పప్పు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[పప్పు]]''' లేదా '''పప్పు కూర''' [[ఆంధ్రులు]] ఎంతో ఇష్టంగా [[అన్నం]]లో కలుపుకొని తినే పదార్థం. [[తెలుగు]] వారి [[భోజనం]]లో తప్పనిసరిగా ఉండేది పప్పు. పప్పు భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళూ వేర్వేరు రకాలుగా చేస్తారు. వివిధ రకాల పప్పు దినుసులకు ఉడికించి రుచికరమైన [[కూర]]గా తింటారు. రుచి కోసం చాలా రకాల మసాలా, [[కూరగాయలు]] మొదలైన వాటిని చేర్చి అందరికీ నచ్చే విధంగా తయారుచేస్తారు. ఉత్తర హిందుస్థానంలో పప్పు కూరల్ని [[రొట్టె]]లు, [[చపాతీ]]లతో కలిపి తింటారు.
 
[[శనగలు]], [[మినుములు]], రాజ్మా, [[కందులు]], పెసర్ల వంటివి తరచుగా తింటూనే ఉంటాం. ఇలాంటి పప్పుల్లో, చిక్కుడుజాతి గింజల్లో పీచు, [[ప్రోటీన్లు]] దండిగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి. వెంటనే ఆకలి కాకుండా చూస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలోకి చక్కెర వెంటనే విడుదల కాకుండా చేస్తాయి. అంతేకాదు శరీరానికి బలాన్ని ఇవ్వటంతో పాటు జబ్బులను నివారించుకునే శక్తినీ అందిస్తాయి.
==రకరకాల పప్పు==
[[File:Masoor dal.JPG|right|thumb|కందిపప్పు]]
*'''కాబూలీ శెనగలు ''' : వీటిల్లోని పీచు రక్తంలో చక్కెర మోతాదులు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అందువల్ల కాబూలీ శనగలను తరచుగా తీసుకుంటే మధుమేహం ముప్పు తగ్గటానికి తోడ్పడతాయి. ఇవి చెడ్డ కొలెస్ట్రాల్‌ను (ఎల్‌డీఎల్), ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా గుండెజబ్బులూ దూరంగా ఉంటాయి. అయితే వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అప్పుడే ఎక్కువ లాభాలు.
*'''[[రాజ్మా]]''':విషయగ్రహణ శక్తిని పెంపొదించే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు రాజ్మాలో అధికంగా ఉంటాయి. అలాగే క్యాన్సర్‌ను నివారించే యాంటీఆక్సిడెంట్లూ, అల్త్జెమర్స్ బారినపడకుండా చూసే థైమీన్ కూడా దండిగానే ఉంటాయి.
*'''[[ఉలవలు]]''':[[ఇనుము]], క్యాల్షియం, మాలిబ్డినమ్ వంటివి ఉలవల్లో దండిగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ గుణాలు గల ఫాలీఫెనాల్స్ కూడా ఎక్కువే. ఇవి క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. యాంటీబోడీలు, స్వీయరోగనిరోధక చర్యల్లో కనిపించే హీమగ్లుటినిన్ కూడా వీటిల్లో కనిపిస్తుంది. ఉలవలు కొలెస్ట్రాల్, కడుపు ఉబ్బరం తగ్గటానికీ తోడ్పడతాయి.
*'''[[సోయాబీన్స్]]''':వీటిల్లో మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలూ ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి బాగా తోడ్పడతాయి. ప్రస్తుతం వీటితో తయారుచేసిన [[పాలు]], టోఫూ వంటివీ అందుబాటులో ఉంటున్నాయి. అయితే సోయాబీన్స్ ఉత్పత్తులను పరిమితంగానే తినాలి.
* [[కందిపప్పు]]
* [[పెసరపప్పు]]
"https://te.wikipedia.org/wiki/పప్పు" నుండి వెలికితీశారు