ప్రేమ పిచ్చి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
==కథ==
రవి సంపన్న యువకుడు. అతడికి నిప్పుగురించి విన్నా, నిప్పును చూసినా పిచ్చెక్కి పోతుంది. విదేశాలకు పంపిస్తే గాని ఈ జబ్బు నయం కాదని డాక్టర్లు సలహాలు ఇస్తారు. "నీకు జబ్బు. అది తగ్గడానికి విదేశాలకు వెళ్లాలి" అని చెబితే తన కొడుకు వెళ్లడేమోనని భయపడి రవి తండ్రి రవి స్నేహితుడు రాజాతో కలిసి నాటకం ఆడతాడు. ఫలితంగా రాజా పిచ్చివాడుగా రవి తోడు రాగా విదేశాలకు వెడతారు. అక్కడ నిర్మల అనే యువతి వారికి సాయపడుతుంది. నిర్మల నెమ్మదిగా రవికి అసలు సంగతి చెప్పి డాక్టర్లకు సహకరించవలసిందిగా నచ్చచెబుతుంది. నిర్మల సాహచర్యం వల్ల డాక్టర్ల కృషి వల్ల రవి మామూలు మనిషి అవుతాడు. స్వదేశానికి బయలుదేరేముందు అన్ని ప్రాంతాలను చూసి రావడానికి రవి, నిర్మల బయలుదేరతారు. రవిని హతమార్చి ఆస్తిని కాజేయాలనుకున్న రవి పినతండ్రి విదేశీ రౌడీలను ఆ పనికి పురమాయిస్తాడు. ఆ రౌడీలను ఎదుర్కొని రవి ఎలా స్వదేశానికి తిరిగి వస్తాడనేది పతాక సన్నివేశం<ref>{{cite news|last1=వి.ఆర్.|title=చిత్ర సమీక్ష: ప్రేమ పిచ్చి|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11557|accessdate=6 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 67, సంచిక 324|date=28 February 1981}}</ref>.
==మూలాలు==
 
{{మూలాల జాబితా}}
[[వర్గం:1981 తెలుగు సినిమాలు]]
[[వర్గం:డబ్బింగ్ సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_పిచ్చి" నుండి వెలికితీశారు