ఆయేషా మీరా హత్య కేసు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
→‎తీర్పు: విస్తరణ
పంక్తి 11:
 
== తీర్పు ==
విజయవాడ మహిళా కోర్టు హత్యకు గాను 302 సెక్షను క్రింద 14 ఏళ్ళ జైలు శిక్ష, మానభంగానికి గాను 376 సెక్షను క్రింద 10 ఏళ్ళ జైలు శిక్ష విధించినది. తీర్పు వినగనే సత్యం బాబు తల్లి మరియమ్మ కోర్టు లోనే మూర్ఛ పోయినది. సాక్ష్యాధారాలు, ఇతర సాంకేతిక వివరాలు పరిశీలించిన తర్వాత, ఈ నేరాలు సత్యం బాబే చేశాడని కోర్టు నిర్ధారించుకొన్నాకే ఈ శిక్షలు విధించడం జరిగినదని కోర్టు తెలిపినది. సత్యం బాబును జడ్జి "యావజ్జీవ కారాగార శిక్ష, మరణ దండనలో ఏది ఎంచుకొంటావు?" అని అడిగిన ప్రశ్నకు సత్యం బాబు "నా పై వేయబడిన తప్పుడు అభియోగాలు, కోర్టు నిజమని నమ్ముతోంది గనుక, ఇక్కడ బ్రతికి ఉండటం వ్యర్థం కనుక, నేను చావునే కోరుకొంటున్నాను." అని సమాధానం ఇచ్చాడు. <ref>[https://timesofindia.indiatimes.com/india/Lifer-for-Satyam-Babu-in-Ayesha-murder-case/articleshow/6655385.cms?referral=PM సత్యం బాబుకు యావజ్జీవ కారాగార శిక్ష]</ref> ముద్దాయి తరఫు వాదించే లాయర్లు పరిగణలోకి తీసుకొనవలసిన అంశాలు కేవలం సాక్ష్యాధారాలు, సాంకేతిక వివరాలు మాత్రమే కావని, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు గానీ, ప్రత్యక్ష ఆధారాలు గానీ లేవని, కేవలం పోలీసులు తప్పితే, బాధితురాలి తల్లిగానీ, ముద్దాయి తల్లిగానీ, మానవ హక్కుల సంఘాలు గానీ, సత్యం బాబు నేరాలు చేశాడని నమ్మటం లేదని, అతని కుటుంబ, ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకొని తీర్పును సవరించవలసినదిగా కోరారు. అయిననూ కోర్టు తీర్పులో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యంబాబు అదే ఏడాది అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది.<ref>[ https://www.sakshi.com/news/top-news/ayesha-meera-murder-case-high-court-says-satyam-babu-is-innocent-463894 తీర్పును సవాలు చేసిన సత్యం బాబు] </ref>
 
31 మార్చి 2017న హైదరాబాదు హై కోర్టు సత్యం బాబు ను నిర్దోషిగా ప్రకటించినది. నిష్కారణంగా ఒక నిర్ధోషిని 8 ఏళ్ళు జైలులో ఉంచినందుకు పోలీసు యంత్రాంగానికి మొట్టికాయలు వేస్తూ లక్ష రూపాయలను నష్టపరిహారం విధించినది. <ref>[https://www.sakshi.com/news/andhra-pradesh/ayesha-meera-parents-reacts-on-high-court-judgement-463709 సత్యంబాబుకు సంబంధం లేదని ఆనాడే చెప్పాం - ఆయేషా తల్లి]</ref>