గుండు హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
విజయవాడలో 1956 అక్టోబరు 10న కాంతారావు, సరోజిని దంపతులకి జన్మించిన గుండు హనుమంతరావు పదో తరగతి వరకు అక్కడే చదువుకొన్నారు. అనంతరం కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. చాక్లెట్లు, బిస్కెట్ల వ్యాపారంలో కొనసాగుతూనే నాటకాలతో మంచి పేరు తెచ్చుకొన్నారు. ‘ఆగండి కొంచెం ఆలోచించండి’, ‘ఓటున్న ప్రజలకి కోటి దండాలు’, ‘రాజీవం’, ‘ఇదేవిటి?’ నాటకాలతో ఆయన మంచి గుర్తింపును తెచ్చుకొన్నారు. 1985లో మద్రాసులో ‘ఇదేవిటి?’ నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ముఖ్య అతిథులుగా దర్శకుడు జంధ్యాలతోపాటు, నటుడు సాక్షి రంగారావు హాజరయ్యారు. నాటకం అయిపోయాక జంధ్యాల ‘బాగా చేశావ్‌’ అని మెచ్చుకొని సినిమా అవకాశమిస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే రెండేళ్ల తర్వాత ‘సత్యాగ్రహం’ అనే చిత్రంలో నటించే అవకాశాన్నిచ్చారు జంధ్యాల. అయితే ఆ చిత్రం విడుదలలో ఆలస్యమవడంతో ‘అహనా పెళ్లంట’ చిత్రంతోనే గుండు తొలిసారి వెండితెరపై మెరిశారు. పెళ్లి కొడుకు తండ్రి పాత్రలో కనిపించి నవ్వులు పంచారు. ముప్పయ్యేళ్ల వయసులో అరవయ్యేళ్ల వృద్ధుడిగా కనిపించి మెప్పించారు గుండు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డివంటి అగ్ర దర్శకులు తెరకెక్కించిన పలు చిత్రాల్లో గుండు మెరిశారు. ‘కళ్ళు’, ‘బాబాయ్‌ హోటల్‌’, ‘కొబ్బరి బోండాం’, ‘యమలీల’, ‘చినబాబు’, ‘రక్త తిలకం’, ‘బ్రహ్మపుత్రుడు’, ‘చెవిలో పువ్వు’, ‘ఘటోత్కచుడు’, ‘మాయలోడు’, ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘ఆలస్యం అమృతం’, ‘క్రిమినల్‌’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘తప్పు చేసి పప్పుకూడు’, ‘పెళ్లికాని ప్రసాద్‌’, ‘అన్నమయ్య’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’, ‘మృగరాజు’, ‘జల్సా’... ఇలా 400పై చిలుకు చిత్రాల్లో నటించిన ఆయన ప్రేక్షకుల్ని నవ్వించారు. ‘అమృతం’ ధారావాహిక ఆయన జీవితంలో మరో మలుపు. అందులో పోషించిన అంజి పాత్రని, అందులో గుండు హావభావాల్ని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు. బుల్లితెర ద్వారా మూడు నంది పురస్కారాలు సొంతం చేసుకొన్నారు గుండు.<ref name="గుండు హనుమంతరావు ఇక లేరు! ">{{cite web|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=6|title=గుండు హనుమంతరావు ఇక లేరు! |publisher=eenadu.net|date= 2018-02-20|accessdate=2017-01-20}}</ref>
==పేరు తెచ్చిన పాత్రలు==
‘అహనా పెళ్లంట’లో గుండు హనుమంతరావు చేసింది చిన్నపాత్రే. కానీ చివర్లో వచ్చి ‘వినబళ్లా...’ అంటూ ఆ పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది. ‘నువ్వు లేక నేను లేను’ చిత్రంలో ‘యావత్‌ భక్తులకి విజ్ఞప్తి, మా గురువుగారైన పండు శాస్త్రి తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడిలాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి...’ అంటూ బ్రహ్మానందంతో కలిసి పండించిన ఆయన కామెడీ కితకితలు పెట్టించింది. బ్రహ్మానందంతోనూ, రాజేంద్రప్రసాద్‌తోనూ, అలీతోనూ కలిసి పలు చిత్రాల్లో నవ్వించారు గుండు. అమాయకత్వంతో వ్యవహరిస్తూ సాగే అసిస్టెంట్‌ పాత్రల్లో తన మార్క్‌ నటనని ప్రదర్శించారు. ‘కళ్ళు’ చిత్రంలో ఆయన నటన మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. బుల్లితెరపై ‘అమృతం’ ధారావాహికలో అంజిగా గుండు హనుమంతరావు పంచిన స్వచ్ఛమైన వినోదం ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. వేదికలపై ఆయన విసిరిన పంచ్‌లు, మాటల విరుపులతో కూడిన సంభాషణలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. <ref name="గుండు హనుమంతరావు ఇక లేరు! " />
==చివరి రోజులు==
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/గుండు_హనుమంతరావు" నుండి వెలికితీశారు