మహమ్మద్ ఖదీర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

68 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
చిదిద్దుబాటు సారాంశం లేదు
ముందొక పిట్ట కథ.
పూర్ణయ్యని బావగాఢంటారు అందరు.
బావగాడు లేకపోతే సరదాలేదు, సంబరమూ లేదు. పెళ్ళిగాని, పేరంటంగాని వంట హంగంతా బావగాడే. వంటవాళ్లని కూర్చోనిచ్చేవాడు కాదు. నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్లకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడితోపులో చేరారు. [[చాపలు]] పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. పేకాటలో[[పేకాట]]<nowiki/>లో మునిగినవారు మరికొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. ‘అందరూ వినండర్రా’ అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. పేకాట మూయించాడు. ‘వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను’ అంటూ లిస్టు చదివాడు. ‘వంకాయ మెంతికారం పెట్టిన [[కూర]], [[అరటికాయ వేపుడు|అరటికాయ]] నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగుపచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, అయ్యా జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడికోరుతో పులిహోర, గుమ్మడి [[వడియాలు]], వూర మిరపకాయలు. అందరికీ సమ్మతమేనా?’ అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం – అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే [[భోజనం]] మీద అందరికీ [[మమకారం]] పెంచాడు. [[జిహ్వ గ్రసని నాడి|జిహ్వ]] గిలగిల్లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అక్కడితో ఆగాడా? ఊహూ. లేత వంకాయలు కోయించుకు తెచ్చి ప్రదర్శనకు పెట్టాడు. ‘[[చుక్క కూర|చుక్కకూర]] కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహ చక్కగా మేళవిస్తుంది’ అని జ్ఞాపకం చేశాడు. [[పులిహోర]] తిరగమోత వెయ్యగానే ఆ ఘుమఘుమలకే జనానికి శరీరమంతా ఆకలే అయ్యేలా చేశాడు. అందర్నీ బంతులుగా కూచోపెట్టి కొసరికొసరి వడ్డించి తినిపించాడు….
 
మహమ్మద్‌ ఖదీర్‌బాబున్నాడే, అచ్చం బావగాడే బావగాడు.ఒక కథల[[కథ]]<nowiki/>ల సంతర్పణ మొదలుపెట్టాడు. రోజుకో కథ అన్నాడు. ‘ఓసంతేకదా, భారతి కాలం నుంచీ ఇలాంటివి ఎన్నో చూశాం’ అని జనాలు ఎవరి గోలలో వాళ్లు పడ్డారు. కొందరు పిచ్చాపాటీ కబుర్లు, కొందరు పేకాటలు, మరికొందరు రాష్ట్ర విభజన రాజకీయాలు. వారం రోజులు తిరిగేసరికల్లా కథల్ని కొత్తకొత్తగా ఖదీర్‌బాబు వండుతున్న కమ్మని వాసన అందరికీ చేరింది. ఇక వేరే చర్చలు ఆగిపోయాయి. సంతర్పణలో బావగాడు చూపెట్టిన వంకాయల మీదే మాటలు నడిచినట్టు ఎక్కడికక్కడ కథల మీదే మాటలు మొదలయ్యాలు.
‘అసలెలా ఎంచుకుంటున్నాడంటావ్‌?’
‘ఏది వరస?’
జనంలో కథల పట్ల [[ఆకలి]] నిలువెత్తయి, తాడి ప్రమాణమయింది. నూరు రోజులు, నూరుగురు కథకులు, నూరు కథలు.
పీవీ నరసింహారావు రాసిన కథలో గొల్ల రామవ్వ ఏం చేసింది?
[[పూసపాటి కృష్ణంరాజు]] చెప్పిన ‘రెండు బంట్లు పోయాయ్‌’ కథెప్పుడైనా చదివారా?
పురాణం సుబ్రమణ్యంశర్మ ‘రాజనీతి’ ఏమిటో తెలుసునా?
గూడూరి సీతారాం ‘లచ్చి’ కాపరాన్ని ఎలా తీర్చిదిద్దారు?
‘ధనత్రయోదశి’ కథలో [[భండారు అచ్చమాంబ]] ఇచ్చిన సందేశం ఏదైనా ఉందా?
‘హోగినెకల్‌’ దగ్గర ఉగ్రకావేరి ఏం చేసిందో మహేంద్ర మాటల్లో చదివారా?
[[నెల్లూరి కేశవస్వామి]] ‘యుగాంతం’ అయిపోయిందా, ఇప్పటికీ జరుగుతున్న కథా?
 
ఒక్కమాటలో చెప్పాలంటే వందరోజుల పాటు రోజుకో జీవితపు రుచి. అందుకున్నవాళ్లకి అందుకున్నంత. తెలుగు ప్రజలకు ఖదీరు వడ్డించిన మృష్టాన్న భోజనం. టీవీ సీరియళ్లు తప్ప మరో లోకమెరుగని ఇల్లాళ్లెందరో ఈ కథలున్న పుస్తకాలెక్కడ దొరుకుతాయోనని ఆరా తీశారు. ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని హైదరాబాదులో[[హైదరాబాదు]]<nowiki/>లో ఉద్యోగమే పరమావధిగా బతుకుతున్న కుర్రకారంతా తెలుగు కథలింత బావుంటాయా – మరి మాకెవరూ చెప్పలేదేం అనుకున్నారు. సప్త సముద్రాలు దాటి అక్కడెక్కడో ప్రవాస జీవితం గడుపుతున్నవారంతా తెలుగు కథల [[పుస్తకాలు]] కావాలని ఇక్కడికి ఫోన్లూ మెయిళ్లూ కొట్టేరు. ‘రావిశాస్త్రి పోయాక తెలుగు కథలు చదవడం మానేశానండీ’ అని స్పష్టంగా చెప్పిన నడివయసు జనాలంతా మళ్లీ తెలుగు కథ మీద ఇష్టం పెంచుకున్నారు. ‘నా కథ ఎప్పుడు వస్తుందో’ అని రచయితలు ఎదురుచూశారు. తమ కథ వచ్చిన రోజు పాఠకుల ఫోన్లు వెల్లువైపోతుంటే తట్టుకోలేక సంతోషంతో మనసు నిండిపోయి అది కంట నీరుగా ఒలికిపోతుంటే చిరునవ్వుతో[[చిరునవ్వు]]<nowiki/>తో స్వీకరించినవారున్నారు.
 
పోతే ఒకటే తేడా. బావగాడు వండించి వడ్డించిన తీరుకు జనాలంతే సుష్ఠుగా తిని ఆకుల ముందునుంచి లేవడం కూడా కష్టమైపోయింది, ఖదీరు కథలు చెప్పి ప్రచురించిన జోరు జనాల మీద ఎపిటైజర్లా పనిచేసింది. వాళ్ల ఆకలి సగం తీరి, మరి సగం తీరకుండా ఉండిపోయింది. వంద కథల తర్వాత దినపత్రికలో ఆ ఫీచర్‌ మరిక రాదంటే వాళ్లకి పిచ్చకోపమొచ్చింది. అలాగని కథల [[భోజనం]] ముందు నుంచి లేవలేరు. ‘‘ఏం తెలుగులో ఉన్నవి ఈ నూరు కథలేనా? ఈ నూరుగురు కథకులేనా? మరో వంద చెప్పలేవూ?’’ అని నిలదీశారు. రచయితలకూ కోపమొచ్చింది. ‘‘ఏం తెలుగులో కథలంటే అవేనా? మరో యాభయ్యో వందో వేస్తే నాదీ ఆ జాబితాలో నిలబడకపోదునా?’’ అని చాటుమాటుగా విసుక్కున్నారు. అమరావతి కథల్లో బావగాడి సంతర్పణకీ, ఖదీరుబాబు సంతర్పణకీ ఇదిగో ఇదొక్కటే తేడా.
 
దాన్ని ఖదీరుబాబు ఊహించాడు. అనుభవించాడు. అందుకే వినయంగా ‘‘కొండను అద్దంలో చూపిస్తున్నా’’నని చెప్పేశాడు. ‘‘వందేళ్లలో వచ్చిన వంద సుప్రసిద్ధ కథలను ఏరి, వాటిని క్లుప్తంగా తిప్పి చెప్పిన ప్రయత్నం ఇది. కథను చదివే, కథ మొతాన్ని చదివే, కథను వెతుక్కుని చదివే వీలు లేని అడావిడి రోజుల్లో నూరేళ్ల తెలుగు కథా సాహిత్యాన్ని అలుపు లేకుండా ముగించడానికి వీలుగా చేసిన ప్రయత్నం ఇది. తెలుగు కథకు ఒక కథకుడు ప్రకటించిన కృతజ్ఞత’’ అని చెప్పుకున్నాడు.ఈ వందమంది కథలను నేను ఎంతో సంతోషంగా రాశాను. ఎంతో పరవశిస్తూ రాశాను. ప్రతి కథలోని సంస్కారాన్ని ఎంతగానో స్వీకరిస్తూ రాశాను. ప్రతి రచయితా వదిలివెళ్లిన కథాస్థలిని ఎంతో కుతూహలంతో రీవిజిట్‌ చేశాను. ఇది నాకు పండగ. నిజంగా నేను అనుభవించిన పండగ’’ అని చెప్పిన ఖదీర్‌ మాటల్లో ప్రతి అక్షరమూ సత్యమేననిపిస్తుంది ఈ పుస్తకం చదివాక.
1,96,516

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2293025" నుండి వెలికితీశారు