మోల్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
==ప్రస్తావన==
ఇంగ్లీషులో "[[మోల్]]" అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ కావలసిన అర్థం శాస్త్రీయ పరిభాషకి సంబంధించిన అర్థం మాత్రమే.
[[రసాయన శాస్త్రంలోశాస్త్రం]]<nowiki/>లో "మోల్" అనే భావం చాలా కీలకమైనది. ఈ మాట అర్థం కాక విద్యార్ధులు చాల తికమక పడుతూ ఉంటారు.
 
బజారుకి వెళ్లి సరుకులు కొన్నప్పుడు కొన్ని కొలమానాలు వాడతాం. డజను అరటి పళ్లు, వంద మామిడి పళ్లు, కుంచం బియ్యం, శేరు [[పాలు]], [[వీశ]] [[వంకాయలు]], బుట్టెడు రేగు పళ్లు, ఇలా ఉండేవి పాత రోజుల్లో కొలమానాలు. ఇంట్లో వంట వండేటప్పుడు చేరెడు [[బియ్యం]], చిటికెడు [[పసుపు]], ఇండుపగింజంత [[ఇంగువ]], అంటూ మరొక రకం కొలమానం వాడేవారు. అదే విధంగా రసాయన శాస్త్రంలో [[అణువులు]] (atoms), బణువులు (molecules), వగైరా రేణువులు ఎన్ని ఉన్నాయో కొలవడానికి "మోల్" అనే కొలమానం వాడతారు.
 
డజను అంటే 12 వస్తువులు, జత అంటే 2 వస్తువులు, పుంజీ అంటే 4 వస్తువులు, అయినట్లే మోల్ అంటే 602,000,000,000,000,000,000,000 వస్తువులు లేదా 602 హెక్సిలియను వస్తువులు. ఇది మన ఊహకి అందనంత పెద్ద సంఖ్య. ఉదాహరణకి ఒక మోలు చింతపిక్కలని పోగు పోసి, ఉండలా కడితే ఆ ఉండ మన భూమి అంత పెద్ద గోళం అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/మోల్" నుండి వెలికితీశారు