బుద్ధిమంతుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
imdb_id= 0155567
}}
'''[[బుద్ధిమంతుడు]]''' , 1969లో విడుదలైన [[తెలుగు సినిమా]]. తరాల అంతరాలు కారణంగా విభిన్న మనస్తత్వాలు కలిగిన అన్నదమ్ముల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను సున్నితంగా ఈ సినిమాలో చిత్రీకరించారు. అదే సమయంలో ఊరిలో జరిగే కుతంత్రాలు కూడా కథలో కలిసిపోతాయి. చాలా సినిమాలలో ఉండే సామాన్యమైన కథాంశమే ఇది. అయితే సాక్షాత్తు భగవంతుడు ఒక సామాన్యమైన వ్యక్తి వలే ఒకరికి కనిపిస్తూ మాట్లాడుతూ, అతను నివేదన చేసిన [[భోజనం]] స్వీకరిస్తూ, ఇతరులకు తెలియకుండా, చాలా సహజంగా మరొక పాత్రలాగా ఈ కథలో ఇమిడిపోవడం వలన ఈ సినిమా కథ స్వరూపమే మారిపోయింది. దేవుడిని నమ్ముకున్న అమాయకుడైన అన్న, దేవుని మీద నమ్మకం లేని గడుసు తమ్ముడు, దేవుడిని అడ్డుపెడ్డకొని పబ్బం గడుపుకునే ప్రతినాయకుడు మొదలైన పాత్రలతో రూపొందినదీ చిత్రం.
 
[[అక్కినేని]] మరియు [[బాపు]] కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం. అక్కినేని ద్విపాత్రాభినయం ఆస్తికునిగా (భక్తునిగా) మరియు నాస్తికునిగా చిత్ర ఆకర్షణ. పౌరాణిక పాత్ర శ్రీ కృష్ణుడు భక్తునితో మాట్లాడటం, కనపడటం ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. తర్వాత బాపు చిత్రం [[ముత్యాలముగ్గు]] లో ఇదే పంథా నడుస్తుంది. (దాసరి [[దేవుడే దిగివస్తే]], రాజాచంద్ర [[మా ఊళ్ళో మహాశివుడు]] దీనికి కొనసాగింపు)