కందుకూరి వీరేశలింగం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
వీరేశలింగం పంతులు [[1846]] [[ఏప్రిల్ 1626]] న [[రాజమండ్రి]]<nowiki/>లో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి [[ప్రకాశం|ప్రకాశం జిల్లా]] లోని [[కందుకూరు]] గ్రామం నుండి [[రాజమండ్రి]]కి [[వలస]] వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది.
 
వీరేశలింగానికి నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, [[ఆంధ్ర నామ సంగ్రహం]], [[అమరం]], [[రుక్మిణీ కళ్యాణం]], [[సుమతీ శతకం]], [[కృష్ణ శతకం]] మొదలైనవి నేర్చుకున్నాడు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో [[ఇంగ్లీషు]] చదువులో చేరాడు. చిన్నప్పటినుండి, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన పదమూడో యేట బాపమ్మ ([[కందుకూరి రాజ్యలక్ష్మమ్మ]]) అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసాడు.