పిట్ ఇండియా చట్టం: కూర్పుల మధ్య తేడాలు

"Pitt's India Act" పేజీని అనువదించి సృష్టించారు
"Pitt's India Act" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''పిట్ ఇండియా చట్టం'''గా ప్రాచుర్యంలో ఉన్న''' ఈస్టిండియా కంపెనీ చట్టం 1784''', [[1773 నాటి నియంత్రణా చట్టం]]<nowiki/>లోని లోపాలను సవరించి [[భారతదేశంలో కంపెనీ పాలన|భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన]]<nowiki/>ను బ్రిటీష్ ప్రభుత్వం నియంత్రణ కిందికి తీసుకువచ్చే [[గ్రేట్ బ్రిటన్ పార్లమెంటు]] చట్టం. ఆనాటి బ్రిటీష్ ప్రధాని విలియం పిట్ పేరిట దీన్ని పిట్ ఇండియా చట్టంగా పిలిచారు. దీని ప్రకారం [[బ్రిటీష్ ఇండియా]] పరిపాలన కంపెనీ, బ్రిటీష్ ప్రభుత్వం రెండూ సంయుక్తంగా నిర్వహిస్తాయి, అయితే అంతిమ అధికారం బ్రిటీష్ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. రాజకీయ వ్యవహారాలను చూసేందుకు ఆరుగురు సభ్యులతో బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ ని, ఆర్థిక వ్యవహారాలను చూసుకునేందుకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఏర్పరిచింది.
 
== నేపథ్యం ==
1773లో ఈస్టిండియా కంపెనీ దారుణమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ బ్రిటీష్ ప్రభుత్వ సహకారాన్ని కోరింది. ఈ పరిస్థితి భారతదేశంలోని కంపెనీ అధికారుల అవినీతి, పక్షపాత ధోరణులతో వచ్చింది. దాంతో 1773లో బ్రిటీష్ ప్రభుత్వం కంపెనీ కార్యకలాపాలను నియంత్రించడం కోసం ఒక నియంత్రణ చట్టాన్ని చేసింది. చట్టం ఏర్పరిచిన పద్ధతి ప్రకారం అది కంపెనీ వ్యవహారాలను, పనులను పర్యవేక్షిస్తుంది, తప్ప దాని అధికారాన్ని తన చేతిలోకి తీసుకోదు. 1773 నియంత్రణ చట్టం భారతదేశంలో బ్రిటీష్ పాలనకు తొలిమెట్టు.
"https://te.wikipedia.org/wiki/పిట్_ఇండియా_చట్టం" నుండి వెలికితీశారు