సేఫ్టి వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{under construction}}
'''సేఫ్టి వాల్వు ''' అనగా విపత్తు లేదా ప్రమాదం నుండి తప్పించు రక్షక లేదా సురక్షక కవాటం.ఒక పాత్ర లేదా ఒక గొట్టంలో ప్రవహిస్తున్న[[ ద్రవం]] లేదా [[వాయువు]],లేదా ఆవిరి నిర్దేశించిన ప్రమాణం కన్నఎక్కువ పీడన స్థాయికి చేరినపుడు, వాల్వు తెరచుకుని కొంత పరిమాణంలో ద్రవాన్ని లేదా వాయువు/ఆవిరిని బయటికి వదిలి పీడనస్థాయిని తగ్గించు పరికరం సేఫ్టి వాల్వు<ref>{{citeweb|urlhttps://web.archive.org/web/20170808081828/http://www.fkis.co.jp/eng/product_valve.html|title=what is safety valve?|publisher=fkis.co.jp|accessdate=23-02-2018}}</ref>.
==బాయిలరులో సేఫ్టి వాల్వు వాడకం==
[[బాయిలరు]]లో సేఫ్టి వాల్వు వాడకం తప్పని సరి.ఒకటి కాదు రెండు సేఫ్టి వాల్వులను బాయిలరు మీద అమర్చుతారు.[[ఫైరు ట్యూబు బాయిలరు]] అయినచో ప్రధాన డ్రమ్ము లేదా సిలిండరు మీద అమర్చుతారు. [[వాటరు ట్యూబు బాయిలరు]] అయినచో స్టీము డ్రమ్ము పైన బిగిస్తారు. వాటరు ట్యూబు బాయిలరులో ఒకటి కన్న ఎక్కువ డ్రమ్ములున్నచో, స్టీము కలెక్టు/జమ అగు డ్రమ్ము మీద లేదా ఎక్కువ స్టీము ఉత్పత్తి అగు డ్రమ్ము పైన అమర్చుతారు.ప్రతి బాయిలరుకు రెండు సేఫ్టి వాల్వులు బిగించబడి వుండును.ఒక సేఫ్టి వాల్వును బాయిలరు పనిచేయు [[పీడనం]] / వర్కింగు ప్రెసరుకన్న అరకేజీ ఎక్కువ పీడనం బాయిలరులో ఏర్పడగానే తెరచు కునేలా,మరో సేఫ్టి వాల్వును పనిచేయు పీడనం /వర్కింగు ప్రెసరు కన్న ఒక కేజీ ఎక్కువ పీడనం బాయిలరులో ఏర్పడగానే తెరచుకునేలా ఏర్పాటు చెయ్యబడి వుండును. ఇలా రెండు సేఫ్టి వాల్వులు వేరు వేరు పీడనాల వద్ద తెరచు కొనునట్లు అమర్చుటకు కారణం బాయిలరు రక్షణ దృష్టి తోనే.ఏదైనా కారణంచే బాయిలరు పీడనం కన్న అరకేజీ ఎక్కువ ఉన్న సేఫ్టి వాల్వు తెరచుకోననిచొ,ఒక కేజీ ఎక్కువగా సెట్ చేసిన రెండో వాల్వు తెరచు కొనును.
"https://te.wikipedia.org/wiki/సేఫ్టి_వాల్వు" నుండి వెలికితీశారు