గుండు హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
‘అహనా పెళ్లంట’లో గుండు హనుమంతరావు చేసింది చిన్నపాత్రే. కానీ చివర్లో వచ్చి ‘వినబళ్లా...’ అంటూ ఆ పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది. ‘నువ్వు లేక నేను లేను’ చిత్రంలో ‘యావత్‌ భక్తులకి విజ్ఞప్తి, మా గురువుగారైన పండు శాస్త్రి తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడిలాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి...’ అంటూ బ్రహ్మానందంతో కలిసి పండించిన ఆయన కామెడీ కితకితలు పెట్టించింది. బ్రహ్మానందంతోనూ, రాజేంద్రప్రసాద్‌తోనూ, అలీతోనూ కలిసి పలు చిత్రాల్లో నవ్వించారు గుండు. అమాయకత్వంతో వ్యవహరిస్తూ సాగే అసిస్టెంట్‌ పాత్రల్లో తన మార్క్‌ నటనని ప్రదర్శించారు. ‘కళ్ళు’ చిత్రంలో ఆయన నటన మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. బుల్లితెరపై ‘అమృతం’ ధారావాహికలో అంజిగా గుండు హనుమంతరావు పంచిన స్వచ్ఛమైన వినోదం ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. వేదికలపై ఆయన విసిరిన పంచ్‌లు, మాటల విరుపులతో కూడిన సంభాషణలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. <ref name="గుండు హనుమంతరావు ఇక లేరు! " />
==చివరి రోజులు==
ఈటీవీలో 2017 డిసెంబరులో ప్రసారమైన ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆయన చివరిసారిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతోనే గుండు హనుమంతరావు అనారోగ్యానికి గురైన విషయం అందరికీ తెలిసింది. ‘గుండెకి బైపాస్‌ సర్జరీ జరిగింది. దాదాపు 12 కిలోలు బరువు తగ్గాను. ఆ తర్వాత కిడ్నీ సమస్య ఏర్పడింది. చికిత్స కోసం యేడాదికి రూ.6 లక్షలు ఖర్చవుతోంది’ అని ఆ కార్యక్రమంలో చెప్పారు గుండు. ఆయన పరిస్థితిని తెలుసుకొని కథానాయకుడు చిరంజీవి రూ.2 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆర్థిక సహాయం అందించింది.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/గుండు_హనుమంతరావు" నుండి వెలికితీశారు