కవాటం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
==సేఫ్టి వాల్వులు/ రక్షణ కవాటాలు==
ఏదైనా [[ద్రవం]] లేదా [[వాయువు]] లేదా ఆవిరులు ఒక గొట్టంలో నిర్దేశించిన పనిచేయు [[పీడనం]] కన్నఎక్కువ పీడనస్థితికి చేరి ప్రవహిస్తున్నప్పుడు, లేదా ఏదైనా పాత్రలో వున్న ద్రవం లేదా వాయువు లేదా ఆవి రులు ఆపాత్ర యొక్క నిల్వ ఉంచు సామర్ధ్యం మించి పీడనంలో ఉన్నప్పుడు, ఏర్పడిన అధిక పీడనబలం వలన పైపులు లేదా పాత్ర విస్పొటన చెంది నష్టం వాటిల్లును. అలాంటి స్థితిలో అధిక పీడనం ఏర్పడినపుడు వాల్వు లు తెరచుకుని,పీడనం కల్గించు పదార్థాలను బయటికి పంపి, అధిక పీడనం తగ్గించి, తిరిగిమాములుగా నిర్దేశించిన పీడనస్థాయికి రాగానే మూసుకునే వాల్వులను రక్షణ కవాటాలు లేదా [[సేఫ్టి వాల్వు]]లు అంటారు<ref>{{citeweb|url=https://web.archive.org/web/20170808081828/http://www.fkis.co.jp/eng/product_valve.html|title=What is safety valve|publisher=fkis.co.jp|accessdate=25-02-2018}}</ref>. సేఫ్టివాల్వులను ఎక్కువగా బాయిలరులలో ,లేదా స్టీము లోకో మోటివ్ ఇంజనులలో ఉపయోగిస్తారు.లేదా సంపిడనంకావించిన గాలి పీడన నియంత్రణకు ఉపయోగిస్తారు.
 
సేఫ్టి వాల్వుల/ రక్షణ కవాటాల ఆకృతి మరియు పనిచేయు విధాన ఆధారంగా నాలుగైదు రకాలుగా వర్గీకరింఛారు.
అవి.1.[[సేఫ్టి వాల్వు|డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు]],2.[[సేఫ్టి వాల్వు|లివరు సేఫ్టి వాల్వు]],3.[[స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు]],4.[[సేఫ్టి వాల్వు| హై ప్రెసరు- లోవాటరు సేఫ్టి వాల్వు]].
 
==పీడన ఉపశమన కవాటాలు==
వీటిని ఆంగ్లంలో pressure relief valves అంటారు. ఇవి కూడా ఒకరకంగా సేఫ్టి వాల్వుల వంటివే. సేఫ్టి వాల్వులను ఎక్కువగా అధిక పీడనం వున్న నీటి ఆవిరి/స్టీమును బయటకు వదులుటకు ఉపయోగించగా, పీడన ఉపశమన కవాటాలను ద్రవ మరియు వాయు పదార్థాల పీడనాన్ని నియంత్రణలో వుంచుటకు ఉపయోగిస్తారు.ప్రవహించు పదార్థాల పీడనం పనిచేయుబ్పీడనం మించినచో ,అధిక పీడనం తగ్గేవరకు వాల్వు పాక్షికంగా తెరచుకొని ,వాల్వుకున్న మరో పైపు ద్వారా ప్రవాహ పదార్హాన్ని వెనుకకు పంపును.
"https://te.wikipedia.org/wiki/కవాటం" నుండి వెలికితీశారు