వెల్మజాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నల్గొండ జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి ఖాళీ విబాగాలు తొలగించాను
పంక్తి 95:
}}
==గ్రామ చరిత్ర ==
నల్లగొండజిల్లా [[గుండాలమండలంగుండాల (జనగామ)|గుండాలమండలంలోని]]లోని వెల్మజాల ఒకప్పటి జైనబసదులగ్రామం. రాష్ట్రకూటుల పాలనలో వున్న గొప్పనగరం. ప్రస్తుత గ్రామానికి ఈశాన్యానవున్న పాటిగడ్డలో జైనబసదులు, ఒక ఆలయపు పునాదులు కనిపిస్తున్నాయి. నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణశిథిలాలు కనిపిస్తున్నాయి. ఇటుకలు, కుండపెంకులు, పునాది రాళ్ళు, గోడలఆనవాళ్ళు పాటిగడ్డ అంతటా అగుపిస్తున్నాయి. ఇక్కడే రాష్ట్రకూటుల రెండవ శాసనం లభించింది. మొదటిశాసనం అమ్మదేవత పోచమ్మ (దుర్గగుడి) ముందు దొరికింది. అక్కడే జైననిశీధులు (జైనపాదాలు) ఉన్నాయి. అందులో వెల్మజాలలోని జైనబసదికి అకాలవర్షుడు, రెండవ కృష్ణునికాలంలో క్రీ.శ.907 ఏప్రిల్ 1న రాజోద్యోగి రావిచంద్రయ్య చేసిన 100 మర్తురుల భూమి, ఒకతోట దానవివరాలున్నాయి. ఇదే నల్గొండజిల్లా శాసనసంపుటిలో తొలిశాసనం. రెండవశాసనాన్ని ఇంకా పరిష్కరించ లేదు కానీ లిపినిబట్టి ఇది 10వ శతాబ్దానిదని చెప్పవచ్చు. అదికూడా రాష్ట్రకూటులదే. అందులో జినాలయ ప్రస్తావన ఉంది. కనుక ఇది కూడా జైనబసదికి ఎవరో చేసిన దానశాసనమైవుంటుంది. దీన్నిబట్టి ఈవూరు సుదీర్ఘకాలం రాష్ట్రకూటులపాలనలో వున్నదని చెప్పడానికి వీలవుతుంది. వూరికి వాయవ్యాన ఆరడుగులఎత్తున్న ఒక శిథిల[[శివాలయం]] ఉంది. అది చిన్నరాతిబోడుమీద ఉంది. చతురస్రాకారపు పానవట్టంమీద చిన్నలింగం ఉంది. దేవాలయద్వారానికి రెండువైపుల శైవద్వారపాలకుల శిల్పాలున్నాయి. గుడిముందర ఒక వీరగల్లుంది. వీరనారి బాణం సంధించి, విల్లెక్కుపెట్టి ఉంది. చక్కని శిల్పం మరొక వీరగల్లు మొదటిశాసనమున్న [[పోచమ్మ]]గుడి ముందర ఉంది. ఇది ఆత్మాహుతి చేసుకుంటున్న భక్తుని వీరగల్లు. వీటిని చంపుడుగుళ్ళు అని చరిత్రకారులు అంటారు. చెరువులో విరిగిన నల్లరాతివిగ్రహం ఉంది. దానికి తలలేదు. ఆసనస్థితిలో వున్న ఈ శిల్పం దండరెట్టలకు నాగాభరణాలున్నాయి. బహుశః ఈ విగ్రహం [[శైవశిల్పం]] కావచ్చుననిపిస్తున్నది.
 
ఈ గ్రామంలో నన్నయ కాలం కంటే 100 సంవత్సరాల పూర్వపు శాసనం బయటపడింది.
పంక్తి 109:
===ఆరోగ్య సంరక్షణ===
ఇక్కడ ఒక ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఉంది.
 
== 2013 లో గెలుపొందిన గ్రామ పంచాయితి సభ్యులు ==
# సర్పంచ్.
# 1వ వార్డ్ మెంబర్.
# 2వ వార్డ్ మెంబర్.
# 3వ వార్డ్ మెంబర్.
# 4వ వార్డ్ మెంబర్.
# 5వ వార్డ్ మెంబర్.
# 6వ వార్డ్ మెంబర్.
# 7వ వార్డ్ మెంబర్.
# 8వ వార్డ్ మెంబర్.
 
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 2,789 - పురుషుల సంఖ్య 1,443 - స్త్రీల సంఖ్య 1,346 - గృహాల సంఖ్య 650 [1]
;
[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=08 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
 
==మూలాలు==
Line 130 ⟶ 118:
 
==వెలుపలి లంకెలు==
[1] [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=08 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]{{గుండాల (జనగామ) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వెల్మజాల" నుండి వెలికితీశారు