేషం
 
=స్వల్పశేషజీవితం లోచేసిన సాహిత్యకృషి=
"https://te.wikipedia.org/wiki/వేమూరి_శారదాంబ" నుండి వెలికితీశారు