తేనెటీగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''[[తేనెటీగ]]'''లనేవి ఒక రకమైన [[తుమ్మెద]]లు. ఆర్థికపరంగా మానవులకు సహాయపడుతున్న ఉత్పాదక [[కీటకాలు]]. ఇవి పూలనుండి [[మకరందం|మకరందాన్ని]] సేకరించి [[తేనెపట్టు]]లో ఉంచి [[తేనె]]గా మారుస్తాయి. ఇవి సంతానోత్పత్తి కోసం తేనెపట్టును ఏర్పరచుకొంటాయి.
 
తేనెటీగల సహనివేశం సాధారణంగా ఒక రాతికిగాని, భవనానికి చెందిన కమానుకుగాని లేదా చెట్టుకు చెందిన శాఖకు తేనెపట్టును నిర్మిస్తాయి. ఒక్కొక్క సహనివేశంలో దాదాపు 50,000 తేనెటీగలు ఉంటాయి. ఒక్కొక్క తేనెపట్టులో [[మైనం]]తో చేసిన షడ్భుజాకారపు కక్ష్యలు అనేకం ఉంటాయి. ఇవి రెండు రకాలు: 1. తేనెను, పుప్పొడి రేణువులను నిల్వ ఉంచేవి. 2. పిండ సంరక్షణకు ఉపయోగపడేవి. ఇవికాక రాణీ ఈగ కోసం పెద్ద కక్ష్య ఒకటి ఉంటుంది. పిండ రక్షణ కక్ష్యలో అండాలుంటాయి. తేనె పుప్పొడి రేణువులు పిండదశలకు ఆహారం. పిండదశలనుండి కొత్త ప్రౌఢ ఈగలొస్తాయి. ఒక తేనెటీగల సహనివేశంలో మూడు రకాల ఈగలుంటాయి. 1. రాణి ఈగలు, 2. డ్రోన్ లు, 3. కూలి ఈగలు.
"https://te.wikipedia.org/wiki/తేనెటీగ" నుండి వెలికితీశారు