సమీర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సమీర్ రెడ్డి''' భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు [[తెలుగు భాష|తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[హిందీ భాష|హిందీ]] సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.
 
==విశేషాలు==
ఇతడు [[హైదరాబాద్|హైదరాబాదు]]లో జన్మించాడు. [[రాజమండ్రి]]లో పెరిగాడు. ఇతడు ఇంటర్‌మీడియట్ వరకు రాజమండ్రిలో చదివాడు. ఇతడు లెదర్ టెక్నాలజీలో డిగ్రీ చదవడానికి మద్రాసులోని గిండీ ఫుట్‌వేర్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు కాని అతనికి అది నచ్చకపోవడంతో మానివేశాడు. ఇతని బంధువు [[రసూల్ ఎల్లోర్|రసూల్]] ప్రేరణతో ఇతడు సినిమా రంగం వైపు ఆసక్తిని కనబరచాడు. [[తేజ]] వద్ద సహాయకునిగా రాత్, [[అంతం (సినిమా)|అంతం]], [[రక్షణ]], [[మనీ (సినిమా)|మనీ]], బాజీ సినిమాలలో పనిచేశాడు. ఇతడు ఛాయాగ్రాహకునిగా పనిచేసిన మొదటి చిత్రం సునీల్ శెట్టి, సోనాలి బెంద్రెలు నటించిన భాయ్ అనే హిందీ సినిమా. తెలుగులో ఇతడు పనిచేసిన మొదటి సినిమా ఉషాకిరణ్ మూవీస్ వారి [[ఆనందం]]. ఇంకా ఇతడు క్విక్‌ శాండ్ అనే హాలీవుడ్ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు<ref>[http://www.idlebrain.com/celeb/interview/sameerreddy.html సమీర్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా]</ref>.
 
==ఫిల్మోగ్రఫీ==
"https://te.wikipedia.org/wiki/సమీర్_రెడ్డి" నుండి వెలికితీశారు