బంకుపల్లె మల్లయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==సంఘసంస్కరణ==
సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన మల్లయ్యశాస్త్రి హైందవ సాంప్రదాయంలో ఉన్న మూఢాచారాలను వ్యతిరేకించాడు<ref>{{cite news|last1=వేమకోటి|first1=సీతారామశాస్త్రి|title="కావ్యతీర్థ పురాణవాచస్పతి" కీ.శే. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11519|accessdate=6 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 67 సంచిక 331|date=8 March 1981}}</ref>. తన రెండవభార్యవలన కలిగిన ప్రథమకుమారుని జనన సమయంలో వారి ఆచారం ప్రకారం నల్లమేకను శక్తికి బలి ఇవ్వవలసి ఉండగా ఇతడు ఆ ఆచారాన్ని విసర్జించాడు. స్త్రీ పునర్వివాహము శాస్త్రీయమని అనేక సభలలో వాదించి నిరూపించాడు. స్త్రీ విద్య ఆవస్యకత గురించి ఉపన్యాసాలు చేశాడు. అంతే కాకుండా తన ద్వితీయభార్యకు విద్య నేర్పించి మూడు ప్రభందములు, భారత భాగవత పురాణాలను నేర్పించాడు. ఇతడు నేర్పిన విద్య కారణంగా ఆమె సంగ్రహ రామాయణము, మరికొన్ని గ్రంథాలను రచించగలిగింది. ఇతడు [[ఆంధ్రపత్రిక]], [[భారతి (మాస పత్రిక)|భారతి]] పత్రికలద్వారా ధర్మశాస్త్రములను పరిశీలించి అందలి విషయాలను సప్రమాణకంగా ప్రకటించేవాడు. రజస్వలానంతరమగు పురుష సంయోగార్హ కాలమే స్త్రీలకు వివాహకాలం అన్న సిద్ధాంతాన్ని ప్రకటించి నిరూపించాడు. స్త్రీ పునర్వివాహము పూర్వాచారము కాకపోయినప్పటికి శాస్త్రీయము కాబట్టి ఆచరణీయమని ఇతడు వాదించాడు. సతీ శాసనము వచ్చిన తర్వాత పునర్వివాహము అవశ్యకత కలిగినదని ఇతడు వాదించి పత్రికలలో చర్చ కొనసాగించాడు. శారదా చట్టం ప్రతిపాదించిన కాలంలో ఆ చట్టానికి అనుకూలంగా మద్రాసు మొదలైన పలు ప్రాంతాలలో పెద్దపెద్ద సభలలో చర్చలు చేసి పండితులతో రజస్వలానంతర వివాహమే శాస్త్రీయమని అంగీకరింపచేశాడు. తన కుమార్తె కృష్ణవేణమ్మకు పునర్వివాహం చేయడమే కాకుండా శాఖాంతర వివాహం చేసి ఆకాలంలో ఆదర్శంగా నిలిచాడు. అస్పృశ్యతావ్యతిరేకంగా ఆంధ్రపత్రిక, త్రిలిఙ్గ పత్రికలలో వ్యాసములు వ్రాశాడు. మద్రాసు, నెల్లూరు, గుంటూరు, గోదావరి, కృష్ణ, విశాఖపట్నం, గంజాం మండలాలలో తిరిగి అస్పృస్యతాప్రచారం చేశాడు. శూద్రులను తన ఇంటికి పిలిచి వారితో పాటు భోజనము చేసేవాడు. అప్పారావు అనే ఒక బ్రాహ్మణేతరుడిని తన ఇంటిలోనే ఉంచుకుని తన కుమారులతో పాటుగా చదువు సంధ్యలు చెప్పాడు.
 
==వ్యక్తిత్వము==