వజ్ఝల కాళిదాసు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
==విశేషాలు==
ఇతడు [[1909]], [[మే 13]]వ తేదీకి సరియైన [[సౌమ్య]] నామ సంవత్సర [[వైశాఖ బహుళ అష్టమి]] తిథిలో [[విజయనగరం జిల్లా]], [[బొబ్బిలి]] సమీపంలోని [[పాల్తేరు (విజయనగరం)|పాలతేరు]] గ్రామంలో వజ్ఝల శివశంకరశాస్త్రి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా జన్మించాడు. ఇతడు తన మాతామహుని ఇంట [[విజయనగరం]]లో వాణిజ్యశాస్త్రంలో ఉన్నతవిద్యను అభ్యసించాడు. ఇతని వంశంలో అందరూ పండితులే. ఇతని ముత్తాత అన్నయ్య వేదవిద్యాపారంగతుడు, మహాకవి. అతడు "యాదవరాఘవపాండవీయం" అనే కావ్యాన్ని రచించాడు. ఇతని తాత సీతారామస్వామి కాళహస్తి సంస్థానంలో దీవాన్‌గా పనిచేశాడు. ఇతనికి వరుసకు తాతగారైన [[వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి]] కళాప్రపూర్ణ బిరుదాంకితుడు, కర్ణచరిత్ర, ఆంధ్ర వైయ్యాకరణ పారిజాతము ఇత్యాది గ్రంథ రచయిత. ఇతని మేనమామ కొల్లూరి ధర్మారావు "చాకిరేవు" అనే విమర్శనా గ్రంథరచయిత.
 
ఇతడు తన 12వ యేటనే తన సహాధ్యాయి వజ్ఝల వేంకటేశ్వర్లుతో కలిసి "వెంకటకాళిదాసు కవులు"గా జంటకవిత్వం చెప్పడం ప్రారంభించాడు. ఈ జంటకవుల రచనలు 1927 నుండి భారతి, గృహలక్ష్మి, ఆంధ్రభూమి, శారద మొదలైన పత్రికలలో వెలువడ్డాయి. వీరు జంటగా మధుర అనే నవల, నళిని, నివాళి, భాష్పబిందువు అనే కావ్యాలతో పాటు అనేక కథలు, గేయాలు, పద్యాలు మొదలైనవి రచించారు. ఈ జంట గురించి [[కురుగంటి సీతారామయ్య]] తన [[నవ్యాంధ్రసాహిత్యవీధులు]] గ్రంథంలో ప్రస్తావించాడు.
"https://te.wikipedia.org/wiki/వజ్ఝల_కాళిదాసు" నుండి వెలికితీశారు