సేఫ్టి వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
లివరు సేఫ్టి వాల్వులో ఒక పోత ఇనుముతో చేసిన కేసింగు ఉండును.దాని నిలువు రంద్రం స్టీము బయటకు వచ్చు మార్గంగా పనిచేయును.ఈ కేసింగు ఆడుగు భాగాన్ని బోల్టుల ద్వారా బాయిలరు షెల్ పై భాగాన బిగించె దరు.కేసింగు నిలువు రంద్రం/నాజిల్ పైన వాల్వు సిటింగు రింగు వుండును.ఇది [[ఇత్తడి]]తో చెయ్యబడి వుండును.దీని మీద కరెక్టుగా వాల్వు డిస్క్ లేదా వాల్వు వుండును.వాల్వు వెనుక భాగం ఒక లివరు కు బిగించబడి వుండును. లివరు ఒక చివర లివరుకు బిగించిన వాల్వు డిస్కు, వాల్వు సిటింగు మీద ఖాళి లేకుండా అతుక్కుని ఉండేలా బలాన్ని కలుగ చేయును.లివరు రెండో చివర కేసింగుకు ఒక కీలుతిరిగెడు చీల (pivot)ద్వారా అనుసంధానమై వుండును. లివరు పక్కకు జరుగకుండా ఒక లివరు గైడు రాడ్/కడ్డి వుండును.లివరు చివర వున్న బరువును ముందుకు, వెనక్కి జరపడం ద్వారా వాల్వు మీద బలప్రభావాన్ని పెంచ వచ్చు,తగ్గించ వచ్చు.లివరు బరువు వలన వాల్వు మీద అదో పీడనంను కల్గించడం వలన సిటింగుమీద వాల్వుడిస్కు బలంగా అతుక్కుని ఉండును. బాయిలరులోని స్టీము,లివరు బరువుకన్న ఎక్కువ పీడనబలాన్ని కల్గి నపుడు లివరును వాల్వును పైకి లేపడం వలన అధికంగా వున్న స్టీము బయటకు వెళ్ళును.
===స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు===
ప్రధాన వ్యాసం :[[స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు]] చదవండి
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:పరికరాలు]]
"https://te.wikipedia.org/wiki/సేఫ్టి_వాల్వు" నుండి వెలికితీశారు