"వాడుకరి చర్చ:Jiksaw1" కూర్పుల మధ్య తేడాలు

మీ మార్పుల ద్వారా మాత్రమే కాక తొటి సభ్యులతోనూ మీరు వ్యవహరిస్తున్న తీరు అంత సంతృప్తిగా లేదు. ముందుగా తెవికీ పాలసీల గురించి కొంత చదవండి. తరువాత మీకు ఏవైనా మార్పులు చేయాలనిపిస్తే వాటి పై మొదట చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైతే కొనసాగించండి.... తెవికీ ఎవరికీ అనుకూలం కాదు. .. ఇక్కడ సభ్యులు తటస్థంగా మార్పులు చేస్తారు.. మీ సృజనాత్మక మార్పులు కుల సంభందితంగా కాక మిగతా వ్యాసాల్లో చేస్తే మాకందరికీ ఆనందం కలిగించిన వారవుతారు..మిత్రుడు..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్ (Viswanadh)]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 03:20, 16 ఫిబ్రవరి 2018 (UTC)
: Jiksaw1 గారూ! మీరన్న విషయాన్ని తటస్థతకు దెబ్బ తగలకుండా, వ్యాసం సమగ్రత చెడిపోకుండా [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE&type=revision&diff=2303789&oldid=2303637 ఇలా] తేలికగా రాయవచ్చు. ఈమాత్రానికి వాదోపవాదాలు, వ్యక్తిగత దాడులు అనవసరం సార్. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 10:56, 16 ఫిబ్రవరి 2018 (UTC)
==మీ మార్పులు==
ఎంతొ ప్రయాసపడి పరిశోధన చేసి నేను వ్రాసిన పలు వ్యాసాలను మీరు పేరులు మార్చి, పలు విధములుగా మార్పులు చేశారు. ముఖ్యముగా నాయకులను "రాజులు" గా సంబోధించి చరిత్రను వక్రీకరించుతున్నారు. విజయనగర రాజ్యములో ని సామంతరాజులు ఎప్పుడూ స్వతంత్ర రాజ్యములు ఏలలేదు. అలాగే ముసునూరి వారు కాకతీయ చక్రవర్తులపై గౌరవముతో తమను తాము రాజులు గా చెప్పుకొనలేదు. మరియొక కారణము పలు నాయకులను ఏకముచేసి ఓరుగల్లు విముక్తము చేసిన సంఘటితశక్తి ముసునూరి వారు. వారి గొప్పతనము చరిత్ర కొనియాడుతుంది. "రాజులు" అని అన్నంత మాత్రాన క్రొత్తగా గొప్పతనము రాదు. అటులనే కమ్మవారు క్షత్రియులు అని మార్పులు చేశారు. కమ్మవారి శాసనములన్నింటిలోను దుర్జయ వంశము, చతుర్ఠ కులము అనే చెప్పుకున్నారు. "క్షత్రియులు" అని అన్నంత మాత్రాన వారి గొప్పతనము పెరగదు. మీరు వ్యాసములో సోమశేఖర శర్మ గారి వాక్యాలు పరిశీలించండి. క్షత్రియ రాజులు, రాజ్యాలు తురకలకు లొంగిపోయిన సమయములో విప్లవము లేవదీసి రాజ్యవిముక్తిగావించిన నాయకులు ముసునూరి వారు. అంతకన్న గొప్పవిషయము ఏముంటుంది? దయచేసి చరిత్రను చర్రిత్రగా స్వీకరించండి.[[వాడుకరి:Kumarrao|Kumarrao]] ([[వాడుకరి చర్చ:Kumarrao|చర్చ]]) 19:12, 26 ఫిబ్రవరి 2018 (UTC)
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2306822" నుండి వెలికితీశారు