వై. కాశీ విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , గా → గా , పని చేశాడు → పనిచేశాడు, → (2) using AWB
పంక్తి 22:
'''యనమదల కాశీ విశ్వనాథ్''' తెలుగు సినీ నటుడు, మరియు దర్శకుడు. [[నువ్వు లేక నేను లేను]] ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా. దర్శకుడు కాక మునుపు ఆయన సుమారు 25 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేట్ దర్శకడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. నటుడిగా ఆయన మొదటి సినిమా [[రవిబాబు]] దర్శకత్వం వహించిన నచ్చావులే అనే సినిమా. ఈ సినిమాలో కథానాయకుడి తండ్రి పాత్ర పోషించాడు. ఆ సినిమా నుంచి ఆయన నటుడిగా కొనసాగుతున్నాడు. తొంభైకి పైగా సినిమాల్లో నటించాడు.
== బాల్యం, విద్యాభ్యాసం ==
కాశీవిశ్వనాథ్ [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పుగోదావరి జిల్లా]], [[రాజమహేంద్రవరం]]కు దగ్గర్లోని [[సీతానగరం]] మండలం, [[పురుషోత్తపట్నం (సీతానగరం)|పురుషోత్తపట్నం]] లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు భూగోపాలరావు, మంగమణి. ప్రాథమిక విద్య తన స్వగ్రామంలోనే పూర్తి చేశాడు. [[పోలవరం]] ప్రభుత్వ పాఠశాలలో ఆరు నుంచి పన్నెండో తరగతి దాకా చదివాడు. [[రాజమండ్రి]]<nowiki/>లో బీ.కాం పూర్తి చేశాడు.

== సినీరంగ ప్రస్థానం ==
బాల్యంలో ఆయన బంధువులకు సినిమా హాలు ఉండేది. అందులో ఆయన ఉచితంగా సినిమాలు చూసేవాడు. వాటిని చూసి స్ఫూర్తి పొంది చిన్న కథనాలు రాసుకుని అమ్మకు వివరించేవాడు. ఆమె కూడా ప్రోత్సహించేది. ఇంటర్మీడియట్ చదువుతున్నపుడు వారి ఊరికి దగ్గరలో బాలచందర్ దర్శకత్వంలో [[తొలికోడి కూసింది|తొలి కోడి కూసింది]] అనే సినిమా షూటింగ్ జరగడం చూశాడు. అప్పటి నుంచి సినీరంగం వైపు ఆకర్షితులయ్యాడు. కుటుంబ సభ్యులకి ఆ విషయాన్ని తెలియ జేశాడు. తనకి సోదరుడి వరసయ్యే గద్దె రత్నాజీ రావు ప్రోత్సాహంతో చెన్నై వెళ్ళి కానూరి రంజిత్ కుమార్ అనే నిర్మాతను కలిశాడు. అప్పుడు ఆయన [[విజయనిర్మల]] దర్శకత్వంలో [[లంకె బిందెలు]] అనే సినిమా తీస్తున్నాడు. ఈయన ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు.
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/వై._కాశీ_విశ్వనాథ్" నుండి వెలికితీశారు