వజ్ఝల కాళిదాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==విశేషాలు==
===బాల్యం, విద్యాభ్యాసం===
ఇతడు [[1909]], [[మే 13]]వ తేదీకి సరియైన [[సౌమ్య]] నామ సంవత్సర [[వైశాఖ బహుళ అష్టమి]] తిథిలో [[విజయనగరం జిల్లా]], [[బొబ్బిలి]] సమీపంలోని [[పాల్తేరు (విజయనగరం)|పాలతేరు]] గ్రామంలో వజ్ఝల శివశంకరశాస్త్రి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా జన్మించాడు. ఇతడు తన మాతామహుని ఇంట [[విజయనగరం]]లో వాణిజ్యశాస్త్రంలో ఉన్నతవిద్యను అభ్యసించాడు. ఇతని వంశంలో అందరూ పండితులే. ఇతని ముత్తాత అన్నయ్య వేదవిద్యాపారంగతుడు, మహాకవి. అతడు "యాదవరాఘవపాండవీయం" అనే కావ్యాన్ని రచించాడు. ఇతని తాత సీతారామస్వామి కాళహస్తి సంస్థానంలో దీవాన్‌గా పనిచేశాడు. ఇతనికి వరుసకు తాతగారైన [[వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి]] కళాప్రపూర్ణ బిరుదాంకితుడు, కర్ణచరిత్ర, ఆంధ్ర వైయ్యాకరణ పారిజాతము ఇత్యాది గ్రంథ రచయిత. ఇతని మేనమామ కొల్లూరి ధర్మారావు "చాకిరేవు" అనే విమర్శనా గ్రంథరచయిత. కాళిదసు 1928 లో "ఆంధ్రమహావిష్ణువు" అనే చారిత్రిక పద్యకావ్యాన్ని వ్రాసాడు.<ref>{{Cite web|url=http://www.indianetzone.com/49/telugu_poetry_twentieth_century.htm|title=Telugu Poetry in Twentieth Century|website=www.indianetzone.com|access-date=2018-01-23}}</ref>
===జంటకవిత్వం===
ఇతడు తన 12వ యేటనే తన సహాధ్యాయి వజ్ఝల వేంకటేశ్వర్లుతో కలిసి "వెంకటకాళిదాసు కవులు"గా జంటకవిత్వం చెప్పడం ప్రారంభించాడు. ఈ జంటకవుల రచనలు 1927 నుండి భారతి, గృహలక్ష్మి, ఆంధ్రభూమి, శారద మొదలైన పత్రికలలో వెలువడ్డాయి. వీరు జంటగా మధుర అనే నవల, నళిని, నివాళి, భాష్పబిందువు అనే కావ్యాలతో పాటు అనేక కథలు, గేయాలు, పద్యాలు మొదలైనవి రచించారు. ఈ జంట గురించి [[కురుగంటి సీతారామయ్య]] తన "నవ్యాంధ్ర సాహిత్యవీధులు" గ్రంథంలో ప్రస్తావించాడు.
పంక్తి 13:
===రచనలు===
* బిక్షావతి (కావ్యం)
* ఆంధ్రమహావిష్ణువు (ద్విపదకావ్యం).<ref>{{Cite web|url=http://www.indianetzone.com/49/telugu_poetry_twentieth_century.htm|title=Telugu Poetry in Twentieth Century|website=www.indianetzone.com|access-date=2018-01-23}}</ref>
* పంటవలతి (యక్షగాన నాటకం)
* శాతవాహన సంభవం (కావ్యం)
"https://te.wikipedia.org/wiki/వజ్ఝల_కాళిదాసు" నుండి వెలికితీశారు