ఇస్లామీయ ప్రవక్తలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రవక్తలు''' : ప్రవక్తలు అనగానే అనాది కాలపు మనుషులు వారిని సంస్కరించడానికి పూనుకొన్న మహనీయులు జ్ఞాపకం వస్తారు. [[ఖురాన్]] మరియు [[హదీసులు|హదీసు]]ల ప్రకారం సరిగ్గా ఇలాంటి వారే ప్రవక్తలు. ఈశ్వరుడు ([[అల్లాహ్]]) తాను సృష్టించిన మానవాళిని సన్మార్గము విడువకుండా చక్కటి ప్రాకృతిక జీవనం, అందులో ఆధ్యాత్మికత, దైవికత, సత్సీలత గల్గిన జీవనాన్ని సాగించుటకై, సదరు జీవనానికి కావలసిన సిద్ధాంతాలనూ మార్గదర్శకాలనూ చేరవేయడానికి తన వార్తాహరులను (పైగంబరులను) భూమిపై అవతరింపజేశాడు, వారే ప్రవక్తలు.
 
అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం [[ఆదమ్]] ఆది పురుషుడు మరియు ప్రథమ ప్రవక్త. [[మహమ్మదు ప్రవక్త|మహమ్మద్]] చివరి ప్రవక్త.
 
హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) [[ప్రవక్తలు]] అవతరించారు. ఖురానులో 25 ప్రవక్తల ప్రస్తావన కలదు. అనగా ఖురానులో ప్రస్తావనకు రాని ప్రవక్తలు 1,23,975. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్ ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో 1,23,998 ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ ఈశ్వరుడు (అల్లాహ్) ప్రవక్తలను అవతరింపజేశాడు.
"https://te.wikipedia.org/wiki/ఇస్లామీయ_ప్రవక్తలు" నుండి వెలికితీశారు