మెట్రిక్ పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
ప్రయోగం ద్వారా ఋజువు చెయ్యడం అంటే? ఇంటి నుండి పెద్ద బజారుకి ఎంత దూరం ఉంటుంది? ఒకటిన్నర కిలోమీటర్లు దూరం ఉంటుందేమో! ఏమో ఏమిటి, కొలిచి చూస్తే పోలా? అలా కొలిచి చూడడమే ప్రయోగం అంటే! బియ్యపు బస్తా బరువు ఎంతుంటుంది? గట్టు మీద కూర్చుని మెట్టవేదాంతం చెప్పడమెందుకు? కొలిచి చూస్తే పోలే! ఈ కొలవడాన్ని ఇంగ్లీషులో measurement అంటారు, అలా కొలువగా వచ్చిన విలువని కూడా measurement అనే అంటారు. దీనిని మనం తెలుగులో “కొలత” అంటాం. కనుక కొలవడం అంటే ఒక లక్షణానికి ఒక విలువ (value), ఒక మూర్తం (unit) ఇవ్వడం. కొలవడానికి ఒక కొలముట్టు (measuring tool) కావాలి. బరువుని కొలవడానికి త్రాసు, కాలాన్ని కొలవడానికి గడియారం, పొడుగుని కొలవడానికి గీట్ల బద్ద, వేడిని కొలవడానికి తాపమాపకం, వగైరాలు ఉన్నాయి. పొడుగుని కొలవడానికి మూర్తాలు (units) ఏమిటి? పొడుగుని (లేదా, దూరాన్ని) అంగుళాలలోను, గజాలలోను కొలవచ్చు లేదా మీటర్లలోను, కిలోమీటర్లలోనూ కొలవచ్చు.
 
పూర్వం “ఏబలం, పదలం" వగైరా కొలమానాలు వాడేవాౠవాడేవారు. (ఏబలం అంటే 5 పలాలు, పదలం అంటే 10 పలాలు!). ఆ రోజుల్లో తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలలో బరువులు కొలవడానికి వీశ, పదలం, ఏబలం, పౌను, తులం, వగైరాలు వాడేవారు. బందరులో అర్థ సేరు, సవాసేరు, నవటాకు, చటాకు, అంటూ మరొక రకం కొలతలు వాడేవారు. ఇంజనీరింగు కాలేజీలో మెట్రిక్ పధ్ధతి అంటూ గ్రాములు, సెంటీ మీటర్లు , అంటూ మరొక కొలమానం వాడేవారు.
 
===1 ప్రాథమిక కొలమానాలు===
ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు కొలమానాలు వాడుతూ ఉంటే పని చెయ్యటం కష్టం. అందుకని, ఎప్పుడో 18 వ శతాబ్దంలోనే ప్రాంసులో “మెట్రిక్ పధ్ధతి” ప్రవేశ పెట్టేరు. ఈ పద్ధతిలో పొడుగుని సెంటీమీటర్లలోను, గరిమ లేదా భారం (mass)ని గ్రాములలోను, కాలాన్ని సెకండ్లు లోను కొలవమని సిఫారసు చేసేరు. ఈ సందర్భంలో సెంటీమీటరు, గ్రాము, సెకండు అనేవి కొల మూర్తాలు (measuring units) వాడుకలోకి వచ్చేయి. ఉదాహరణకి, సాధారణ మెట్రిక్ పద్ధతిలో:
"https://te.wikipedia.org/wiki/మెట్రిక్_పద్ధతి" నుండి వెలికితీశారు