ఎలన్ మస్క్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
==స్పేస్ ఎక్స్==
రాకెట్‌ ముడి పదార్థాలకు అయ్యే ఖర్చులను లెక్కలు వేసుకొన్న మస్క్‌కు ఓ విషయం అర్థమైంది. మార్కెట్లో ఉన్న రాకెట్ల తయారీ అత్యంత చౌక అయిన విషయం. మార్కెట్‌ ధరలో మూడు శాతం ధరకే రాకెట్‌ను తయారు చేయవచ్చని భావించాడు. దీంతో తన సొంత డబ్బు 100 మిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టి 2002 మే నెలలో ‘స్పేస్‌ ఎక్స్‌’ను ప్రారంభించాడు. దీనికి నాసా ఆర్థిక సాయం అందజేసింది. ఇక్కడ తొలుత వైఫల్యాలు వెక్కిరించాయి. 2006లో స్పేస్‌ ఎక్స్‌ తొలిరాకెట్‌ను ప్రయోగించింది. 33 సెకన్లలోనే అది పేలిపోయింది. 2007, 2008లో చేసిన ప్రయోగాలు కూడా విఫలం కావడంతో మస్క్‌ ఆందోళనకు లోనయ్యాడు. స్పేస్‌ ఎక్స్‌ దివాళ తీయడం ఖాయమని పెట్టుబడిదారులు భావించారు. వారి వద్ద ఇంకా ఒక్క ప్రయోగానికే డబ్బు ఉంది. ఈ ప్రయోగం ఆయన జీవితాన్ని మార్చేసింది. 2008 సెప్టెంబర్‌లో ప్రయోగించిన ఫాల్కన్‌-1 రాకెట్‌ విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. దీంతో అదే ఏడాది నాసా 1.6బిలియన్‌ డాలర్ల భారీ కాంట్రాక్టును స్పేస్‌ఎక్స్‌కు అందజేసింది. ఈ కాంట్రాక్టు ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అవసరమైన సామగ్రిని తరలించాలి. దీనికోసం స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగాలు చేస్తోంది. 22 డిసెంబర్‌ 2015లో పునర్వినియోగానికి అవకాశం ఉన్న రాకెట్‌ను ప్రయోగించింది. ఈ రాకెట్‌ విజయవంతంగా మళ్లీ భూకక్ష్యలో నుంచి లాంచింగ్‌ప్యాడ్‌పైకి వచ్చింది. మానవ చరిత్రలో ఈ విధమైన ప్రయోగం విజయవంతం కావడం ఇదే తొలిసారి. ప్రైవేటు రంగంలో అతిపెద్ద రాకెట్‌ ఇంజిన్ల తయారీ సంస్థగా స్పేస్‌ ఎక్స్‌ అవతరించింది. తాజాగా బుధవారం ప్రయోగించిన ఫాల్కన్‌ హెవీ ప్రపంచలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌. ఈ రాకెట్‌ ద్వారా ఒక కారును అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. దీనికి వినియోగించిన కారు టెస్లా సంస్థది. టెస్లా కూడా మస్క్‌ ఆలోచనల్లో నుంచి పుట్టిన సంస్థే.
==టెస్లా కార్ల సంస్థ==
మస్క్‌ మానసపుత్రికల్లో టెస్లా ఒకటి. 2002లో స్పేస్‌ ఎక్స్‌ను ప్రారంభించిన తర్వాత 2003లో టెస్లాకు జీవం పోశాడు. రాకెట్ల వ్యయాన్నే తగ్గించాలనుకున్న మస్క్‌ కార్ల వ్యయాన్ని ఎందుకు తగ్గించకూడదు అని భావించాడు. ఈ ఆలోచన ప్రతిరూపమే టెస్లా. ఈ కంపెనీ విద్యుత్తు కార్లను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ తొలి కారు ‘రోడ్‌స్టర్‌’. అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారు చాలా ఖరీదైంది. దీంతో దీని లాంచింగ్‌ ఆలస్యమైంది. ఫలితంగా 2008లో కంపెనీ ఆర్థిక ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఎంతగా అంటే కంపెనీ మూతపడే స్థితికి వచ్చింది. దీంతో తనకు ఉన్నది మొత్తం టెస్లాలో పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత రోడ్‌స్టర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశాడు. అది భారీ విజయం సాధించింది. ఆ తర్వాత కంపెనీ వెనుదిరిగి చూసుకోలేదు. టెస్లా మోడల్‌ 3 కారును 35వేల డాలర్లకు అందజేస్తామని ప్రకటించింది. దీనికి రోజుకు 1800 బుకింగ్‌లు చొప్పున వచ్చాయి. 2017 నుంచి ఈ కారు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇదొక భారీ విజయం. ఇవే కాక ‘సోలార్‌ సిటీ’, ‘హైపర్‌ లూప్‌’, ఓపెన్‌ ఏఐ, న్యూరాలింక్‌ , ది బోరింగ్‌ కంపెనీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు మస్క్‌ ఆలోచనల నుంచి పుట్టినవే.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎలన్_మస్క్" నుండి వెలికితీశారు