"వాడుకరి చర్చ:Pavan santhosh.s" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ఎప్పుడైనా నా ఎడిట్లు తటస్థ సమాచారినికి విరుధంగా ఉంటే దయచేసి తెలియపరచండి నేను నా ఎడిట్లు సవరించుకుంటాను [[వాడుకరి:Jiksaw1|Jiksaw1]] ([[వాడుకరి చర్చ:Jiksaw1|చర్చ]]) 03:51, 16 ఫిబ్రవరి 2018 (UTC)
: [[వాడుకరి:Jiksaw1|Jiksaw1]] గారూ, సమకాలీన సమాజంలో కమ్మవారు క్షత్రియ వర్ణస్తులుగా చెప్పుకోవట్లేదన్నది, క్షత్రియ వర్ణస్థులు సాధారణంగా అనుసరించే ఉపనయనాది పద్ధతులు అనుసరించరన్నది సామాన్య అవగాహన. కొందరు పరిశోధకులు ఇది సరికాదు, వారు పూర్వం క్షత్రియులు ఏవో కొన్ని సాక్ష్యాధారాల పరిశోధనల ద్వారా నిరూపించి వుంటే ఏం చేయాలి? "మొదట్లోనూ, పలు శతాబ్దాల పాటు కమ్మవారు క్షత్రియులని ఫలానా చరిత్రకారుడు పలు సాక్ష్యాధారాలతో పేర్కొన్నారు" అని ఓ ముక్క ఉండడం తటస్థ దృక్పథం. ఆ చరిత్రకారుడి సిద్ధాంతం వ్యక్తులుగా మీరు నమ్మవచ్చు, నేనూ నమ్మితే నమ్మవచ్చు, వికీపీడియా వ్యాసం దానిని ప్రతిబింబించకూడదు, ఒకానొక సిద్ధాంతంగా ప్రస్తావించి ఊరుకోవాలి. అలా కాకుండా అదే విషయాన్ని నిర్ధారిస్తూ (కమ్మ క్షత్రియ అంటే భావయ్య గారి సిద్ధాంతాన్ని వ్యాసం ఒప్పుకున్నట్టు అవుతుంది) రాస్తే తటస్థ దృక్పథానికి భంగకరం. మీరు మరో విషయం గ్రహించాలి, ఒక కులాన్ని గురించిన వ్యాసంలో ఎంతసేపూ క్షత్రియులా కాదా అన్న విషయాన్ని తిప్పితిప్పి రాసుకుంటూ కూర్చుంటే, వ్యవసాయ రంగంలో, సినీ రంగంలో, వ్యాపార రంగంలో, వైద్యరంగంలో, మరెన్నో రంగాల్లో ఈ కులస్తులు సాధించిన విషయాల మాట ఏం చేద్దాం. మనం ఒక అంశం (అది ఇక్కడ కులం) మీద విజ్ఞాన సర్వస్వ వ్యాసం రాస్తూ ఉన్నాం కదా, దానికి సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా ప్రతిబింబించాలా, వద్దా? కాబట్టి మీరు విషయాన్ని అన్ని వైపుల నుంచీ చూస్తే, తెవికీ వ్యాసాన్ని తటస్థంగా రూపకల్పన చేసేందుకు సాయం చేసేవారు అవుతారు. ఇది వికీపీడియా సంగతి. ఇక వికీపీడియా వ్యాసాల సంగతి వదిలేసి చారిత్రక అవగాహన ప్రకారం చూసుకున్నా''పూర్వం కమ్మ కులస్తులు పలు రాజ్యాలు, సామంత రాజ్యాలు పరిపాలించినవారిలోనూ, సైన్యాధ్యక్షులుగా, మండలాధీశులుగా వ్యవహరించినవారిలోనూ ఉన్నారు'' అన్న ఏకాభిప్రాయం ఉన్న ముక్క రాస్తే వచ్చిన లోటేమిటో నాకు అర్థం కావట్లేదు. అంతేకాక నేను పలుమార్లు మొత్తుకుంటున్న విషయం క్షత్రియ వర్ణస్థులే ఈ దేశాన్ని పరిపాలించారన్న అవగాహన సరికాదు. రాజ్యం కలిగినవాడు రాజయ్యాడు, అంతే కానీ ఫలానా వర్ణస్తులు పరిపాలించాలని అని ఎక్కడో రాసుంది కదాని బంగారు పళ్ళెంలో ఒప్పగించరు, ఒప్పగించలేదు. కాబట్టి క్షత్రియ వర్ణస్తులా కాదా అన్నది అప్రస్తుతం. ఏతావతా నేను చెప్పవచ్చేది ఏమంటే - కమ్మవారు క్షత్రియులా కాదా అన్న చర్చ వికీపీడియాలాంటి మూడోస్థాయి మూలం (ఇది పరిశోధనలు, పరిశీలనలను కేవలం సంకలనం చేసి ఊరుకుంటుంది)లో పనికిరాదు. సింపుల్ గా ఫలానా రాఘవయ్య చౌదరి అనే చరిత్రకారుని పరిశోధనలో కమ్మవారు పూర్వం క్షత్రియ వర్ణస్తులని రాసేసి ఊరుకుని, మిగతా అంశాల మీద పనిచేయాలి. నమస్కారం. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 10:41, 16 ఫిబ్రవరి 2018 (UTC)
 
మీ సూచనని తప్పక పాటిస్తాను పవన్ గారు. నేను వికిపీడియాకు కొత్త నాకు నిబంధనలు తెలియవు. నేను వాటిని నేర్చుకొని అనుసరిస్తాను [[వాడుకరి:Jiksaw1|Jiksaw1]] ([[వాడుకరి చర్చ:Jiksaw1|చర్చ]]) 06:29, 17 ఫిబ్రవరి 2018 (UTC)
 
== ఈ లింక్‌లో ఉన్న విషయాన్ని తర్జుమా చేసి అందించగలరా... ==
326

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2304087" నుండి వెలికితీశారు