తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 39:
== జననం ==
[[కృష్ణా జిల్లా]] [[ముదినేపల్లి]] మండలం [[చినపాలపర్రు]] లో తమ్మారెడ్డి వెంకటాద్రి, సౌభాగ్యమ్య దంపతులకు[[1920]] [[అక్టోబరు]] నాలుగో తేదీన జన్మించాడు. 'గోరా' ప్రభావానికి లోనయ్యాడు. [[మాలపల్లి]]లో సహ పంక్తి భోజనాలు చేసిన అభ్యుదయవాది. [[కమ్యూనిస్ట్]] పార్టీలో సభ్యుడిగా చేరి 'స్వతంత్ర భారత్' అనే పత్రిక వ్రాతప్రతిని చుట్టుపక్కల గ్రామాల్లో సర్క్యులేట్ చేశారు. సూరపనేని శేషగిరిరావుతో కలసి ట్యుటోరియల్ ప్రారంభించాడు. సినిమాలవైపు ఆకర్షితుడయ్యాడు. 1945లో కృష్ణవేణిని వితంతు వివాహం చేసుకున్నారు. 1950 నవంబర్‌లో మద్రాసుకు మకాం మార్చిన కృష్ణమూర్తి మొదట్లో ట్యూషన్లు చెప్పుకుంటూ కొంత కాలం గడిపారు. [[కొడవటిగంటి కుటుంబరావు]] పేరు పెట్టిన 'పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్' సంస్థలో [[తాతినేని ప్రకాశరావు]] దర్శకత్వంలో తొలిసినిమా ''[[పల్లెటూరు]]'' తీసాడు. సారథి సంస్థ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, జనరల్ మేనేజర్‌గా ఎన్నో చిత్రాల నిర్మాణానికి కృషి చేశాడు. ''సారథి నా విశ్వవిద్యాలయం'' అంటాడు. తెలుగు, తమిళం లలో సుప్రసిద్ధ నటీనటులతో పదమూడు చిత్రాలు తీశాడు. [[హైదరాబాద్]]లో '[[సారథి స్టూడియో]]' ఏర్పాటుకు కృషి చేశాడు. ఆయనే దానికి తొలి జనరల్ మేనేజరు. 'ఏరువాక సాగారో' పాటకు నర్తించిన [[వహీదా రెహమాన్]]ను తీసుకొచ్చింది కృష్ణమూర్తే. 1962 లో తానే సొంతంగా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో [[రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్]] ప్రారంభించాడు. ఆయనకు రవీంద్ర కవి అంటే ప్రాణం. ఆయన సంస్థలన్నీ ''రవీంద్ర''తోనే మొదలయ్యాయి. [[లక్షాధికారి]], [[జమీందారు]], [[బంగారుగాజులు]], [[ధర్మదాత]], [[సిసింద్రీ చిట్టిబాబు]], [[దత్తపుత్రుడు]], [[డాక్టర్ బాబు]], [[
ప్రముఖ దర్శకుడు, నిర్మాత [[తమ్మారెడ్డి భరద్వాజ]] ఈయన కుమారుడు.<ref>[http://www.idlebrain.com/celeb/interview/interview_tammareddy.html Interview with Tammareddy Bharadwaja by Jeevi]</ref>
|