కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
'''కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా]], [[మహదేవపూర్|మహదేవ్ పూర్]] మండలం [[కాళేశ్వరం]] గ్రామంలో వెలసిన ఆలయం. దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర [[గోదావరి]] నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత.<ref name="తెలంగాణ పర్యాటక రంగం-విశేషాలు">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=నిపుణ|title=తెలంగాణ పర్యాటక రంగం-విశేషాలు|url=https://www.ntnews.com/Nipuna-Education/తెలంగాణ-పర్యాటక-రంగం-విశేషాలు-15-2-476772.aspx|accessdate=17 February 2018|date=18 August 2015}}</ref>
 
== స్థల పురాణం - విశిష్టత ==
గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.
 
ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, [[ప్రాణహిత]] సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం.<ref name="కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం">{{cite web|last1=మన టెంపుల్స్.నెట్|title=కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం -కాళేశ్వరం|url=http://manatemples.net/pages/p_kaleswaram.htm|website=manatemples.net}}</ref>
 
== మూలాలు ==