క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 65:
 
 
'''పెఱిక క్షత్రియులు'''/'''పురగిరి క్షత్రియ''': ఇతిహాసాల ప్రకారం వీరు పరశురాముడి క్షత్రియ వధ నుండి తప్పించుకున్నవారు. ఆ సమయంలో కొద్ది మంది క్షత్రియులు పిరికి తనంతో తాము వ్యాపారస్తులమని చావు నుండి తప్పించుకొన్నారు.అయితే వీరు పిరికి వారు, అబద్దాలాడేవారూ కాదు. కొద్ది మంది క్షత్రియులు తమ పదవులనుండి విరమణ పొందిన తర్వాత కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్క నివాసాలు ఏర్పరచుకొన్నారని, కాల క్రమేణా వారు పురగిరి క్షత్రియులుగా పిలువబడ్డారు. అందువల్ల వీరిని పురగిరి క్షత్రియులని కూడా అంటారు. చంద్ర వంశానికి చెందిన వీరు ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తారు.
 
'''థాకూర్''': వీరు నైరుతి భారతదేశంలో గుర్జార-ప్రతిహార మరియు కుషాణు ల సామ్రాజ్యాల వారసులయి ఉండవచ్చును. థాకూర్ అనే పదాన్ని రాజస్థాన్ రాజపుత్రులు, జాట్ లు బిరుదుగా వాడతారు, బెంగాలలో బ్రాహ్మణులు థాకూర్ పదాన్ని టాగూర్ అనే బిరుదుగా వాడతారు.
Line 71 ⟶ 70:
'''ఖండాయత్ ''' లు: వీరు ఒడిశాను 16 వ శతాబ్దంలో పాలించారు. ఖండాయత్ లలో గోవింద విద్యాధర (క్రీ.శ.1542-1559) అనే రాజు గజపతిరాజుల్లో ఆఖరి రాజైన కాఖా రుద్రదేవుడుని హతమార్చి 'భోయ్' సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
 
 
'''తమిళ క్షత్రియులు''': వన్నియకుల క్షత్రియులు లేక పల్లీలు అనబడే వీరు తమిళనాడు, కేరళ లలోని చాలా ప్రాంతాలు పాలించారు. తమిళనాడులో వీరిని గౌండర్, పదయాశ్చి, నైఖర్, రెడ్డియార్, కందర్, పల్లి అని; పాండిచ్చెరిలో - వన్నియార్, రెడ్డియార్, పదయాశ్చి అని, కర్ణాటకలో తిగల/తిగలారు అని; ఆంధ్ర ప్రదేశ్ లో అనామకులు, ఆర్యమాల, బావురి, ఆజ్ఞికుల, వన్నె కాపు, వన్నె రెడ్డి అని పిలుస్తారు. పల్లవ రాజుల కాలంలో వీరు సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా పనిచేశారు.
''పూర్తి వ్యాసమునకు [[అగ్నికులక్షత్రియులు]] చూడండి.''
'''తులునాడు క్షత్రియ''': వీరినే బంట్స్ లేక బంట్లు అని అందురు. నాగవంశానికి చెందిన వీరు కర్ణాటకలో ఉన్న తులునాడులో కన్పిస్తారు. అలుపాస్ అనే బంట్లు కేరళలో కాసరగోడు నుండి కర్ణాటకలో గోకర్ణ వరకు బంట్లు 'అల్వ ఖేద' సామ్రాజ్యాన్ని స్థాపించి క్రీస్తు శకం 450 నుండి 1450 వరకు పాలించారు. ఉడిపి, మంగళూరు, ముంబై లలో కూడా వీరు కన్పిస్తారు. వీరిని నాయక, నాడవ, శాస్త్రే (లేక శెట్టి) అని కూడా అందురు.
Line 78 ⟶ 76:
'''కూర్గులు''' (కొడవులు) : కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కొడగు జిల్లాలో కన్పించే వీరు వ్యవసాయదారులు మరియు యుద్ధ వీరులు. స్కంద పురాణం ప్రకారం చంద్రవంశ క్షత్రియుడైన చంద్రవర్మ వీరి పూర్వీకుడని చెప్పవచ్చు.
 
'''సామంత క్షత్రియులు''': నాగవంశానికి, చంద్ర వంశానికి చెందిన వీరు కేరళ రాష్ట్రంలో కన్పిస్తారు. నైర్ (లేక నాయర్) అనేది వీరి మరో పేరు. సామంత క్షత్రియులలో - తిరువాన్కూరు, థంపన్, తిరుమల్ పడ్ వంటి రాజవంశాలు చంద్రవంశానికి చెందినవి. మార్తాండ వర్మ (1729–1758) తిరువాన్కూరు సామ్రాజ్య వ్యవస్థాపకుడు.
 
'''బాలనీయులు''': నాగవంశానికి చెందిన వీరు ఇండోనేషియాలో ఉన్న బాలి అనే ద్వీపంలో కన్పిస్తారు. దేవ అగుంగ్ (క్రీ.శ.1686. 1722) బాలి ద్వీపాన్ని 500 సంవత్సరాల క్రితం పాలించాడు. ఇంచుమించు బాలనీయ క్షత్రియులందరూ దేవ అగుంగ్ వారసులే. క్రీస్తు శకం 914లో శ్రీ కేసరి వర్మ దేవ 'వర్మ దేవ' సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు శకం 1133 లో శ్రీ జయశక్తి 'జయ' సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు