దూకుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
14 ఏళ్ళ తర్వాత, శంకరన్న కొడుకు అజయ్ కుమార్ ([[ఘట్టమనేని మహేశ్ బాబు]]) దుందుడుకుగా ప్రవర్తించే ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. మాఫియ డాన్ నాయక్ (సోను సూద్)ని పట్టుకుని అతను నడుపుతున్న డ్రగ్స్, గన్స్ మరియు ఇతర ఇల్లీగల్ వ్యాపారాలను ఆపాలనే మిషన్ పై అతనిని నియమిస్తారు. ఆ తర్వాత శంకరన్న చనిపోలేదని, కానీ ప్రమాదం జరిగాక కోమాలోకి వెళ్ళాడని తెలుస్తుంది. ఈ నిజాన్ని శంకరన్న కుటుంబం జనాలకు తెలియనివ్వదు. అజయ్ నాయక్ని పట్టుకోడానికి ఇస్తాంబుల్ వెళ్తాడు. అక్కడ ఓ అండర్-కవర్ ఆపరేషన్లో నాయక్ తమ్ముడు బంటి (ఆజజ్ ఖన్)ని పట్టుకుంటాడు అజయ్. ఆ తర్వాత శంకరన్న దగ్గర విశ్వాశంగా పనిచేసి అతని ప్రమాదం తర్వాత జైలుకెళ్ళిన శివయ్య (ఆదిత్య) ద్వారా నాయక్ స్నేహితుడు, అవినీతిపరుడు, ప్రతిపక్ష నాయకుడు అయిన మల్లేశ్ గౌడ్ ([[కోట శ్రీనివాసరావు]]) శంకరన్న చావుకి ప్లాన్ చేసిన వాడని, ఈ ప్లానుకి మేక నరసింహారావు, గణేశ్ సహకరించారని తెలుసుకుంటారు.
 
ఇస్తాంబుల్లో ఉన్నప్పుడు అజయ్ ప్రశాంతి ([[సమంత]])ని చూసి ప్రేమిస్తాడు. ప్రశాంతి అజయ్ సీనియర్ ఐన మూర్తి ([[నాజర్]]) కూతురు. మూర్తి హైదరాబాదు నుంచి పోలీస్ కమిషనర్ ([[సుమన్ తల్వార్]])తో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు అజయ్ తో కలిసి వార్తలందిస్తుంటాడు. శంకరన్న కోమా నుంచి బయటికొచ్చాక తనేదైనా బాధాకరమైన, ఆందోళనకరమైన లేక షాక్ కు గురిచేసే వార్తలు గానీ, విషయాలు గానీ తెలుసుకుంటే అతని ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్లు అజయ్‌కి చెప్తారు. తన తండ్రి కారు ప్రమాదానికి సంబంధించిన విషయాలను అజయ్ దాచేస్తాడు. అజయ్ తన తండ్రి ఇదివరకు ఉన్న ఆ పాత బంగళాని మరలా అద్దెకు స్నిగ్ధ పకనతి తీసుకుంటాడు.
 
సినిమా షూటింగులకు వాడుతున్న ఆ ఇంటిలో ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తాడు. రియాలిటీ షో పేరుతో నటించాలని ఉన్న అందులో ఎదగలేక పోయిన పద్మశ్రీ ([[కన్నెగంటి బ్రహ్మానందం]]) అనే వ్యక్తిని వాడుకుంటారు. వారి బంగళా ప్రస్తుత ఓనరైన అతనితో ఈ షో సినీ నటుడు అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడని, నాగార్జునలా ఒకరిచే మాట్లాడించి ఈ షోలో తన నటనకి భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాలనుకున్నారని చెప్పించి అతనిని ట్రాప్ చేస్తారు. ఇంకోవైపు మేక నరసింహరావు బావమరిది, పద్మశ్రీలానే నటన పిచ్చి ఉన్న బొక్క ([[ఎమ్.ఎస్.నారాయణ]])ని సినిమా డైరెక్టరునని, నీతో సినిమా తీస్తానని చెప్పి అతనిని కూడా ట్రాప్ చేస్తారు. మల్లేశ్ గౌడ్ తో కూడా ఒక పెద్ద బిజినెస్ డీల్ పేరిట ట్రాప్ చేసి అతని ద్వారా నాయక్ని రప్పించాలని ప్లాన్ చేస్తాడు. ఐతే శంకరన్న ముందు మాత్రం తానో ఎం.ఎల్.ఏ. అని జనం చేత ఆదరించబడుతున్న వాడిలా నటిస్తాడు. తన తండ్రి సంతోషానికి తను ప్రేమించిన ప్రశాంతి ప్రేమను గెలిచి తనని పెళ్ళి చేసుకుంటాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం తన స్నేహితులు, శివయ్యతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా నాయక్ తో కలిపి అందరినీ చంపేస్తాడు. కానీ కొన్నాళ్ళకు శంకరన్నకి నిజం తెలిసి అజయ్‌ని ఎందుకిలా చేశావని అడుగుతాడు. అందుకు అజయ్ నువ్వు నాకు జన్మనిచ్చిన తండ్రివి కాబట్టి అలా చేశానని చెప్తాడు. దానితో శంకరన్న ఆనందానికి హద్దుల్లేకుండా పోతాయి. చివరికి అందరూ సుఖంగా కలిసుండటంతో కథ సుఖాంతమౌతుంది.
"https://te.wikipedia.org/wiki/దూకుడు_(సినిమా)" నుండి వెలికితీశారు