కొడాలి కమలాంబ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[కొడాలి కమలాంబ]]''' (కమలమ్మ) గారు ప్రముఖ స్వతంత్ర యోధులు, [[క్విట్ ఇండియా]] ఉధ్యమం లో పాల్గొని 15 నెలలు జైలు శిక్ష అనుభవించారు.
==బాల్యం, విద్య==
[[గుంటూరు]] జిల్లా [[మోపర్రు]]లో [[1915]]లో గోగినేని వెంకాయమ్మ, రామకోటయ్య దంపతులకు జన్మించారు. రామకోటయ్య గారు మోపఱ్ఱు గ్రామంలోని పొలాలను అమ్మి వేసి చెరుకుపల్లి సమీప నడింపల్లి గ్రామాన పొలాలు కొని వ్యవసాయం చేసేవారు.
 
కమలాంబ గారు నాలుగవ తరగతి వరకు [[నడింపల్లి]]లో చదివారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో గ్రంథాలయానికి వెళ్లి [[గాంధీ]]జీ ఆత్మకథ, [[గౌతమ బుద్ధుడు]] జీవిత చరిత్రలు చదివారు. వారిని అమితంగా ప్రభావితం చేసిన గ్రంథాలివే. వారికి చదువుకోవలేనని సంకల్పమున్నా సమీపంలో హై స్కూల్ లేకపోవడం వలన చదువు కొనసాగించలేక పోయారు. బాల్యంలో[[బాల్యం]]<nowiki/>లో సంగీతం కూడా నేర్చుకున్నారు. తరువాత ఆమె హిందీలో విశారద చదివారు. విశారద పట్టాను [[1940]]లో మద్రాసులో గాంధి గారి చేతుల మీదుగా తీసుకున్నారు.
 
==వివాహం, భర్త, కుటుంబం==
ఈమె [[కొడాలి కుటుంబరావు]] భార్యగా అందరికీ సుపరిచుతురాలు. ఈమె పదహారవ సంవత్సరాన [[మోపఱ్ఱు]]కు చెందిన కొడాలి కుటుంబరావు గారితో వివాహం జరిగింది. వీరికి సమీప [[బంధువులు]] శ్రీ గుత్తికొండ రామబ్రహ్మం దంపతులు ఈమెకు అండగా ఉండేవారు. మోపఱ్ఱు గ్రామంలో కమలాంబ గారు రాట్నాలపై [[నూలు]] వడకి తయారు చేసి [[చీర]]లు నేయించి వాటిని ధరించేవారు. [[హరిజనవాడ]]లో రాట్నాలు ఏర్పాటు చేయించారు. మోపఱ్ఱు గ్రామంలో ఆమె [[హిందీ]] చదివి ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్రబాష లలో ఉత్తీర్ణులైనారు. [[1946]]లో గాంధీజీ నుండి కమలాంబ గారు రాష్ట్ర విశారద పట్టాను పొందారు. ఈమెకు ఒక [[కుమారుడు]], ఒక [[కుమార్తె]] [[ఇద్దరు]] [[సంతానం]]. కుమారుని [[డాక్టర్]] చదివించారు. కుమార్తెను యం.యస్సి చదివించారు.
 
==స్వతంత్ర సంగ్రామం, జైలు శిక్ష==
[[సింగంపల్లి సుబ్బారావు]] గారు ప్రారంభించిన “జాతి భేద నిర్మూలన “ కార్యక్రమాలలో పాల్గొన్నారు. [[1940]]లో గాంధీ గారికి ఉత్తరం వ్రాసి అనుమతి పొంది మోపఱ్ఱు గ్రామం మధ్యన ఒక నెల రోజుల పాటు హనుమాయమ్మ గారితో పాటు [[కాంగ్రెస్]] జెండాతో [[సత్యాగ్రహం]] చేశారు. గ్రామ హరిజనవాడలో [[గ్రంథాలయం]] ఏర్పాటు చేశారు. గాంధీజీ పిలుపు క్విట్ ఇండియా ఈ క్షణం నుండి ప్రతి భారతీయుడు స్వతంత్రుడు. విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలి అనే ఆయన పిలుపు కమలాంబగారిని కదలించింది.
 
19-09-[[1942]] న [[తెనాలి]]లో గల జిల్లా [[కాంగ్రెస్]] కార్యాలయానికి చేరుకున్నారు. [[చిట్టూరి అన్నపూర్ణమ్మ]], శాంత అనే మహిళలతో కలసి కోర్ట్ వద్ద పికెటింగ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయగా మేజిస్ట్రేట్ కమలాంబ గారికి 15 నెలల కఠిన కారాగార శిక్షను విధించారు, ఆమె రాయవెల్లూరు స్త్రీల కారాగారంలో[[కారాగారము|కారాగారం]]<nowiki/>లో దుర్భరమైన జైలు జీవితాన్ని అనుభవించారు. [[1943]] [[జనవరి 26]] న జైలులో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి జైలు అధికారుల ఆగ్రహానికి గురయ్యారు.
 
==సంఘసేవలో==
"https://te.wikipedia.org/wiki/కొడాలి_కమలాంబ" నుండి వెలికితీశారు