తెలుగునాట జానపద కళలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వము ఉన్నది.జానపద కళా స...
(తేడా లేదు)

01:58, 19 జనవరి 2008 నాటి కూర్పు

తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వము ఉన్నది.జానపద కళా సాహిత్యము ద్వారా జాతి సంస్కృతి తెలుస్తుంది.ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకరాలు జానపద కళలు అందిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.ఇట్లాంటి సంస్కృతీ వారసత్వాన్ని కాపాడుకోవడం మన భాధ్యత. తెలుగు వారి జానపద కళా సంపదలో ప్రత్యేకమైనది తోలుబొమ్మలాట. అచలనం నుండి చలనం వైపుకు భావాన్ని నడిపించే క్రమంలో జానపదుడు సృష్టించుకున్న తొలి ప్రదర్శన కళా రూపం తోలుబొమ్మలాట. జానపదుడి చలనచిత్రం తోలుబొమ్మలాట - అచలనం నుండి చలనం వైపుకు కదలికలోని ఆనదం కనుక్కున్న మనిషి ఆలోచనలోనుండి పుట్టిందే బొమ్మలాట. స్తిరత్వం నుండి చలనం వైపుకు పయనించడంలో భాగంగా ప్రాచీన మానవుడు బొమ్మలాటను సృష్టించుకున్నాడు. కధ చెప్పడం మొదలైన తరువాత ఆ కధలోని పాత్రలు తెరమీద కనిపిస్తే, నటిస్తే చూడాలన్న జనపదుడి తపనలో నుండి బొమ్మలాట పుట్టింది. బొమ్మలతో ఆడుకోవడం అతి ప్రాచీన కళ. కొయ్యబొమ్మలాటలు, కట్టెబొమ్మలాటలు, తొడుగు బొమ్మలాటలు, తళ్ళబొమ్మలాటలు, బుట్టబొమ్మలాటలు, తోలుబొమ్మలాటలు అని బొమ్మలాటలు అనెకము ఉన్నాయి. 2డి యానిమేషన్ దిశగా మొదటి అడుగు బొమ్మాలటదే. చాయచిత్రం, నీడల్తో ఆకృతులు వంటివి బొమ్మలాటకు దారితీశాయి. భారతీయ జానపద ప్రదర్శన కళల్లో అతి ప్రాచీనమైన దృశ్య రూపకానికి చెందినది తోలుబొమ్మలాట. క్రీ.పూ 3 వ శతాబ్దం నాటికే తెలుగు దేశంలో తోలుబొమ్మలాట ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. According to historians, puppets are as old as civilisation. Dating back to 2500 BC, the ancient civilisation of Harappa and Mohenjodaro was spread over thousands of Kilometers and the variety of archaelogical relics includes a terracotta bull with detachable head that can be manipulated by a string; thus achieving limited animation. Another figure found is a terracotta monkey that slides up and odwn a stick; creating a vertical movement. Shadow theatre existed in India as early as 6th centuary B.C and has since then provided entertainment in various parts of rural India. ( as referred in www. puppetindia. com) మహాభరతంలో తోలుబొమ్మలాట ప్రస్తావన ఉంది. చీరమరుగున బొమ్మలనాడించు వారు అన్న పాల్కురికి సోమన చెప్పిన పద్యంలో తోలుబొమ్మలనే ప్రస్తావించారు. భగవద్గీతలో సత్త్వ, తమో, రజో గుణాలు మూడు దారాలని, అవి పరమాత్మునిచేత మానవ జీవన గమనంలో లాగబడుతుంటాయని చెప్పబడింది. మానవుడు బొమ్మ అయితె అతనికున్న సూత్రాలు ఈ మూడు గుణాలు. ఆడించేవాడు భగవంథుదు అన్న అర్థంలో ఉన్న ఈ భాగం నిజానికి తోలుబొమ్మలాటలకు సంబందించిన ప్రస్తావన. క్రీ.పూ 3 వ శతాబ్ధానికి చెందిన అశోకుని శిలా శాసనాల్లో జంబూ ద్వీపానికి బొమ్మలాట ప్రదర్శన రంగంగా ఆపాదించారు. పతంజలి మహాభష్యంలో తన కాలమ్నాటి వినోద సాధనాలను వివరిస్తూ మూడు ప్రధానమైన వహికలను వివరిస్తూ వాటిలో బొమ్మలాట ఒక ప్రధనమైన వాహిక అని వివరించారు. తేరి గాధ అను బౌద్ద గ్రంధంలో బొమ్మలాటకు సంబందించిన ప్రస్తావన ఉంది. వాత్సాయనుని కామసూత్రాల్లో బొమ్మలలోని రకాలు, బొమ్మలాటల్లోని తేడాలు చర్చింపబడినాయి. కన్యలను ఆకర్షించడానికి బొమ్మలాటల ప్రదశన అవసరమని వత్సాయనుని వివరణ. ప్రాచీన భారత దేశంలో బొమ్మలాట ఒక పవిత్రమైన కళగా భావించబడింది. ఇది ప్రాచీన కాలపు సినిమాగా భావించబడింది. జానపదుని కళత్మక సృష్టికి ఇది నిదర్శనం. వినొద సాధనంగానే కాకుండా ప్రభోదాత్మక సాధనంగా కూడా ఈ కళారూపాన్ని జానపదుడు మలచుకున్నాడు. తరువాతి కాలంలో వెలువడిన నాతకానికి బొమ్మలాట నాంది పలికింది. నాటకమే తరువాతి సినిమాకు మూలం. కబట్టి పరోక్షంగా తొలుబొమ్మలాట సినిమాకు మూలమైంది. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ , పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషలను స్వయంగా షృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయమా వెనుకనుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుడి కళాత్మకత దాగి వుంది. ఒక సామూహిక సంగీత, నాట్య ప్రదర్శన కళారూపమైన తోలుబొమ్మలాట చారిత్రక పరిణామాలు గమనిస్తే ఒకప్పుడు విలక్షనమైన ఉన్నతిని అనుభవించిన ఈ కళ మొత్తం భారతీయ జానపద కళారూపాల్లోనే విశిష్ట స్తానాన్ని పొంది ఉంటుందని చెప్పవచ్చు. నృత్య దశలో నుండి మానవుడు నాటక దశలోనికి ఏదిగే పరిణామ క్రమంలో తోలుబొమ్మలాట ప్రముఖ పాత్ర వహించింది. జానపదుని మొదటి రంగస్థల ప్రదర్శన కళగా ఈ కళారూపాన్ని గుర్థించవచ్చు. తోలుబొమ్మల తయారీ తోలుబొమ్మలు తమకు తామే తయారు చేస్తారు. ఈ బొమ్మల తయారీకి జింక, దుప్పి, మేక, మేకపోతు, గొర్రె మొదలైన జంతువుల చర్మాలను వాడతారు. దేవతా విగ్రహాలను జింక, దుప్పి చర్మాలతో చేస్తారు. కానీ ఇప్పుడు ఇవి దొరకనందున మేక చర్మాలను వాడుతున్నారు. మేకలు ఎక్కువగా ఉన్నవారు మేకలను దానంగా ఇస్తారు. స్వచ్చమైన మేక తోలును తెచ్చి కొంచెం వేడిగా కాగిన నీళ్ళలో సబ్బు కలిపి ఈ తోళ్ళను నీళ్ళలో ముంచుటారు. నాలుగైదు సార్లు ముంచిన తరువాత ఆ తోలును చదునైన బండ మీద బోర్లా పరచి చేతితో వెంట్రుకలు తీస్తారు. తరువాత నీటి తొట్టి వద్దకు గానీ , బోరింగు దగ్గరకు గాని తీసుకు వెళ్ళి తోలుకు రెండువైపులా సబ్బు పెట్టి కత్తితో నుజ్జంతా తీసివేస్తారు. దీనిని బక్కి పొర అంటారు. ఈ చర్మాని ఎండలో ఆరబెడతారు. మన్సంపొర, వెంట్రుకలు తీసివేసిన ఈ తోలు పారదర్శకంగా ఉంటుంది. ఈ పరదర్శకత కలిగిన తోలుపై పెన్సిలుతో కావలసిన బొమ్మ గీసుకొని కత్తెరతోగానీ, గోరుగిల్లుడుతో గాని కత్తిరిస్తారు. తరువాత బొమ్మకు నగిషి పనులు చేస్తారు. హారాలు, పూలహారం, కిరీటం, వజ్ర వైడూర్యాది ఆభరణాలు సొగసుగా చేస్తారు. ఈ ఆకారాల్లోని బెజ్జాలు దీపపు కాంతికి ఆభరణాలుగా మెరుస్తాయి. తరువాత రంగులు వేస్తారు. తలకు, మీసాలకు నల్లరంగు, శరీరానికి ఎర్రరంగు వేస్తారు. తెలుపు రంగు వేయాల్సిన చోత రంగు వేయకుండా వదిలిపెడతారు. రంగులు వేసేవారిని రంగరాజులు అంటారు. ఇంటిలోని వారంతా రంగులు వేయడంలో ఆరితేరి ఉంటారు. ఈ పరిశోధకుడు వెళ్ళినపుదు 13 సంవత్సరాల అమ్మాయి బొమ్మల తయారీలో నిమగ్నమై ఉంది. కాళ్ళు చేతులు వంటివి ప్రత్యేకంగా తయారుచేసి దారాలతో కీలు కడతారు. అభినయనంలో కదలికకు గాను ఈ కాళ్ళు చేతులు ప్రత్యేకంగా కడతారు. రెండు కాళ్ళ మధ్య పట్టుకోవడానికి అనువుగా పుల్లను చీల్చి రెండువైపులా రెండు చీలికలు వచ్చేట్లు కడతారు. కాళ్ళ మధ్య భాగంలో పుల్లను పట్టుకొని బొమ్మనాడిస్తారు. బొమ్మలు రెండు రకాలు. ఏకపటం, సూత్రం బొమ్మ. రెండు తోళ్ళు ఉన్నది ఏకపటం( శరీరానికి ఒక తోలు, కాళ్ళు చేతులు కలిపి ఒక తోలు). సూత్రం బొమ్మకు మూడు తోళ్ళుంటాయి. బొమ్మల తయారీ తరువాత వాటిని పెద్ద వెదురు పెట్టెలో భద్రపరుస్తారు. ప్రదర్శన కోసం బొమ్మలే కాకుండా ఇంతిలో అందాన్నిచ్చే అనేకమైన అలంకరణ సామగ్రిని కూడా తయారు చేసి అమ్మడం వృత్తిగా మారింది. తొలుబొమ్మల తయారీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను గురించి నిమ్మలకుంట కళాకారులు ఈ పరిశొధకునికి వివరించారు. ఒకప్పుడు ఆదరణ ఉన్న ఈ కళ ఇప్పుడు ఆదరణ కోలుపోవడం వలన మేక చర్మాలు దానం చేసేవారు కరువయ్యారని, ఇప్పుడు మేకచర్మాలను తాము కొంటున్నామని, కొన్న తరువాత వాటిని తీసుకుని వచ్చేటప్పుడు రవాణాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీరు వివరించారు.