రెండవ హరిహర రాయలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 12:
 
==యుద్దములు==
మొదటి తరం విజయనగర రాజులకు బహుమనీ సుల్తానులతో యుద్ధాలు తప్పలేదు. రెండవ తరం రాజులకు గజపతులతోనూ, నాలుగు బహుమనీ సుల్తాను శాఖలతోనూ యుద్ధాలు తప్పలేదు. [[1378]]లో బహుమనీ సుల్తాను [[ముజాహిద్ షా]] దారుణంగా హత్యచేయబడినాడు. బహుమనీ రాజ్యం అంతఃకలహాలకు ఆలవాలమయినది. [[1378]] నందే [[రెండవ మహమ్మద్ షా]] సింహాసనము అధిస్టించాడు. ఇతను శాంతిశీలుడు. ఈ కాలములో దక్షిణభారతదేశములందు పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. [[కొండవీడు]] రెడ్డిరాజ్యమున [[పెదకోమటి వేమారెడ్డి]], [[కుమార గిరి రెడ్డికుమారగిరి]], [[కాటయవేమా రెడ్డి]] ల మధ్య తరచూ యుద్ధములు జరుగుతుండేవి. ఇదే సమయములో [[రేచర్ల పద్మనాయకులు]] [[బహుమనీ సుల్తాను]]లతో స్నేహం చేసుకొని [[విజయనగర]], [[కొండవీడు]] రాజ్యములను ఆక్రమించాలని పథకం రూపొందించారు. ఇటువంటి పరిస్థితులలో '''రెండవ హరిహర రాయలు''' [[కొండవీడు]] రాజ్యమందున్న [[శ్రీశైలం]] ప్రాంతమును ఆక్రమించారు. కానీ [[కాటయవేమా రెడ్డి]] [[విజయనగర]] సేనలను ఎదుర్కొని ఓడించాడు. '''హరిహర రాయలు''' కాటయవేమునితో సంధిచేసుకొని అతని కొడుకు [[కాటయ]]కూ తన కూతురు [[లక్ష్మి]]కి వివాహం జరిపించాడు.
===మోటుపల్లి యుద్దం===
'''హరి హర రాయలు''' కుమారుడైన [[దేవ రాయలు]] [[ఉదయగిరి]] అధిపతి . ఆతడు సైన్యముతో [[మోటుపల్లి]] రేవును ఆక్రమించాడు. తరువాత [[కొండవీడు]] రాజ్యముపైకి '''హరిహర రాయలు''' [[చౌండసేనాని]]ని పంపించాడు. ఇదే సమయంలో [[కొండవీడు]]ను [[కుమారగిరి]] నుండి స్వాధీనము చేసుకున్న [[పెదకోటి వేమా రెడ్డి]] [[విజయనగర]] సైనికులను [[కొండవీడు]] భూబాగాలనుండి తరిమివేశాడు.
"https://te.wikipedia.org/wiki/రెండవ_హరిహర_రాయలు" నుండి వెలికితీశారు