స్వర్గం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
==కథ==
ఒక రిటైర్డ్ మిలటరీ ఆఫీసరు (సత్యనారాయణ) భార్య (ఎస్.వరలక్ష్మి) చండశాసనురాలు. ఆమెకు నలుగురు కొడుకులు. ఆమె అంటే కొడుకులకే కాదు ఆమె భర్తకు కూడా హడల్. ఆ ఇంటిని తన కట్టుబాటులో ఉంచడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నిస్తూ వుంటుంది. ఆమె రెండో కొడుకు భార్య ఉమ. ఆమె చెల్లెలు సుమ (జయసుధ) గడుగ్గాయి. అక్క ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన సుమ ఆంటీ దాష్టీకం చూసి ఆమెను ఓ ఆట పట్టించి దారిలోకి తేవాలని అనుకుంటుంది. ఆ ఇంటిలోని వారిని, రిటైర్డ్ మిలటరీ ఆఫీసరుతో సహా తన చిలిపి చేష్టలతో ఆకట్టుకుంటుంది. ఆ రిటైర్డ్ మిలటరీ ఆఫీసరు మూడో కొడుకు ఒక డాక్టరు. అతడు సుమను ప్రేమిస్తాడు. వీరిద్దరికీ పరిచయం కలహంతో ప్రారంభమై ప్రణయంగా పరిణమిస్తుంది. కాని వారి పరిణయానికి అడ్డుపడుతుంది రిటైర్డ్ మిలటరీ ఆఫీసరు భార్య. చివరకు ఆమె మనసు మార్చుకోవడం ఈ జంటకు పెళ్లి కావడం అనేది పతాక సన్నివేశం<ref>{{cite news|last1=గాంధీ|title=చిత్రసమీక్ష: స్వర్గం|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11636|accessdate=10 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 68, సంచిక 50|date=22 May 1981}}</ref>.
==పాటలు==
# వెయ్యనా తాళం వెయ్యనా నోటికి వెయ్యనా
# కొండపల్లి బొమ్మలాగా కులికే అమ్మాయి
# ప్రియమోహనా అనురాగమయ జీవనా
# ఈ గిలిగింత ఈ పులకింత కదిలించెను ఊహలు
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/స్వర్గం_(సినిమా)" నుండి వెలికితీశారు