కాశీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''[[కాశీ]]''' లేదా ''[[వారాణసి]]'' (''Kasi, Benaras, Varanasi'') [[భారతదేశము|భారతదేశపు]] అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. [[హిందూమతము|హిందువులకు]] అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే [[గంగానది]]లో [[స్నానం]] ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని [[హిందువులు|హిందువుల]] నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద [[గంగ|గంగానదిలో]] కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి [[వారణాసి]] (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం ఉంది. [[బ్రిటిషు]]వారి వాడుకలో [[వారణాసి]], [[బెనారస్]] అయింది.
'''''కాశ్యాన్తు మరణాన్ ముక్తి:''''' - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని [[హిందూమతం|హిందువులు]] విశ్వసిస్తారు. [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాల్లో]] ఒకటైన '''విశ్వేశ్వర లింగం''' ఇక్కడ ఉంది. [[బౌద్ధులు|బౌద్ధు]]<nowiki/>లకు, [[జైనులు|జైను]]<nowiki/>లకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే [[:en:List of oldest continuously inhabited cities|అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది]] అని భావిస్తున్నారు.<ref name=bsfw /><ref>{{cite web |url=http://www.britannica.com/eb/article-9074835/Varanasi |title=Varanasi |publisher=[[Encyclopædia Britannica Online]] |accessdate=2008-03-06}}</ref>
 
[[గంగా నది|గంగానది]], [[హిందూమతము]], హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, [[హిందీ]] మరియు సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. [[హరిశ్చంద్రుడు]], [[గౌతమ బుద్ధుడు]], [[వేదవ్యాసుడు]], [[తులసీదాసు]], [[శంకరాచార్యుడు]], [[కబీర్ దాసు]], [[ప్రేమ్‌చంద్|మున్షీ ప్రేమ్‌చంద్]], [[లాల్ బహదూర్ శాస్త్రి]], పండిట్ [[రవిశంకర్]], [[బిస్మిల్లా ఖాన్]], కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారాణసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి [[గంగా నది|గంగానది]] ఆవలివైపున రామనగరం ఉంది. వారాణసి సమీపంలో [[సారనాథ్]] బౌద్ధ క్షేత్రం ఉంది.
 
విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, [[విశాలాక్షి]] [[ఆలయం]], వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత [[దేవాలయం]], [[భారతమాత]] మందిరం - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. [[కాశీ హిందూ విశ్వవిద్యాలయం]] ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారాణసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.<ref>{{cite web |url=http://www.bhu.ac.in/varanasi.htm |title=Varanasi: The eternal city |publisher=[[Banaras Hindu University]] |accessdate=2007-02-04}}</ref>
అమెరికన్ రచయిత [[మార్క్ ట్వేన్]] ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయంకంటే పురాతనమైనది. గాధలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి."<ref>{{cite book |last=Twain |first=Mark | authorlink = Mark Twain |title=Following the Equator: A journey around the world |url=http://www.literaturecollection.com/a/twain/following-equator/ |accessdate=2007-02-07 |origyear=1897 |year=1898 |publisher=Hartford, Connecticut, American Pub. Co. |isbn=0404015778 | oclc = 577051 |chapter=L | chapterurl = http://www.literaturecollection.com/a/twain/following-equator/51/}}</ref>
[[దస్త్రం:People on a ghat in Varanasi.jpg|right|thumb|300px|వారాణసిలో ఒక స్నాన ఘట్టం]]
పంక్తి 35:
మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది.<ref>M. Julian, ''Life and Pilgrimage of Hsuan Tsang'', 6, 133, 2, 354.</ref> కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.<ref>{{cite web |url=http://tdil.mit.gov.in/CoilNet/IGNCA/kv_0002.htm |title=Varanasi Vaibhav ya Kaashi Vaibhav - Kashi Ki Rajdhani Varanasi Ka Namkaran |publisher=సాంకేతిక మంత్రిత్వ శాఖ, [[భారత ప్రభుత్వము]] |date=2003 |accessdate=2007-02-04 |language=హిందీ}}</ref>
 
"వారాణసి" అనే పేరును [[పాళీ భాష]]లో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది.'<ref>{{cite web |url=http://www.evaranasitourism.com/history-of-varanasi/index.html |title=భారతదేశ చరిత్ర|publisher=EVaranasiTourism.com |accessdate=2007-02-04}}{{Verify credibility|date=February 2008}}</ref> వారాణసి నగరాన్ని [[ఇతిహాసములు|ఇతిహాస]] పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.
 
== చరిత్ర ==
[[దస్త్రం:Benares 1890.jpg|thumb|250px|1890 కాలపు బెనారస్ చిత్రం.]]
సుమారు 5,000 సంవత్సరాల క్రితం [[శివుడు]] వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం.<ref name=bsfw>{{cite book |last=Lannoy |first=Richard |title=Benares Seen from Within |publisher=[[University of Washington Press]] |pages=Back Flap |date=October 1999 |isbn=029597835X | oclc = 42919796}}</ref>. ఇది [[హిందువుల ఏడు పవిత్ర నగరాలు|హిందువుల ఏడు పవిత్ర నగరాలలో]] ఒకటి. [[ఋగ్వేదం]], [[రామాయణం]], [[మహాభారతం]], [[స్కాంద పురాణం]] వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో [[కాశీనగరం]] ప్రసక్తి ఉంది.
 
వారాణసి నగరం సుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు.<ref>{{cite news |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4784056.stm |title=The religious capital of Hinduism |first=Debabani | second = Majumdar |publisher=[[BBC]] |date= 2006-03-07 |accessdate=2007-02-04}}</ref> విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. [[గౌతమ బుద్ధుడు|గౌతమ బుద్ధుని]] కాలంలో ఇది [[కాశీ రాజ్యం|కాశీ రాజ్యానికి]] రాజధాని. [[చైనా]] యాత్రికుడు [[యువాన్ చాంగ్]] ([[:en:Xuanzang|Xuanzang]])ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.
[[దస్త్రం:Benares (Varanasi, India) - 1922.jpg|right|thumb|250px|1922లో వారణాసి (బెనారస్).]]
 
పంక్తి 48:
 
=== పురాణకథనాలు ===
కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.[[అయోధ్య]], [[మథుర]], [[గయ]],[[కాశి]], [[ఉజ్జయిని|అవంతిక]], [[కంచి]], [[ద్వారక]] నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత మరియు తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. [[పురాతత్వ శాస్త్రం|పురాతత్వ]] అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా [[అథర్వణ వేదం|అధర్వణ వేదం]]<nowiki/>లో వర్ణించబడింది. అధర్వణవేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భాస్తున్న సమయానికి సరొపోతున్నాయి. ఈ ప్రాంతంలో [[స్థానికులు]] నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైనగురువు మరియు ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.
 
=== ఆర్ధికం ===
వారణాశి పారిశ్రమికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాశి మస్లిన్ మరియు పట్టు వస్త్రాలకు, [[సుగంధ ద్రవ్యము|సెంటు]], దంతపు వస్తువులు మరియు శిల్పాలకు ప్రసిద్ధి. గౌతమబుద్ధుడు (జననం 567 క్రీ.పూ)నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. క్రీ.పూ 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. [[గౌతమ బుద్ధుడు|గౌతమబుద్ధుడు]] కాశీలోని సారనాధ్ వద్ద " ధర్మచక్రం కదిలింది (టర్నింగ్ ది వీల్ ఆఫ్ లా ) " మొదటిసారిగా గంభీరఉపన్యాసం ప్రజలకు అందించాడు. [[చైనా]] యాత్రికుడు హూయంత్సాంగ్ క్రీ.శ 635లో వారణాశిని దర్శించాడు. కాశీ పశ్చిమతీరంలో ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వారణాశి మతం మరియు కళలకు కేంద్రంగా ఉండేదని హూయంత్సాంగ్ వర్ణించాడు. 7వ శతాబ్దంలో హూయంత్సాంగ్ వారణాశిలో నివసించాడు. హూయంత్సాంగ్ వారణాశిని " పోలనైస్ " అని పేర్కొన్నాడు. 30 సన్యాదులకు సంబంధించిన 30 ఆలయాలను కూడా ఆయన వర్ణించాడు. 8వ శతాబ్దంలో శకరాచార్యుడు[[శంకరాచార్యుడు]] శివారధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తరువాత వారణాశి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది.
=== ప్రముఖులు ===
[[మౌర్య సామ్రాజ్యం|మౌర్యుల]] కాలంలో [[తక్షశిల]] మరియు [[పాటలీపుత్ర]] మద్య ఉన్న [[రహదారి]]<nowiki/>తో కాశీపట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వశం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్గన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ధ్వశం చేయబడ్డాయి. ఆఫ్గన్ రాజు సికిందర్ లోడి హిదువుల ఆణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వశం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే మరికవైపు వారణాశి మేధావులకు మరియు తాత్వికులకు కేంద్రంగా మారింది.
పంక్తి 57:
 
=== స్వాతంత్రానికి ముందు చరిత్ర ===
16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి [[ఆక్బర్]] పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి మరియు [[విష్ణుమూర్తి]]కి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అంపూర్ణాదేవి నమందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది. 16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన " జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ " ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న " బిందు మహాదేవాలయం " సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి [[కొలకత్తా]] నుండి పెషావర్ వరకు పొడిగించబడింది. తరువాత [[బ్రిటిషు|బ్రిటిష్]] పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన " గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా " అవతరుంచింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ [[ఔరంగజేబు]] మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ద్ధిల్ల సాగాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు మరియు మరాఠా రాజులచేత నిర్మించబడ్డాయి. ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్ధానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో (క్రీ.శ 1775-1945) కూడా కొనసాగారు. 1737లో మొగల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో " బెనారస్ రాజ్యం ( కింగ్డం అఫ్ బెనారస్) " పేరుతో సాధికారంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది. 18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగాతీరంలో ఉన్న మాన్ మందిరం ఘాట్ వద్ద ఒక " అబ్జర్వేటరీ " కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యీతిషశాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాశిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జూనాథాన్ డంకన్ కాలంలో వారణాశి పర్యాటకం మరింత వర్ధిల్లింది. 1867లో వరణాశిలో పురపాలక సంఘస్థాపన జరిగిన తరువాత వారణాశి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది.
 
=== ప్రత్యేక సంఘటనలు ===
1897లో మార్క్ ట్వైన్, వారణాశి గురించి వర్ణిస్తూ " బెనారస్ చరిత్రకంటే పురాతనమైనది. సంప్రదాయాలకంటే పాతది, పురాణాలకంటే పురాతనమైనది అలాగే అన్నింటికంటే అత్యంత పురాతనమైనది. 1910లో బ్రిటిష్ ప్రభుత్వం వారణాశిని భారతీయ భూభాగంగా చేసి రామనగరాన్ని రాజధానిగా[[రాజధాని]]<nowiki/>గా చేసి తన న్యాయపరిధి నుండి తొలగించింది. అయినప్పటికీ తరువాత కూడా గంగాతీరంలో వారణాశి భుభాగంలో ఉన్న రామనగర్ కోటలో కాశిరాజు నివసిస్తూ ఉన్నాడు. ప్రస్థుతం రామనగర్ కోటలో కాశిరాజులకు చెందిన వస్తుసంగ్రహాలతో [[సంగ్రహాలయం|మ్యూజియం]] నిర్వహించబడుతుంది. 18వ శతాబ్దం నుండి ఈ కోటలో కాశీరాజులు నివసిస్తూ వచ్చారని ప్రాంతీయ వాసులు వివరిస్తున్నారు. రాజు మతపరంగా అధ్యక్ష స్థానంలో ఉంటాడు అలాగే ప్రజలు రాజుని శివుని అవతారంగా భావిస్తారు. రాజు స్వయంగా అన్ని మతసంప్రదాయాల సంప్రదాయాలకు ఆధిపత్యం వహిస్తుంటాడు.
 
1857 లో వారణాశిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన భారతీయ సైనికులు స్వాతంత్ర సమరయోధుల మీద జరిగిపిన దమనకాండలో సామూహిక హత్యలు జరిగాయి. వారణాశిలో [[అనీబిసెంట్]] దియోసాఫీ సిద్ధాంతం ప్రతిపాదించడమేగాక " సెంట్రల్ హిందూ కాలేజ్ " స్థాపన కూడా చేసింది. తరువాత సెంట్రల్ హిందూ కాలేజ్ 1916 నుండి " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " గా మారింది. ఇది మతాతీతంగా విద్యాసేవలు అందిస్తుంది. అనీబిసెంట్ సెంట్రల్ హిందూ కాలేజ్ ని అన్ని మతాలకు చెందిన మనుషులు కేంద్రీకృతమై సహోదరత్వంతో కృషిచేసి భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో స్థాపించింది. అలాగే భారతీయ సమూహాలలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించడం [[అనీ బిసెంట్|అనీబిసెంట్]] లక్ష్యాలలో భాగమే.
వారణాశి 1948 అక్టోబరు 15 న యూనియన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వబడింది. 2000 లో విభూతి నారాయణన్ సింగ్ మరణం తరువాత ఆయన కుమారుడైన అనంత్ నారాయణ్ సింగ్ రాజయ్యాడు. రాజు కాశీరాజు సంప్రదాయాల ఆచరణ బాధ్యతను వసహిస్తాడు.
 
పంక్తి 74:
 
=== వాతావరణం ===
వారాణసి వాతావరణం తేమగా ఉన్న సమోష్ణ వాతావరణం (humid subtropical climate). వేసవి, శీతాకాలం ఉష్ణోగ్రతల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్-అక్టోబరు మధ్య వేసవి కాలంలో ఋతుపవనాల వల్ల అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. హిమాలయ ప్రాంతంనుండి వచ్చే చలి తెరగలు (Cold waves) కారణంగా డిసెంబరు - ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో[[వేసవి కాలం|వేసవి]]<nowiki/>లో నగరం ఉష్ణోగ్రతలు 32 - 46&nbsp;°C మధ్య, చలికాలంలో 5° - 15&nbsp;°C మధ్య ఉంటాయి.<ref name=varanasiairtrip/> సగటు వర్షపాతం 1110&nbsp;మిల్లీమీటర్లు<ref name=delhitourism>{{cite web |url=http://www.delhitourism.com/varanasi-tourism/ |title=Varanasi tourism |accessdate=2006-08-18 |publisher=DelhiTourism.com}}{{Verify credibility|date=February 2008}}</ref> చలికాలంలో దట్టమైన పొగ మంచు, [[వేసవి కాలం|వేసవి]] కాలంలో [[:en:Loo (wind)|వడ గాడ్పులు]] ఉంటాయి.
 
నగరంలో వాతావరణ (గాలి) [[కాలుష్యం]] ఇప్పటికి అంత తీవ్రమైన సమస్య కాదు. కాని నీటి కాలుష్యం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. ఇందువలనా, నది పైభాగంలో కడుతున్న ఆనకట్టల వలనా గంగానదిలో నీటి మట్టం తగ్గుతున్నది. నది మధ్యలో మట్టి మేటలు బయటపడుతున్నాయి.
=== ఆర్ధికరంగం ===
 
పంక్తి 86:
వారణాశిలోని 29% ప్రజలు ఉద్యోగాలను కలిగి ఉన్నారు. వారిలో 40% వస్తూత్పత్తి పరిశ్రమలలో పనిచేస్తుండగా 26% ప్రజలు వ్యాపార వాణిజ్యాలు చేస్తున్నారు, 19% ప్రజలు సేవారంగాన్ని జీవనోపాధిగా ఎంచుకున్నారు, 8% రవాణా మరియు సమాచార రంగంలో పనిచేస్తున్నారు, 4% వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు, 2% నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు ( వీరికి సంవత్సరంలో ఆరుమాసాలు మాత్రమే పని ఉంటుంది). తయారి పనివారిలో 51% స్పిన్నింగ్ పనిలో ఉన్నారు, 6% ప్రజలు ముద్రణ మరియు ప్రచురణ పనిలో ఉన్నారు, 5% ప్రజలు విద్యుత్తు మిషనరీ పనిలో ఉన్నారు, మిగిలిన వారు పరిశ్రమలోని ఇతర పనులలో ఉన్నారు.
 
వారణాశిలో తయారీ వ్యవస్థలో [[పట్టు]]<nowiki/>నేత ఆధిక్యత వహిస్తుంది. వారణాశిలో సాధారణంగ నేతపని కుటీరపరిశ్రమగా ఉంటుంది. నేవారిలో అధికంగా మోమిన్ అంసారీ [[ముస్లిములు]] ఉన్నారు. వారణాశి పలుచని పట్టువస్త్రాలు మరియు బనారస్ పట్టు చీరలు భారతదేశం అంతటా పఖ్యాతి వహిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలలో ధరించే ఈ పట్టు చీరలు వెండి మరియు అంగారు జరీనూలుతో అలకృతమై ఉంటాయి. మిగిలిన [[భారత దేశము|భారతదేశం]] కంటే వారణాశిలో అత్యధికంగా బాలలను కట్టుబానిసలుగా పట్టుపరిశ్రమలో వాడుకుంటున్నారు. సమీపకాలంలో అభివృద్ధి చెందుతున్న పవర్ లూంస్ మరియు కంప్యూటర్ డిజైన్లు అలాగే చైనా పట్టువస్త్రాల పోటీ వంటి సమస్యలు సంప్రదాయక పట్టునేత పరిశ్రమను కలవరానికి గురిచేస్తూ ఉంది.
 
లోహ తయారీ పరిశ్రమలో డీసెల్ లోకోమోటివ్ వర్క్స్ ప్రధానమైనది, భారత్ హెవీ ఎలెక్ట్రానికల్స్ లిమిటెడ్ అధికంగా విద్యుత్చక్తి పరికరాలను ఉత్పత్తి చేస్తుంది, ఈ సంస్థ హెవీ ఎక్విప్మెంట్ రిపెయిర్ ప్లాంట్ కూడా నిర్వహిస్తుంది, ఇంకా కామ్మోడిటీ తయారీ కూడా ప్రధాన్యత వహిస్తుంది, చేతితో చేసిన మిజాపిఉర్ కార్పెట్లు, రగ్గులు, ధుర్రీలు, [[ఇత్తడి]] వస్తువులు, [[రాగి]] వస్తువులు, కొయ్య మరియు బంకమట్టి బొమ్మలు, హస్థకళా ఉత్పత్తులు, [[బంగారం|బంగారు]] నగలు మరియు సంగీత పరికరాలు, తమల పాకులు, లాంగ్రా మామిడి మరియు ఖోవా వంటి ముఖ్యమైన వ్యసాయ ఉత్పత్తులు ప్రధానమైనవి.
 
వారణాశిలో పర్యాటకం ముఖ్యమైన పరిశ్రమ. ఇది ఆర్థికంగా రెండవ స్థానంలో ఉంది. సంవత్సరానికి 30 లక్షల దేశీయ మరియు 2 లక్షల విదేశీ పర్యాటకులు వారణాశికి విచ్చేస్తున్నారు. పర్యాటకులు సాధారణంగా మతపరంగా వారణాశికి వస్తుంటారు. దేశీయంగా బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర ప్రదేశ్ నుండి వస్తుంటారు. విదేశీ యాత్రికులలో అధికంగా శ్రీలంక మరియు జపాన్ నుండి వస్తుంటారు. అక్టోబరు మరియు మార్చి మద్యలో యాత్రీకుల రాక అత్యధికంగా ఉంటుంది. వారణాశిలో యాత్రీకుల అవసరార్ధం దాదాపు 12,000 పడకల అవసరం ఉంది. వీటిలో సగం ఖరీదైనవి కాగా మూడవ భాగం ధర్మశాలలలో లభిస్తాయి. అయినప్పటికీ వారణాశి పర్యాటక నిర్మాణాలు సౌకర్యవంతమైనవి కావు. ఈ రంగంలో అనుకున్నంతగా అభివృద్ధి జరగలేదు.
పంక్తి 99:
 
== గంగానది ==
గంగానదికి[[గంగా నది|గంగానది]]<nowiki/>కి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో [[ఆలయాలు]] గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి. గంగానదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మత పరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.
 
=== స్నాన ఘట్టాలు ===
వారణాశిళొని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో సుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధీలు (సింధియాలు), హోల్కార్లు, భోంస్లేలు మరియు పెషావర్లు నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్‌లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు "శివాలా ఘాట్" మరియు "కాళీ ఘాట్"లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్‌లు స్నానానికి మరియు దహనకాండలకు వాడుతారు. కొన్న ఘాట్‌లు పురాణ గాథలతో ముడివడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంశించబడుతున్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పనచగంగ ఘట్టం మరియు ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి.
* తులసీ ఘాట్ వద్ద [[తులసీదాసు]] తులసీ రామాయణాన్ని రచించాడని విశ్వసిస్తున్నారు.
 
=== దశాశ్వమేధ ఘాట్ ===
పంక్తి 111:
=== మణి కర్ణికా ఘాట్ ===
 
మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా [[విష్ణువు]] చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది. మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన [[చెవిపోగు]] (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణికా ఘాట్ యజమానే [[హరిశ్చంద్రుడు|హరిశ్చంద్రుడి]]ని కొని, హరిశ్చంద్ర ఘాట్‌లో కాటిపనికి నియమించాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్రఘాట్‌లలో అధికంగా [[దహన సంస్కారాలు]] జరుగుతుంటాయి. మణికర్ణికాఘాటుకు మహాశ్మశానమని మరొక పేరుకూడా ఉంది. ఈ ఘాట్ గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుత ఘాట్ 1032 లో నిర్మించబడింది. 4వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఈ ఘాట్ ప్రస్తావన ఉంది. ఈ ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వరాలయంలో నుండి [[పరమశివుడు]] మరణిస్తున్న వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తుంటాడని విశ్వసించబడుతుంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశమిదే
అని ప్రజల విశ్వాసం.
 
పంక్తి 133:
[[దస్త్రం:Benares 1.JPG|thumb|200px|right|People performing Hindu ceremony at one of the ghats of Varanasi]]
{{బౌద్ధ పర్యాటక ప్రాంతాలు}}
వారాణసి హిందువులందరికి పరమ పావన క్షేత్రం. ప్రతి యేటా లక్షమంది పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగాస్నానం, దైవ దర్శనం చేసుకొంటారు. ఇక్కడ విశ్వేశ్వరాలయంలోని [[శివ లింగము|శివలింగం]] ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువైయున్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు.<ref name=leaflet2/> గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.
 
బౌద్ధులకు కూడా వారాణసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ - ఈ ఐదు ముఖ్యమైన యాత్రాస్థలాలలని బుద్ధుడు బోధించాడు. వారాణసి సమీపంలోనే సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధననుపదేశించాడు. అక్కడి ధమేక స్తూపం అశోకునికంటె ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థఅనంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాడట.
పంక్తి 144:
వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక (దాదాపు 23,000) కాని ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం మరియు దుర్గా మందిరం ( ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది).
=== విశ్వనాధ మందిరం ===
[[కాశీ విశ్వనాధ మందిరం]] వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో [[ఇండోర్]] రాణి [[అహల్యాబాయి హోల్కర్]] కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాలలో]] ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయసమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ [[వారన్ హేస్టింగ్స్]] సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన [[మహారాజా రంజిత్ సింగ్]] ఈ iఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.<ref>{{cite web |url=http://varanasi.nic.in/temple/KASHI.html |title=Shri Kashi Vishwanath Mandir Varanasi |publisher=National Informatics Centre, Government of India |accessdate=2007-02-04}}</ref> మొఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]] కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విభేదాలలో ఒకటి<ref>{{cite news |url=http://www.tribuneindia.com/1998/98dec06/head1.htm |title=Countrywide alert on Masjid demolition anniversary |publisher=[[The Tribune]] |date= 1998-12-06 |accessdate=2007-02-05}}</ref>
 
ఈ మందిరం అధికారిక వెబ్‌సైటు [http://www.shrikashivishwanath.org కాశీ విశ్వనాధ] 2007 జూలై 23న ప్రాంభమైంది. ఈ వెబ్‌సైటులో మందిరంలోని సదుపాయాలు, పూజా వివరాలు వంటి సమాచారం లభిస్తుంది
"https://te.wikipedia.org/wiki/కాశీ" నుండి వెలికితీశారు