కళ్ళం అంజిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
సమాచార పెట్టెలో చిరు మార్పులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
| birth_date = 1940
| birth_place = [[తాడేపల్లి]], [[గుంటూరు జిల్లా]]
| death_date = 15మార్చి{{Death date and age|2013|03|15}}
| death_place = [[హైదరాబాద్, భారతదేశం|హైదరాబాద్]], [[ఆంధ్రప్రదేశ్]], భారతదేశం
| nationality = భారతీయుడు
| other_names =
| known_for = [[డా. రెడ్డీస్ ల్యాబొరేటరీస్]]
| occupation = హైదరాబాద్, [[డా.రెడ్డీస్ ల్యాబ్స్]]
| net_worth = (USD) $1.39 బిలియన్
పంక్తి 38:
ఔషధ మార్కెట్‌లో రక్షణాత్మక ధోరణులు పెరగటాన్ని, పేటెంట్ల పేరుతో అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా మార్కెట్లలో కొత్తవారికి ప్రవేశం కష్టం కావటాన్ని గుర్తించి ముందుగా మేల్కొన్న పారిశ్రామికవేత్త డాక్టర్‌ అంజిరెడ్డి అంటే అతిశయోక్తి కాదు. అమెరికా అతిపెద్ద ఔషధ మార్కెట్‌. స్వదేశంలో ప్రజలకు చౌకగా మందులు అందించిన ఆయన, సంస్థ కోసం.... భవిష్యత్తు పరిశోధనల కోసం డబ్బు సంపాదించాలంటే అమెరికా మార్కెట్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ అంతా పేటెంట్ల రాజ్యం. బహుళ జాతి సంస్థలు ఒక పట్టాన ఇతర కంపెనీలను అక్కడికి రానివ్వవు. అయినా తన పరిశోధన నైపుణ్యంతో అమెరికా మార్కెట్‌ను సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనువుగా ఎంతో కీలకమైన గుండె, డయాబెటిస్‌, క్యాన్సర్‌ తదితర విభాగాలను ఎంచుకున్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌కు పరిశోధన విభాగంలో వెన్నుదన్నుగా నిలిచేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. వందల మంది యువ శాస్త్రవేత్తలను నియమించి వారిలో ఒకడిగా కలిసిపోయి రాత్రింబవళ్లూ పరిశోధన కార్యకలాపాల్లో మునిగితేలారు. అమెరికా ఔషధ సంస్థ వద్ద పెద్దఎత్తున పేటెంట్‌ దరఖాస్తులు దాఖలు చేశారు. అక్కడ ఎన్నో న్యాయవివాదాలను ఎదురీదారు. దాని ఫలితాలు త్వరలోనే కనిపించాయి. పేటెంట్‌ గడువు తీరిన ఎన్నో ఔషధాలను అమెరికా మార్కెట్‌కు అందించటం ఒక ఎత్తయితే, ఆరు నెలల పాటు ప్రత్యేక మార్కెటింగ్‌ హక్కులతో అమెరికాలో తన ఔషధాలను విక్రయించే అనుమతి పొందిన అతికొద్ది భారతీయ కంపెనీల్లో ఒకటిగా నిలిచారు. ఆ తర్వాత ఐరోపా, రష్యా, మధ్యప్రాచ్యం... ఇలా డాక్టర్‌ రెడ్డీస్‌ విస్తరించని దేశం అంటూ లేదు. పరిశోధన లేనిదే ప్రగతి లేదని గట్టిగా విశ్వసించటంతో పాటు, దాని తూచ తప్పకుండా ఆచరణలో పెట్టిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. పరిశోధన కోసం వందల కోట్ల రూపాయిలు వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎదురుదెబ్బలు కూడా తప్పవు. ఇటువంటి అనుభవాలు ఆయనకూ ఎదురయ్యాయి. కానీ వాటికి ఎదురునిలిచారు. సమయానుకూలంగా వ్యాపార వ్యూహాలను మార్చుకున్నారు కానీ, పరిశోధన పథం నుంచి మాత్రం వైదొలగలేదు.
 
===రెడ్డేస్ లేబ్ల్యాబ్స్ మైలు రాళ్ళు===
* భారత్లో ముఖ్యమైన 300 బ్రాండ్ లలో రెడ్డీస్ వారివి 8 ఉన్నాయి.
* దేశంలో డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్ చేపట్టిన తొలి కంపెనీ
* జపాన్ బయట నమోదైన తొలి ఆసియా కంపెనీ, [[2001]]లో న్యూయార్క్ స్టాక్ ఎక్షేంజ్ఎక్స్చేంజ్ లో ప్రవేశించినది.
 
==అరుదైన వ్యక్తిత్వం==
అంజిరెడ్డికి ఆలకించే గుణం ఎక్కువ. ఎక్కువగా మాట్లాడడమన్నా, ఎక్కువగా మాట్లాడే వారన్నా ఆయనకు ఇష్టం ఉండదు. చెప్పదలచిన మాటలు సూటిగా, స్పష్టంగా, పదునుగా చెప్పటం ఆయనకు అలవాటు. ఉదయం వేళ నడకలో తనతో కలిసి వచ్చే వ్యక్తి తనను అవీఇవీఅవీ ఇవీ అడుగుతున్నారని ఇష్టపడక ఆయనను మార్చేసి అసలు ప్రశ్నలే అడగని వ్యక్తిని నడకలో సహచరుడిగా ఎంచుకున్న తత్వం ఆయనది. ఔషధ మార్కెట్లో ఏదైనా అరుదైన ఘనత సాధించినప్పుడు విజయ గర్వం ఆయన మొహంలో దరహాసమాడుతుంది కానీ బయటకు అంతగా కనిపించినివ్వరు. అదేవిధంగా ఏదైనా అపజయం ఎదురుపడినప్పుడు కుంగిపోవడం అనేదే ఉండదు. కొన్ని ఔషధాల విషయంలో వైఫల్యం ఎదురైనా, కొత్త ఔషధాలను ఆవిష్కరించి ప్రపంచానికి అందించాలనే ప్రయత్నంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలినా, తన వ్యాపార వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చినా కంగారుపడలేదు. మొండిగా ముందుకు వెళ్లటమే ఆయన నైజం. ఏదైనా విషయాన్ని వెంటనే గ్రహిస్తారు. ఎన్నో ఏళ్లుగా మీ కంపెనీలో వాటాదారుడిగా ఉన్నాం, కానీ ఈ కంపెనీ ఏయే మందులు తయారు చేస్తుందనేది మాకు తెలియటం లేదు, వార్షిక నివేదికలో ఆ విషయం లేదు అని ఒకసారి కంపెనీ వార్షిక సమావేశంలో ఒక వాటాదారుడు ప్రశ్నించారు. దాన్ని సరిదిద్దుతామని డాక్టర్‌ రెడ్డి బదులివ్వడమే కాక ఆ మరుసటి ఏడాది వార్షిక నివేదికలో డాక్టర్‌ రెడ్డీస్‌ తయారు చేసే ఔషధాల జాబితా కనిపించింది.
 
== సేవా కార్యక్రమాలు ==
అంజిరెడ్డికి ప్రజలకు ఔషధాలు విక్రయించి బాగా లాభాలు ఆర్జిస్తున్నారు, బదులుగా వారికేమైనా చేయాలనుకోరా? అని ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన ఆలోచనలో పడిపోయారు. ఆ తర్వాత స్వల్పకాలంలో పలు సామాజిక కార్యకలాపాలు రూపుదిద్దుకున్నాయి. ప్రజలకు ఉచితంగా ఏదైనా ఇవ్వడం కంటే వారిలో నైపుణ్యాన్ని పెంచితే సొంతంగా పైకి వస్తారని విశ్వసించి, దానికి అనుగుణంగా
 
* గ్రామీణ నిరుపేద యువకుల ఉపాధి శిక్షణ కోసం ''ల్యాబ్స్‌'' కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
* [[1998]]లో సేవాకార్యక్రమాలు ప్రారంభించిన రెడ్డీస్ సంస్థ మొదటగా [[నాంది]] పౌండేషన్ ప్రారంభించి కొన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నది.
* రెడ్డీస్ అనుబంధ సంస్థ హ్యూమన్ అండ్ సోషియల్ డెవలప్మెంట్ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది.
 
==చివరి రోజులు==
ఔషధఅంజి సంజీవిరెడ్డి కన్నుమూతమార్చి 15, (శుక్రవారం_15-March-2013) అనారోగ్యంతో చికిత్స పొందుతూ- తుదిశ్వాస విడిచారు. ఔషధ రంగంలో పేటెంట్ల రారాజు, తెలుగు రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయి కంపెనీ సృష్టి, ప్రపంచ ఫార్మా పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం దక్కడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయనకు 16-03-2013 హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరిగాయి.
 
ప్రస్తుతం కుమారుడు సతీష్‌రెడ్డి కంపెనీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, అల్లుడు జి.వి.ప్రసాద్‌ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పంక్తి 66:
* 2001 బిజినెస్ ఇండియా మ్యాగజైన్ నుండి బిజినెస్ మ్యాల్ ఆఫ్ ద ఇయర్
* 2011 పద్మశ్రీ
* 2005 హాల్ పాహ్ఆఫ్ ఫేం
* 2011 పద్మభూషన్
 
"https://te.wikipedia.org/wiki/కళ్ళం_అంజిరెడ్డి" నుండి వెలికితీశారు