పతంజలి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Patanjali.jpg|thumb|right|180px|<center>పతంజలిని ఆదిశేషుడి అంశగా భావిస్తారు.పతంజలి విగ్రహం హరిద్వార్</center>]]
'''[[పతంజలి]]''' [[యోగ శాస్త్రం]] [[సూత్రాలు|యోగ సూత్రాలను]] మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనసు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు. అంతేకాక [[పాణిని]] రచించిన [[అష్టాధ్యాయి]]కి భాష్యాలు కూడా రచించాడు.కానీ చాలామంది పండితులు ఈ రెండు గ్రంథాలు ఒకరు రాసినవి కాకపోవచ్చునని భావిస్తున్నారు. పతంజలి <ref>
Jonardon Ganeri, ''Artha: Meaning'', Oxford University Press 2006, 1.2, p. 12</ref><ref>S. Radhakrishnan, and C.A. Moore, (1957). A Source Book in Indian Philosophy. Princeton, New Jersey: Princeton University, ch. XIII, Yoga, p.453</ref><ref name=gavin>Gavin A. Flood, 1996</ref> "[[యోగ సూత్రాలు]]" గ్రంథంతో బాటు [[పాణిని]] చే రచింపబడ్డ అష్టాద్యాయికి కూడా భాష్యం రాసాడు.
ఈ మధ్య కాలంలో '''యోగ''' బాగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా పశ్చిమ ప్రపంచం భారత దేశంలో పుట్టిన యోగ సిద్దాంతాన్ని (ముఖ్యంగా రాజ యోగ) రాజయోగం బహుళ ప్రచారంలోకి వచ్చింది. ప్రముఖ తెలుగు రచయిత్రి, కథకురాలు, సాహిత్య విమర్శకురాలు మరియు తెలుగు [[ఉపాధ్యాయులు]] అయిన [[నిడదవోలు మాలతి]] గారు ఈ మధ్య కాలంలో పతంజలి యోగ సూత్రములను తెలుగులోకి అను వాదము చేసారు.
==చరిత్ర==
క్రీ.పూ 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి [[శ్రీకృష్ణుడు]] జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు. అంటే దాదాపు యిప్పటికి 5000 సంవత్సరాలకు పైమాటే! భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కలకన్నా ఎంతో పూర్వీకులన్నది కాదనలేని సత్యం.
పంక్తి 26:
చిత్తస్థైర్యం సాధించడానికి కొన్ని పద్ధతులు సూచించేరు పతంజలి. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు క్రమబద్ధం చేయడం (ప్రాణాయామం), ముక్కు, చెవివంటి ఇంద్రియప్రవృత్తులమీద తదేకదృష్టితో ధ్యానించడంద్వారా కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఈ ప్రయత్నాలన్నిటిలోనూ అంతర్గతభావం ఇతరవిషయాలనుండి చిత్తమును యోగంవైపు మళ్ళించడం, యోగంమీద దృష్టిని సుస్థిరంగా నిలపడం.
 
వైరాగ్యం అంటే భౌతికవిషయాలలో ఆసక్తిని నిరోధించడం. వ్యక్తి తాను ఏ విషయాలలో అనురక్తుడో గుర్తించి ఆ అనురక్తిని నిర్మూలించడమే వైరాగ్యం. అభ్యాసంతో ఈ [[వైరాగ్యం]] సాధించాలి అంటారు పతంజలి మహర్షి.
 
సాధకుడు దృశ్యమానప్రపంచంలో తన అనుభవాలతో మమైక్యం కావడం క్లేశములకు హేతువు. ఆ భావాన్ని ఉపసంహరించుకోవాలి. వస్తువు, శబ్దము, అర్థము ఒకటే కావని గుర్తించి, వీటికి అతీతుడయిన పరమపురుషునియందు చిత్తమును నిలపడంకోసం సాధన చేయాలి.
 
ఇలా సాధన చేస్తే సాధకుడికి పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్తమూ స్వాధీనమవుతాయి. నిర్మలచిత్తము భగవంతునియందు సుస్థిరముగా నిలిపితే, స్వచ్ఛమైన మణివలె ఆ భగవంతుని ప్రతిఫలింపగల శక్తిని[[శక్తి]]<nowiki/>ని పొందుతుంది.
 
పూర్వజన్మలలో చేసిన సాధన స్మృతులుగా (వాసనలు) తరవాతి జన్మలలో కొనసాగుతాయి. ఆ పూర్వవాసనలు, సాధనలో ఏకాగ్రత, దృఢత – ఇవి ఎంత బలంగా ఉంటే అంత త్వరగా సమాధిస్థితిని చేరుకోగలడు.
 
తర్కం, నిశితపరిశీలన, పరంపరానుగతంగా పొందిన [[జ్ఞానం]] సమాధికి మార్గాలు. సాధనకి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ పద్ధతిని సాధకుడు ఎంచుకున్నా, శ్రద్ధతో తదేకధ్యానంతో చేస్తే శారీరకంగానూ, మానసికంగానూ దృఢత్వం కలుగుతుంది. ఈవిధంగా చేసిన సాధనమూలంగా సమాధిస్థితిలో ఒక స్థాయికి చేరుతాడు. అది సబీజసమాధి. ఆ బీజాన్ని కూడా తొలగించుకోడానికి సాధన కొనసాగించాలి.
 
సమాధి అంటే పరమపురుషునిలో ఐక్యము కావడం. ఆ పరమపురుషుడు కాలానికి అతీతుడు. గురువులందరికీ గురువు. ఆ పరమపురుషుని చిహ్నం ఓంకారం. ఓంకారము జపించడం సమాధికి మార్గం.
"https://te.wikipedia.org/wiki/పతంజలి" నుండి వెలికితీశారు