ప్రేమ పిచ్చి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
| gross =
}}
'''ప్రేమ పిచ్చి''' తమిళ భాష నుండి డబ్బింగ్ చేయబడిన సినిమా. తమిళంలో "[[:ta::உல்லாசப்பறவைகள்|ఉల్లాస పరవైగళ్]]" దీనికి మాతృక. ఇదే సినిమాను హిందీలో "దో దిల్ దివానే" పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రాన్ని విదేశాలలో షూట్ చేశారు. ముఖ్యంగా [[న్యూయార్క్]], [[ఆమ్‌స్టర్‌డాం]] మొదలైన ప్రదేశాలలోని ప్రకృతి దృశ్యాలు, ప్రాచీన మందిరాలు, ప్రాచీన కళాఖండాలు చిత్రీకరించారు.
==కథ==
రవి సంపన్న యువకుడు. అతడికి నిప్పుగురించి విన్నా, నిప్పును చూసినా పిచ్చెక్కి పోతుంది. విదేశాలకు పంపిస్తే గాని ఈ జబ్బు నయం కాదని డాక్టర్లు సలహాలు ఇస్తారు. "నీకు జబ్బు. అది తగ్గడానికి విదేశాలకు వెళ్లాలి" అని చెబితే తన కొడుకు వెళ్లడేమోనని భయపడి రవి తండ్రి రవి స్నేహితుడు రాజాతో కలిసి నాటకం ఆడతాడు. ఫలితంగా రాజా పిచ్చివాడుగా రవి తోడు రాగా విదేశాలకు వెడతారు. అక్కడ నిర్మల అనే యువతి వారికి సాయపడుతుంది. నిర్మల నెమ్మదిగా రవికి అసలు సంగతి చెప్పి డాక్టర్లకు సహకరించవలసిందిగా నచ్చచెబుతుంది. నిర్మల సాహచర్యం వల్ల డాక్టర్ల కృషి వల్ల రవి మామూలు మనిషి అవుతాడు. స్వదేశానికి బయలుదేరేముందు అన్ని ప్రాంతాలను చూసి రావడానికి రవి, నిర్మల బయలుదేరతారు. రవిని హతమార్చి ఆస్తిని కాజేయాలనుకున్న రవి పినతండ్రి విదేశీ రౌడీలను ఆ పనికి పురమాయిస్తాడు. ఆ రౌడీలను ఎదుర్కొని రవి ఎలా స్వదేశానికి తిరిగి వస్తాడనేది పతాక సన్నివేశం<ref>{{cite news|last1=వి.ఆర్.|title=చిత్ర సమీక్ష: ప్రేమ పిచ్చి|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11557|accessdate=6 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 67, సంచిక 324|date=28 February 1981}}</ref>.
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_పిచ్చి" నుండి వెలికితీశారు