బొబ్బిలి యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
|cause= విజయనగరం సంస్థానానికి శ్రీకాకుళం మరియు రాజమండ్రి సర్కార్లను లీజుకొరకు ఫ్రెంచ్ అగ్రిమెంటు.
}}
'''[[బొబ్బిలి యుద్ధం]]''' [[ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]<nowiki/>లో ఒక ప్రముఖ ఘట్టం. 1757 జనవరి 24<ref name=":0">{{Cite book|title=మెడ్రాస్ డిస్ట్రిక్ట్ గెజెటీర్స్ విజాగపటం సంపుటి - 1|last=డబ్ల్యు|first=ఫ్రాన్సిస్|publisher=|year=1907|isbn=|location=https://archive.org/stream/in.ernet.dli.2015.207070/2015.207070.Madras-District#page/n257/mode/2up/search/bobbili|pages=237}}</ref> న [[బొబ్బిలి]] సంస్థాన సైన్యానికి, [[ఫ్రెంచి]], విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికీ మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచింది.
 
[[బొబ్బిలి]] కోట [[విశాఖపట్నం|విశాఖపట్నానికి]] [[ఈశాన్యం]]<nowiki/>గా 140 మైళ్ళ దూరంలో ఉంది. 18 వశతాబ్ది మధ్య కాలంలో [[బొబ్బిలి]] [[జమీందారు]]<nowiki/>గా ఉన్న రాజా గోపాలకృష్ణ రంగారావుకు, [[విజయనగరం|విజయనగర]] సంస్థానం ప్రభువు పూసపాటి పెద విజయరామరాజుకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. రెండు రాజ్యాల సరిహద్దుల వద్ద ఉన్న వాగుల్లోని నీటిని బొబ్బిలి ప్రజలు బలవంతంగా తిసుకు వెళ్ళేవారు. తన బలం చాలనందున విజయరామరాజు ఈ దోపిడీని ఎదుర్కొనలేకపోయేవాడు. ఫ్రెంచి కమాండర్ ఇన్ ఛీఫ్ [[మార్కీస్ దే బుస్సీ|బుస్సీ]] వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని, పక్కలో బల్లెంలా ఉన్న తన పొరుగు రాజును ఇక్కడి నుండి తరిమికొట్టాలని పెద [[విజయరామరాజు]] భావించాడు. బొబ్బిలి పాలకులు మిగిలిన జమీందార్ల లాగా [[ఫ్రెంచి]] వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోక, తమ చర్యల ద్వారా ఫ్రెంచి కమాండర్ ఇన్ ఛీఫ్, [[మార్కీస్ దే బుస్సీ|మార్క్ దీ బుస్సీ]]<nowiki/>తో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఈ చర్యలన్నిటి పర్యవసానమే '''[[బొబ్బిలి యుద్ధం]]'''.
 
భారత దేశ [[చరిత్ర]]<nowiki/>లో మున్నెన్నడూ ఎరగని సంఘటనను ఆవిష్కరించిన [[యుద్ధం]] ఇది. అనేక జానపద గాథలకు ప్రాణం పోసిన బీభత్స కాండ ఈ యుద్ధంలో జరిగింది.<ref name=":0" />
 
== బొబ్బిలికి విజయనగరానికీ మధ్య జరిగిన ఘర్షణలు ==
పంక్తి 37:
 
=== బుస్సీ వద్ద రాజకీయం ===
[[హైదరాబాదు]] [[నిజాం]] [[సలాబత్ జంగ్]] బుస్సీని[[బుస్సీ]]<nowiki/>ని ఉద్యోగం నుండి తొలగించిన వార్త తెలిసిన తరువాత [[విజయనగరం]] రాజులు తప్ప, ఉత్తర కోస్తా జమీందారు లందరూ ఫ్రెంచి వారికి శిస్తులు చెల్లించడం మానివేశారు. బుస్సీ [[నిజాం|నిజాము]]<nowiki/>తో రాజీ కుదుర్చుకుని, సర్కారు జిల్లాల పర్యటనకు వచ్చాడు. 1757 లో బుస్సీ నిజాము సంస్థానం నుండి బయల్దేరి [[మచిలీపట్నం]] మీదుగా [[రాజమండ్రి]] చేరుకుని, [[కోటిపల్లి]] వద్ద మకాం వేసాడు. [[పాలెగాళ్లు|పాలెగాళ్ళ]]<nowiki/>ను, జమీందార్లను, సంస్థానాధీశులను వచ్చి తనను కలవమని కబురు పంపాడు. బొబ్బిలి పాలకుడు [[రంగారావు]] తప్ప, విజయరామరాజుతో సహా అందరూ వచ్చి కలిసారు. విజయరామరాజు దీన్ని అవకాశంగా తీసుకుని రంగారావుకు వ్యతిరేకంగా బుస్సీ వద్ద, అతడి దివాను హైదర్ జంగు వద్దా ఆరోపణలు చేసాడు. మీరంటే వారికి లెక్కలేదని అందుచేతే మీ వద్దకు వచ్చి కలవలేదనీ, ఫ్రెంచి వారికి ఇవ్వాల్సిన శిస్తు సరిగా చెల్లించడం లేదనీ వారికి నూరిపోసాడు. వారి రాజ్యానికి పొరుగున ఉన్న తనకు అనేక రకాల ఇబ్బందులు కలగజేస్తున్నారని, వారిని బొబ్బిలి నుండి వెళ్ళగొట్టి, దాన్ని తనకు స్వాధీనం చేస్తే, శిస్తు సక్రమంగా చెల్లిస్తాననీ అతడు బుస్సీకి చెప్పాడు. దాంతో బుస్సీ, బొబ్బిలి వదలిపెట్టి పోవాలని రంగారావును ఆదేశించాడు. బొబ్బిలి స్థానంలో అంతకంటే పెద్దదైన వేరే స్థలానికి పోయి రాజ్యాన్ని స్థాపించుకోవచ్చని ప్రతిపాదించాడు. రంగారావు దాన్ని అవమానంగా భావించాడు.
 
విజయరామరాజు తాను [[మార్కీస్ దే బుస్సీ|బుస్సీ]]<nowiki/>కి కట్టాల్సిన కప్పం పది లక్షలూ కట్టేసాడు, అంతేకాక, మూడు లక్షల లంచం హైదర్ జంగుకు ఇచ్చి, బుస్సీకి బొబ్బిలిపై మనసు విరిచేందుకు సహకరించమని చెప్పాడు. హైదర్ జంగు అందుకంగీకరించాడు.
 
=== ఫ్రెంచి సిపాయీల వధ ===
కొద్ది రోజులకే బుస్సీ కొందరు సిపాయీలను ఒక దూరప్రదేశానికి పంపించాల్సి వచ్చింది. వాళ్ళు బొబ్బిలి రాజ్యం గుండా వెళ్ళాల్సి రాగా, అందుకు తగ్గ అనుమతులు కూడా తీసుకున్నారు. విజయరామరాజు కుటిల రాజకీయ చాతుర్యం కావచ్చు, రంగారావు ప్రణాళిక కావచ్చు, ఆ సిపాయీలపై దాడి జరిగింది, 30 మంది చనిపోయారు, అనేకమంది గాయపడ్డారు. బొబ్బిలి సంస్థానంపై చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని బుస్సీకి తెలియజేయడానికి [[విజయరామరాజు]] ఈ సందర్భాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. బొబ్బిలిని అణగదొక్కేసి, పాలెగారును అక్కడి నుండి తరిమెయ్యాలని బుస్సీ నిశ్చయించుకున్నాడు.
 
=== ఇబ్రహీమ్ ఖాన్ ఉదంతం ===
ఇబ్రహీం ఖాన్ [[శ్రీకాకుళం]]<nowiki/>లో ఫ్రెంచి వారి తరపున ఫౌజుదారు. బుస్సీకి నిజాముతో[[నిజాం|నిజాము]]<nowiki/>తో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో అతడు బుస్సీపై తిరుగుబాటు చేసాడు. [[రాజమండ్రి]] కోటలో సైనికులను రెచ్చగొట్టి, తిరుగుబాటు చేయించాడు. ఫ్రెంచి వారు వసూలు చేసిన శిస్తులు వెనక్కి ఇచ్చేయాలని అతడు డిమాండు చేసాడు. బుస్సీ [[రాజమండ్రి]] చేరుకోగానే అతడు భయపడి పారిపోయి, బొబ్బిలి రాజుల వద్ద శరణు కోరాడు.
 
ఈ సంఘటనలన్నీ బుస్సీకి బొబ్బిలిపై ఉన్న కోపాన్ని పెంచి, వారిపట్ల అతడికి ఉన్న శత్రు భావనను మరింతగా పెంచి, అతణ్ణి, యుద్ధం దిశగా నడిపించాయి.
పంక్తి 75:
బొబ్బిలి యుద్ధం 1757 జనవరి 24 న తెల్లవారుతూండగానే మొదలై సాయంత్రానికి ముగిసింది.
 
ఫ్రెంచి ఫిరంగులు బొబ్బిలి కోటను[[కోట]]<nowiki/>ను బీటలు వార్చడానికి పెద్దగా సమయం పట్టలేదు. అయితే బొబ్బిలి వీరుల ప్రతిఘటన కారణంగా ఫ్రెంచి వారు కోటలోపలికి ప్రవేశించలేకపోయారు. 9 గంటల ప్రాంతంలో యుద్ధానికి కొంత విరామం ప్రకటించి, ఫిరంగులను ప్రయోగించాక, మళ్ళీ కొనసాగించారు. 2 గంటలకు మరో విరామం ప్రకటించేవరకూ కూడా ఫ్రెంచి సైన్యం కోటలోకి ప్రవేశించలేకపోయింది. [[File:Thandra Paparayudu of Bobbili.jpg|thumb|తాండ్ర పాపయ్య]]
=== కోటలో బీభత్సం ===
ఆ సమయంలో రంగారావు తన ముఖ్య సేనానులను, అనుచరులను సమావేశపరచి, ఓటమి అనివార్యమని చెప్పి, తదుపరి కర్తవ్యం గురించి వారికి చెప్పాడు, అందరూ రంగారావు చెప్పినదానికి అంగీకరించారు. ఓటమి తరవాత, తామ స్త్రీలు, పిల్లలు శత్రువు చేతికి చిక్కి అవమానాల పాలు కాకూడదని భావించిన బొబ్బిలి వీరులు, కోటలోపల ఉన్న తమ నివాసాలకు నిప్పు పెట్టారు. మంటలకు తాళలేక బయటకు వచ్చే వారిని కత్తులతో పొడిచి చంపారు. ఆలా కోటలో ఏ ఒక్క స్త్రీ, గానీ, పిల్లవాడు గానీ బ్రతకలేదు, ఒక్క రంగారావు కుమారుడు తప్ప. కుమారుని చంపమని అతడి గురువుకు రంగారావు ఇచ్చిన ఆదేశాలను అమలు చెయ్యలేక అతడిని రక్షించాడు, ఆ బాలుడి గురువు.<ref name=":0" /> (మరో కథనంలో ఆ బాలుణ్ణి రక్షించినది అతడి ఆయా లక్ష్మి అని ఉంది.)<ref>[https://books.google.co.in/books?id=9Fb26pWqhScC నిజాము - బ్రిటను సంబంధాలు 1724-1857] - పేజి:106</ref>
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_యుద్ధం" నుండి వెలికితీశారు